Tamannah Bhatia: బాహుబలి తర్వాతే కష్టాలు.. మిల్క్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
Tamannah Bhatia: భారతీయ చిత్ర పరిశ్రమలో బాహుబలి సినిమా కు ప్రత్యేక స్థానం ఉంది. వంద సంవత్సరాల చరిత్ర ఉన్న భారతీయ సినిమా పరిశ్రమలో మరో 100 సంవత్సరాలు కూడా బాహుబలి సినిమా గురించి మాట్లాడుకుంటారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు. ఈ సినిమా కేవలం డైరెక్టర్ రాజమౌళికే కాదు. ఈ సినిమాలో నటించిన నటులకే కాకుండా టెక్నీషియన్స్ జీవితాల్లో మెరుగైన అవకాశాలను అందించింది బాహుబలి. అలాంటి బాహుబలి సినిమా పై హీరోయిన్ తమన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. బాహుబలి సినిమా తర్వాతనే కష్టాలు మొదలయ్యాయంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఏం కామెంట్స్ చేసిందో లూక్కేయ్యండి.
హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మంచు మనోజ్ హీరోగా నటించిన 'శ్రీ' అనే సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయం అయింది. ఆ తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్షన్ చేసిన 'హ్యాపీ డేస్' అనే సినిమా లో నటించి మంచి పాపులాటిని సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంది. ఈ సమయంలోనే చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఎదిగింది.

ఈ అమ్మడు కేవలం తెలుగు సినిమాలే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సినిమాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం తెచ్చుకుంది. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో అడుగుపెట్టిన అమ్మడు ఐటెం సాంగ్స్, వెబ్ సిరీస్, లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలి సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. బాహుబలి సినిమా వల్ల తమన్నాకు ఎంత గుర్తింపు వచ్చిందో అందరికీ తెలిసిందే.
బాహుబలి 1లో అవంతిక అనే పాత్రలో తమన్నా తన గ్లామర్ తో ఆకట్టుకుంది. తన అందం మాత్రమే కాకుండా అభినయంతో అలరించింది. ఇలా బాహుబలి మూవీతో తమన్నా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ కోసం ఐదేళ్లు టీం అంతా కష్టపడిన విషయం తెలిసిందే. అయితే.. ఈ మూవీ తర్వాత ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో పడ్డానని తమన్నా చెప్పుకొచ్చింది. బాహుబలి ప్రాజెక్టు తర్వాత చాలా కన్ఫ్యూజన్ ఏర్పడిందని, అప్పుడే అసలైన కష్టాలను తనకు అర్థమైందని చెప్పుకొచ్చింది.

తాజాగా హీరోయిన్ తమన్నా భాటియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..' బాహుబలి తర్వాత తన మనసులో ఎన్నో ఆలోచనలు మెదిలాయని గుర్తు చేసుకుంది. బాహుబలి కంటే పెద్ద సినిమాలో నటించగలమా? బాహుబలి తర్వాత ఏం చేయాలి? దీనికంటే పెద్ద సినిమాలు ఏమైనా చేయాలా? నేను మళ్ళీ అలాంటి సినిమాల్లో నటించగలనా ? అని ఎన్నో ఆలోచనలు మదిని తొలిచాయని పేర్కొంది. అంతేకాకుండా.. ఇదే సక్సెస్ ఫార్ములా కంటిన్యూ చేయగలమా? కొత్తదారిలో ప్రయాణించడం సాధ్యమేనా ? అనే కన్ఫ్యూజన్ మొదలైంది. దాంతోపాటు సౌత్ నుండి నార్త్ సినిమాల్లో నటిస్తే అంగీకరించగలరా ?' అనే పలు రకాల సందేహాలు తన మదిలో మెదిలాయని పేర్కొంది.


Click it and Unblock the Notifications











