అందరిముందే తమన్నాను అక్కడ పట్టుకున్న ఫ్యాన్.. మిల్కీ బ్యూటి ఏం చేసిందంటే?

స్టార్ హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా క్రేజ్ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో మాత్రం ఓటీటీ వెబ్ సిరీసులతో అదరగొడుతోంది. అంతేకాకుండా జీ కర్దా (Jee Karda), లస్ట్ స్టోరీస్ 2 (Lust Stories 2) వెబ్ సిరీసుల్లో చేసిన ఘాటు సన్నివేశాలతో సోషల్ మీడియాలో హల్ చల్ క్రియేట్ చేసింది. ఇక జైలర్ మూవీలోని కావాలయ్య పాటతో ఇన్ స్టా గ్రామ్ లో సూపర్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. అలాంటి తమన్నాకు ఊహించని సంఘటన ఎదురైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

కుప్పలు తెప్పలుగా:శ్రీ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది గ్లామరస్ బ్యూటి తమన్నా.. ఈ సినిమా తర్వాత హ్యాపీ డేస్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టింది. అంతేకాకుండా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీతో అప్పటి వరకు ఏ హీరోయిన్ దక్కించుకోలేని క్రేజ్ సంపాదించుకుంది. యువతలో క్రష్ గా మారిపోయింది. దీంతో ఆమెకు తెలుగులో కుప్పలుతెప్పలుగా వరుస అవకాశాలు రావడం మొదలైంది.

Actress Tamannaah Bhatia Selfie With Fan At Kollam Shopping Mall

తక్కువ సమయం:మిల్కీ బ్యూటి తమన్నాకు అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశం లభించింది. కొంచెం ఇష్టం కొంచె కష్టం, 100% లవ్, ఊసరవెల్లి, రచ్చ, తడాఖా, బద్రీనాథ్, బాహుబలి: ది బిగినింగ్, బెంగాల్ టైగర్, ఊపిరి, బాహుబలి: ది కన్‌క్లూజన్, F2, సైరా నరసింహా రెడ్డి వంటి చిత్రాలతో అలరించింది గ్లామరస్ బ్యూటి తమన్నా. ఇండస్ట్రీకి వచ్చిన 18 ఏళ్లలో సుమారు 73కిపైగా చిత్రాలు చేసింది.

Actress Tamannaah Bhatia Selfie With Fan At Kollam Shopping Mall

నటుడితో ప్రేమాయణం:నాగ చైతన్య నుంచి సూపర్ స్టార్ రజనీ కాంత్ వరకు అగ్ర హీరోలందరితో నటించింది తమన్నా. హైదరాబాద్ నటుడు విజయ్ వర్మతో ప్రేమయాణం సాగిస్తున్న ఈ మిల్కీ బ్యూటి ఇటీవల 19 ఏళ్ల సినీ కెరీర్ రూల్ ను బ్రేక్ చేసింది. ఏ సినిమాల్లో చేయని ఘాటు చుంబన, బెడ్ సీన్లలో నటించి అదరగొట్టింది.

సీన్లు-పాటలు:జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీసుల్లో రెచ్చిపోయి మరి కిస్సింగ్ సీన్స్ చేసింది. అంతేకాకుండా హై ఓల్టేజ్ గ్లామర్ ట్రీట్ అందించింది. దీంతో ఆమె సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయింది. అలాగే తమన్నా తాజాగా నటిస్తున్న రజనీ కాంత్ జైలర్ మూవీలోని కావాలయ్య (Kaavaala Song) పాటతో కూడా మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఈ పాటను ఇన్ స్టాలో రీల్స్ చేయని వారు లేనంతగా హిట్ అయింది.

వేడుకకు డుమ్మా:ఇక మిల్కీ సుందరి తమన్నా జైలర్ (Jailer) సినిమాతోపాటు బోలో చుడియా, బాంద్రా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. త్వరలో చిరంజీవి భోళా శంకర్ (Bhola Shankar) సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉంది. అయితే ఆగస్టు 6న భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. కానీ ఈ వేడుకకు మిల్కీ బ్యూటి తమన్నా హాజరు కాలేదు. అందుకు కారణాలు తెలియరాలేదు.

నచ్చజెప్పి:ఇదిలా ఉంటే తమన్నా కేరళలోని కొల్లాంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లింది. అక్కడ ఆమె చుట్టూ బౌన్సర్స్ ఉండగా.. వారందరినీ తప్పించుకుని ఓ అభిమాని ఏకంగా తమన్నా చేయి పట్టుకున్నాడు. దీంతో అప్రమత్తమైన తమన్నా బౌన్సర్స్ అతన్ని పక్కకు లాగేశారు. అయితే అభిమాని అత్యుత్సాహాన్ని అర్థం చేసుకున్న తమన్నా బౌన్సర్స్ కు నచ్చజెప్పి అతనితో సెల్ఫీ దిగింది. దీంతో తమన్నాపై నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X