Tamannaah: బ్లాక్ డ్రెస్సులో తమన్నా మిల్కీ అందాలు.. ఇలా ఎప్పుడు చూసి ఉండరు!

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ మొత్తంలో కూడా మిల్కీ బ్యూటీగా క్రేజ్ అందుకున్న తమన్నా భాటియా చలనచిత్ర పరిశ్రమలో మంచి నటిగా కూడా స్టార్ గా ఒక గుర్తింపు అందుకుంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అమ్మడు ఎప్పుడూ కూడా వెండితెరకు పెద్దగా గ్యాప్ ఇచ్చింది లేదు. తన రేంజ్ కు తగ్గట్టుగా మంచి అవకాశాలు అందుకుంటూనే ఉంది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు గ్లామరస్ స్టిల్స్ తో ఆకట్టుకుంటూనే ఉంది. ఇక లేటెస్ట్ గా పోస్ట్ చేసిన కొన్ని ఫొటోల వివరాల్లోకి వెళితే..

చిన్న వయస్సులోనే..:తమన్నా మహారాష్ట్రలోని ముంబైలో 1989 డిసెంబర్ 21న జన్మించింది. అమ్మడు చిన్న వయస్సులోనే తన నటనా జీవితాన్ని ప్రారంభించి, అప్పటి నుండి సినీ ప్రపంచంలో ప్రముఖ వ్యక్తిగా మారింది. తమన్నా 2005లో హిందీ చిత్రం "చాంద్ సా రోషన్ చెహ్రా"తో తన నటనా రంగ ప్రవేశం చేసింది. కానీ అదేమీ అంతగా ఆమెకు సక్సెస్ ను ఇవ్వలేదు. ఇక మళ్ళీ ఫోకస్ చేసి మంచి కథలను సెలెక్ట్ చేసుకోవాలని అడుగులు వేసింది.

Actress Tamannaah latest latest new glamorous pics viral

ఆ ఒక సినిమా ఊహించని క్రేజ్:అయితే తెలుగు చిత్రం "హ్యాపీ డేస్" (2007)లో ఆమె చేసిన అద్భుతమైన పాత్ర ఆమెకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆమె ఆకర్షణీయమైన నటన మనోహరమైన స్క్రీన్ ప్రెజెన్స్ విమర్శకుల ప్రశంసలను సంపాదించిపెట్టాయి. అనంతరం వరుసగా అవకాశాలు పెరుగుతూ వచ్చాయి. అప్పటి నుండి, తమన్నా తెలుగు, తమిళం, హిందీ మరియు కన్నడతో సహా పలు భాషలలో బిజీగా మారింది.

Actress Tamannaah latest latest new glamorous pics viral

బిగ్ బాక్సాఫీస్ హిట్స్:ఇక "బాహుబలి: ది బిగినింగ్" (2015), దాని సీక్వెల్ "బాహుబలి: ది కన్‌క్లూజన్" (2017) వంటి చిత్రాలలో చిరస్మరణీయమైన నటనను ప్రదర్శించింది. తమన్నా తన ఆకర్షణీయమైన అందం, అందమైన ఫ్యాషన్ సెన్స్ కూడా నిత్యం ఆకట్టుకుంటూనే ఉంటుంది. స్క్రీన్‌పై విభిన్న పాత్రలను సులభంగా చేయగల తమన్నా చాలా హార్డ్ వర్క్ చేస్తుందని ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది. తన క్రాఫ్ట్ పట్ల ఆమెకున్న అంకితభావం గురించి దర్శక నిర్మాతలు పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంటారు.

Actress Tamannaah latest latest new glamorous pics viral

కేవలం నటిగానే కాకుండా..:ఇక తమన్నా తన కెరీర్‌లో అనేక అవార్డులు, నామినేషన్‌లను అందుకుంది. ఉత్తమ నటిగా ప్రతిష్టాత్మకమైన సినీ మా అవార్డుతో సహా పలు ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయి. ఇక తన నటనా వృత్తితో పాటు, తమన్నా వివిధ దాతృత్వ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటుంది. ఆమె విద్య, ఆరోగ్యం అలాగే మహిళా సాధికారతకు సంబంధించిన కార్యక్రమాలకు మద్దతు ఇచ్చింది. సమాజంలో సానుకూల ప్రభావం చూపడానికి తన ప్రభావాన్ని ఉపయోగించింది.

బ్లాక్ డ్రెస్ లో తమన్నా న్యూ లుక్:చిత్ర పరిశ్రమలో తమన్నా విజయానికి ఆమె కృషి, అంకితభావం ఆమె క్రాఫ్ట్ పట్ల మక్కువ కారణమని చెప్పవచ్చు. అయితే సోషల్ మీడియాలో అమ్మడు పోస్ట్ చేసే ఫొటోలు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక రీసెంట్ గా అమ్మడు బ్లాక్ డ్రెస్ లో కనిపించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ఫ్యాషన్ లుక్ లో తమన్నా ఎద అందాలు మరింత హైలెట్ అయ్యే విధంగా స్టిల్ ఇచ్చింది. ఇక నిమిషాల్లోనే ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇక వెబ్ సీరీస్ లలో బోల్డ్ రోల్స్ చేస్తున్న తమన్నా రాబోయే రోజుల్లో ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X