అన్ని వదిలేసిన స్టార్ హీరోయిన్, ప్రియుడితో గోవా ట్రిప్.. రూమ్‌లో అలాంటి పనులు

చిత్ర పరిశ్రమలో హీరో హీరోయిన్లు ప్రేమలో పడటం సర్వసాధారణం. నాటి బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు ఎందరో తారలు ప్రేమలో పడ్డారు.. పెళ్లిళ్లు చేసుకున్నారు, పెళ్లి కాకపోయినా రిలేషన్‌లో ఉన్నారు. అయితే మరికొందరు మాత్రం తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లలేక మధ్యలోనే విడిపోయిన ఉదంతాలెన్నో. ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ కొందరు హీరో హీరోయిన్లు ప్రేమాయణం సాగిస్తున్నారు. వారిలో తమన్నా భాటియా - విజయ్ వర్మ జంట కూడా ఒకటి.

టీనేజ్‌లోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ .. దాదాపు రెండు దశాబ్ధాలుగా వెండితెరపై వెలిగిపోతూనే ఉన్నారు. తమన్నాతో పాటు కెరీర్ స్టార్ట్ చేసినవాళ్లు ఫేడవుట్ అవ్వడమో, పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అవ్వడమో జరగ్గా ఆమె మాత్రం ఇప్పటికీ చేతినిండా ఆఫర్లతో బిజీగా ఉంటున్నారు. 13 ఏళ్ల వయసులోనే ముంబైలోని ప్రఖ్యాత పృథ్వీ థియేటర్‌లో నటనలో శిక్షణ తీసుకున్నారు. 16 ఏళ్ల వయసులో చాంద్ సా రోషన్ చెహ్రా అనే హిందీ మూవీ ద్వారా చిత్ర సీమలో అడుగుపెట్టారు తమన్నా.

actress Tamannaah Bhatia shares latest photos with her boy friend vijay varma in goa

మంచు మనోజ్ హీరోగా వచ్చిన శ్రీ చిత్రంతో తెలుగు వారిని పలకరించారు. తర్వాత హ్యాపీడేస్, కాళిదాసు, రెడీ, నిన్న నేడు రేపు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్, బద్రీనాథ్, ఎందుకంటే ప్రేమంట, రెబల్, కెమెరామెన్ గంగతో రాంబాబు, ఆగడు, బాహుబలి సిరీస్, ఊపిరి, సైరా, ఎఫ్ 3 వంటి సినిమాలతో టాలీవుడ్‌లో స్టార్ డమ్ సంపాదించారు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీలలో నటించారు తమన్నా. నటన సంగతి పక్కనబెడితే హీరోలతో సమానంగా డ్యాన్స్ వేయగల అతికొద్దిమంది హీరోయిన్లలో తమన్నా ఒకరు.

తమన్నా పని అయిపోయిందనే విమర్శలు వచ్చినప్పుడల్లా గట్టి కమ్ బ్యాక్ ద్వారా తన మార్క్ చూపిస్తూ వస్తున్నారు. రీసెంట్ బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ స్త్రీ 2లో స్పెషల్ సాంగ్‌తో దేశాన్ని ఊపేసిన తమన్నా ప్రస్తుతం తెలుగులో ఓదెల -2లో నటిస్తున్నారు. దాదాపు రెండు దశాబ్థాల తమన్నా కెరీర్‌లో పలువురు స్టార్స్‌తో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఏకంగా ఓ పాకిస్తానీ క్రికెటర్‌తోనూ ఆమెకు బంధాన్ని అంటకట్టారు. కానీ అవన్నీ పుకార్లుగానే నిలిచాయి. అయితే నాని హీరోగా వచ్చిన ఎంసీఏలో విలన్‌గా నటించిన ప్రముఖ నటుడు విజయ్ వర్మతో తమన్నా రిలేషన్‌లో ఉన్నారు.

తొలుత వీరు తమ బంధాన్ని గుట్టుగా ఉంచినప్పటికీ తర్వాత ఓపెన్ అయిపోయారు. వీలున్నప్పుడల్లా విహారయాత్రలకు వెళ్తూ ఆ ఫోటోలను బయటపెడుతున్నారు. తాజాగా విజయ్ - తమన్నాలు గోవా ట్రిప్ వేశారు. అక్కడ తన ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్న తమన్నా.. తన ప్రియుడితో కలిసి వీడియో గేమ్ ‌ఆడుతూ కనిపించారు. అలాగే తన ఫ్రెండ్స్‌తో కలిసి ఒకే బెడ్‌ను షేర్ చేసుకుంటూ కనిపించారు మిల్కీ బ్యూటీ. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X