Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Tamannaah: పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన తమన్నా.. పెళ్లి అయ్యేది అప్పుడే అంటూ..
ఇప్పుడున్న గ్లామరస్ బ్యూటీలలో ఎక్కువ కాలం నిలదొక్కుకున్న అతి కొద్ది మంది స్టార్ హీరోయిన్స్ లలో తమన్నా భాటియా ఒకరు. ఈ బ్యూటీ సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇంకా తన స్టార్ ఇమేజ్ తోనే మంచి అవకాశాలు అందుకుంటుంది. ఇక త్వరలోనే బబ్లీ బౌన్సర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తమన్నా బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూ లతో చాలా బిజీగా మారిపోయింది. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అమ్మడు మొదటిసారి తన పెళ్లి గురించి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..
ప్లానింగ్ తో స్టార్ ఇమేజ్
2005లో శ్రీ అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తమన్నా ఆ తర్వాత భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీలో మంచి అవకాశాలను అందుకుంది. ఈ బ్యూటీ మొదట్లో మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలలో సెలెక్ట్ చేసుకుని తన స్టార్ హోదాను పెంచుకుంది. ఇక తర్వాత మెల్లగా మీడియం బడ్జెట్ సినిమాలు ఆ తరువాత బిగ్ బడ్జెట్ సినిమాలలో అవకాశాలు అందుకుంటూ వచ్చింది.
స్పెషల్ సాంగ్స్
తమన్నా తన సినిమా కెరీర్లో సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండానే కొనసాగింది. ఒక సినిమా డిజాస్టర్ అయితే మళ్ళీ వెంటనే మరొక సినిమాతో ఫామ్ లోకి వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటూ తన స్టార్ హోదాను కాపాడుకుంటుంది అని చెప్పవచ్చు. హ్యాపీ డేస్, 100% లవ్, రచ్చ, బాహుబలి, F 2 సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. మరొకవైపు స్పెషల్ సాంగ్ తో కూడా గుర్తింపు అందుకుంది.
బౌన్సర్ గా తమన్నా
ఇక తమన్నా భాటియా నటించిన కొత్త చిత్రం బబ్లి బౌన్సర్ ఈనెల 25వ తేదీన ఓటీటీ ప్లాట్ ఫార్మ్ హాట్ స్టార్ లో విడుదల కాబోతోంది. మధుర్ బండార్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా ఒక లేడీ బౌన్సర్ గా కనిపించబోతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక వరుసగా సినిమా ప్రమోషన్స్ లో కూడా తమన్నా చాలా బిజీగా మారిపోయింది.
పెళ్లిపై క్లారిటీ
అయితే తమన్నా కు ఇటీవల పెళ్లి ఫిక్స్ అయ్యింది అని అని వరుడు ఒక కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అంటూ అనేక రకాల వార్తలు అయితే పుట్టుకొచ్చాయి. అయితే వాటిపై బహిరంగంగా ఆమె ఎప్పుడు క్లారిటీ ఇచ్చింది లేదు. ఇక ఇప్పుడు బాబ్లీ బౌన్సర్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న తమన్న అందులో ఎలాంటి నిజం లేదు అని పరోక్షంగా క్లారిటీ ఇస్తూ.. తన పెళ్లి ఎప్పుడు జరుగుతుందో అనే విషయంపై కూడా ఒక వివరణ అయితే ఇచ్చింది.
అప్పుడే నా పెళ్లి
అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్న తరుణంలో తమన్నా తన పెళ్లిపై ఈ విధంగా స్పందించింది. ఇప్పటివరకు అయితే పెళ్లి విషయంలో అయితే ఎవరూ పెద్దగా ఇబ్బంది పెట్టింది లేదు అని ఒకవేళ పెళ్లి చేసుకునే టైం వస్తే మాత్రం కచ్చితంగా నా ఫ్యామిలీకి చెప్పి హ్యాపీగా పెళ్లి చేసుకుంటాను.. అని తమన్న ప్రస్తుతం వినిపిస్తున్న పుకార్లకు ఒక క్లారిటీగా చెక్ అయితే పెట్టేసింది. ప్రస్తుతం అయితే తన ఫోకస్ మొత్తం కూడా సినిమాల పైనే ఉంది అని విడుదలకు మరోవైపు మూడు సినిమాలు సిద్ధంగా ఉన్నట్లు కూడా ఈ బ్యూటీ తెలియజేసింది.