రాధమ్మలా మిల్కీ బ్యూటీ .. కెరీర్‌లోనే ది బెస్ట్ వర్క్ అంటూ ఎమోషనల్ పోస్ట్
ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నా.. కొంతమందికి మాత్రమే స్టార్‌డమ్ వస్తుంది, కొందరే ఆడియన్స్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలరు. అలాంటి వారిలో తమన్నా భాటియా కూడా ఒకరు. యంగ్ ఏజ్‌లోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. దాదాపు రెండు దశాబ్ధాలుగా నటిస్తూనే ఉన్నారు. తమన్నాతో పాటు కెరీర్ స్టార్ట్ చేసినవాళ్లు ఫేడవుట్ అవ్వడమో, పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అవ్వడమో చేస్తుంటే ఆమె మాత్రం చేతినిండా ఆఫర్లతో బిజీగా గడుపుతున్నారు.
సౌత్‌లోని అందరు టాప్ హీరోలతో నటించిన తమన్నాలో డ్యాన్సింగ్ స్కిల్స్‌ని ప్రత్యేకంగా మెచ్చుకోవాల్సిందే. ఎంతటి టఫ్ మూవ్‌మెంట్స్‌నైనా చాలా ఈజీగా చేసి శెభాష్ అనిపించుకున్నారు మిల్కీబ్యూటీ. ఆవిడతో డ్యాన్స్ చేయాలంటే కొందరు స్టార్స్ వామ్మో అనుకుంటారంటే అతిశయోక్తి కాదు. తమన్నా పని అయిపోయిందనే కామెంట్స్ వినిపించినప్పుడల్లా తన మార్క్ చూపిస్తూ వస్తున్నారు. సౌత్‌లో మళ్లీ బిజీ అయిన ఆమె ఎఫ్-3, గుర్తుందా సీతాకాలం, భోళాశంకర్, జైలర్, అరన్మనై-4 .. హిందీలో భోలే చుడియాన్, మలయాళంలో బంద్రా చేస్తున్నారు.

తెలుగులో ఓదెల -2తో బిజీగా ఉన్నారు తమన్నా. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇటీవల రిలీజైంది. బోనం ఎత్తుకుని, ఎరుపు రంగు చీరలో నడుచుకుంటూ వస్తున్న తమన్నా పిక్ వైరల్ అయ్యింది. గతంలో వచ్చిన ఓదెల రైల్వేస్టేషన్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీ వస్తోంది. ఈ సినిమాలో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగమహేశ్, వంశీ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమాలతో పాటు ఐటెం సాంగ్స్ విషయంలోనూ తమన్నా దూసుకెళ్తున్నారు. ఇటీవల శ్రద్ధాకపూర్- రాజ్ కుమార్ రావు కాంబినేషన్‌లో వచ్చిన స్త్రీ-2లో మిల్కీ బ్యూటీ చేసిన ఐటెం సాంగ్ మాస్‌ను ఊపేస్తోంది. ఆజ్ కీ రాత్ అంటూ వచ్చే స్పెషల్ సాంగ్‌లో తన నడుము ఒంపులు, కళ్లు చెదిరే స్టెప్స్‌తో అదరగొట్టారు తమన్నా. ఈ స్పెషల్ సాంగ్ కోసం తమన్నా భాటియా భారీగానే పారితోషికం అందుకుందట. కేవలం 5 నిమిషాల నిడివిగల ఈ పాట కోసం ఆమె రూ.కోటి తీసుకున్నట్లు బాలీవుడ్ టాక్.
ఇక నిన్న మొన్న వచ్చిన హీరోయిన్ల మీదే ఎన్నో పుకార్లు హల్‌చల్ చేస్తుంటాయి. అలాంటిది ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న తమన్నాపైనా ఎన్నో వచ్చాయి. కానీ అవన్నీ పుకార్లుగానే నిలిచాయి. అయితే ఆమె తెలుగులో ఎంసీఏలో విలన్‌గా నటించిన ప్రముఖ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్నారు. చాలా సార్లు చెట్టాపట్టాలేసుకుని కనిపించిన ఈ జంట.. తమ ప్రేమ విషయంపై ఓపెన్ అయిపోయారు. తర్వాతి నుంచి ఈ కపుల్ కలిసే కనిపిస్తున్నారు. త్వరలోనే వీరి పెళ్లి జరుగుతుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తమన్నా.. కృష్ణాష్టమిని పురస్కరించుకుని రాధమ్మలా రెడీ అయ్యింది. మెహందీతో ఉన్న కాళ్లు, ఆకర్షణీయమైన నగలు, మేకప్, చెరువుగట్టున జలకాలు.. ముఖంపై నెమలి పించంతో మెరిసిపోయింది. 18 ఏళ్ల కెరీర్‌లో తాను వర్క్ చేసిన అత్ముత్తమ యాడ్ ఇదేనని మిల్కీ బ్యూటీ ఎమోషనల్ పోస్ట్ చేసింది. దీనికి కారణమైన కరన్‌కి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం రాధమ్మ గెటప్‌లో తమన్నా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











