Jee Karda తమన్నా బ్యూటిఫుల్ ఫోటోలు వైరల్.. ఆ సీన్లలో ముద్దొచ్చేలా మిల్కీ బ్యూటీ
1989 డిసెంబర్ 21న ముంబైలో జన్మించిన మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమల్లో నటిగా, మోడల్ గా, డ్యాన్సర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ ఒకే సంవత్సరం రెండు చిత్ర పరిశ్రమల్లో హీరోయిన్ గా డెబ్యూ చేసి అలరించింది. అలా చేసిన సౌత్ హీరోయిన్ గా తమన్నా పేరు తెచ్చుకుంది. 2005లో చాంద్ సా రోషన్ చెహ్రా మూవీతో హిందీలో ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి అదే సంవత్సరం శ్రీ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న ఈ భామ తాజాగా ఘాటు రొమాన్స్ చేస్తూ షాక్ ఇచ్చింది.

అలా అవకాశాలు: మంచు మనోజ్ నటించిన శ్రీ సినిమాతో ప్లాప్ చూసిన తమన్నాకు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ మూవీతో తిరుగులేని విజయం చూసింది. ఈ సినిమాతో యువతలో బీభత్సమైన క్రేజ్ సంపాదించుకుంది. ఒక్కసారిగా తమన్నా పేరు మారుమోగిపోయింది. దీంతో ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు రావడం ప్రారంభమైంది.

73 చిత్రాలకుపైగా: కొంచెం ఇష్టం కొంచె కష్టం, 100% లవ్, ఊసరవెల్లి, రచ్చ, తడాఖా, బద్రీనాథ్, బాహుబలి: ది బిగినింగ్, బెంగాల్ టైగర్, ఊపిరి, బాహుబలి: ది కన్‌క్లూజన్, F2, సైరా నరసింహా రెడ్డి వంటి చిత్రాలతో అలరించింది గ్లామరస్ బ్యూటి తమన్నా. ఇండస్ట్రీకి వచ్చిన 18 ఏళ్లలో సుమారు 73కిపైగా చిత్రాల్లో నటించి ఆకట్టుకుంటుంది ఈ మిల్కీ భామ.
జూన్ 29న అందులో: గతేడాది ఘని (ఐటమ్ సాంగ్), F3, బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బీ, గుర్తుందా శీతాకాలం సినిమాల్లో నటించిన తమన్నా నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం తమన్నా చిరంజీవి భోళా శంకర్, సూపర్ స్టార్ రజనీ కాంత్-నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్, బోలే చూడియా, బాంద్రా సినిమాలతోపాటు లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీసులు చేస్తోంది. లస్ట్ స్టోరీస్ 2 జూన్ 29న నెట్ ఫ్లిక్స్ లో విడుదలకు సిద్దంగా ఉంది.
బోల్డ్ సీన్స్ వైరల్: ఇవే కాకుండా తమన్నా నటించిన 'జీ కర్దా' వెబ్ సిరీస్ జూన్ 15న అంటే ఇవాళ అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ సిరీసులో తమన్నా ఎన్నడూ చేయని విధంగా శృంగార సన్నివేశాల్లో హొయలు బోయింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో తమన్నా శృంగారభరితమైన హావా భావాలు, బోల్డ్ సీన్స్ నెట్టింట్లో హాట్ టాపిక్ అయ్యాయి.
ఉద్రేకంతో కొడుతుంటే: అయితే ఇప్పుడు తాజాగా 'జీ కర్దా'లోని ఓ సీన్ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. ఇందులో సుహేల్ నాయర్ తో బోట్ లో వెళ్తున్న తమన్నా ఘాటు సన్నివేశంతో అట్రాక్ట్ చేసింది. తమన్నా వెనుక భాగంపై సుహేల్ ఉద్రేకంతో కొడుతుంటే అంతకుమించి రెచ్చిపోయిన తమన్నా అతన్ని కూడా అలాగే నలిపేసింది. ఇందులో తమన్నా ఎక్స్ ప్రెషన్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications











