Tamanna Bhatia: ప్రియుడి కోసం అలాంటి పని చేసిన తమన్నా.. 18 ఏళ్లుగా చేయనిది ఒక్కసారిగా!

తెలుగు ఆడియెన్స్ కు ఎలాంటి పరిచయం అవసరం లేని మిల్క్ బ్యూటి తమన్నా. చాలా కాలంగా సినిమాల్లో సత్తా చాటుతూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ ఇప్పటికీ హవా కొనసాగిస్తోంది. అయితే ఇటీవల ఓటీటీ వెబ్ సిరీసుల్లో ఎన్నడూ చేయని, ఊహించని విధంగా బోల్డ్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది. దీంతో ప్రేక్షకులు, నెటిజన్లు షాక్ అయ్యారు. ఈ విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది ఈ మిల్కీ భామ.

హిందీ భాషల్లో:పంజాబీ భామ తమన్నాను తెలుగు ప్రేక్షకులు మిల్కీ బ్యూటి అని పిలుచుకుంటారు. మంచు మనోజ్ శ్రీ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి వచ్చి సుమారు 18 ఏళ్లు కావొస్తుంది. ఈ సినీ కెరీర్ లో ఎన్నో చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుసగా చిత్రాలతోపాటు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో కూడా సందడి చేస్తుంటుంది.

Actress Tamannaah Bhatia Reveals Why She Breaks 18 Years No Kiss Policy

విడుదలకు సిద్ధంగా:ఇప్పుడు త్వరలో చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే బోలే చూడియా, బాంద్రా వంటి హిందీ చిత్రాలు చేస్తోంది. సూపర్ స్టార్ రజనీ కాంత్ తో జైలర్ మూవీలోను ఆకట్టుకోనుంది ఈ బ్యూటి. ఇవే కాకుండా ఓటీటీ సిరీసులతో అట్రాక్ట్ చేయనుంది. జీ కర్దా వెబ్ సిరీసు జూన్ 15న విడుదల కాగా లస్ట్ స్టోరీస్ 2 జూన్ 29న రిలీజుకు సిద్ధంగా ఉంది.

Actress Tamannaah Bhatia Reveals Why She Breaks 18 Years No Kiss Policy

అలాంటి కామెంట్స్:అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదలైన జీ కర్దా వెబ్ సిరీసులో తమన్నా ఎవ్వరూ ఊహించని విధంగా శృంగార, ముద్దు సన్నివేశాల్లో కనిపించి షాక్ ఇచ్చింది. అలాగే లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీసులోను గాటు చుంబన సీన్లలో అదరగొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి. దీంతో తమన్నా ఫేమస్ అవడానికి, సినీ అవకాశాలు పొందడానికే ఇలా చేస్తుందని కామెంట్స్ వినిపించాయి.

Actress Tamannaah Bhatia Reveals Why She Breaks 18 Years No Kiss Policy

18 ఏళ్ల తర్వాత:అయితే మిల్కీ బ్యూటి తమన్నా సినిమా పరిశ్రమకు అడుగు పెట్టిన తొలి నాళ్లలలో కిస్సింగ్ సీన్లలో నటించనని వెల్లడించింది. ఇప్పటివరకు మాట మీద కట్టుబడి ఉన్న తమ్ము తాజాగా 18 ఏళ్ల తర్వాత ఈ రూల్ బ్రేక్ చేసి బోల్డ్ సీన్స్ చేసింది. ఈ నో కిస్ పాలసినీ బ్రేక్ చేయడంపై లస్ట్ స్టోరీస్ 2 ప్రమోషనల్ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడగ్గా ఆసక్తికర సమాధానం ఇచ్చింది.

ఆ అవసరం లేదు:"నేను ఫేమ్ కావడానికి కిస్ సీన్లతోపాటు బోల్డ్ సీన్లలో నటిస్తున్నానని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఆ అవసరం నాకు లేదు. 18 ఏళ్లుగా సినిమా పరిశ్రమలో నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాను. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించాను. నాకు రావాల్సినంత పాపులారిటీ ఎప్పుడో వచ్చింది. ఇప్పుడు ఫేమస్ కావాల్సిన అవసరం లేదు. విజయ్ (తమన్నా ప్రియుడు) కోసమే నేను ఈ నో కిస్ పాలసీని బ్రేక్ చేశాను" అని తమన్నా తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X