For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తమన్నా అందాల ఆరాచకం: విచిత్రమైన డ్రెస్‌లో యమ ఘాటుగా!

  |

  చిన్న వయసులోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. దాదాపు పదేళ్లకు పైగానే తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. టాలీవుడ్‌లోని దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించిన ఈ భామ.. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుని సత్తా చాటింది. తద్వారా వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ మధ్య కాలంలో వేరే భాషల చిత్రాలతో ఫుల్ బిజీ అయిన తమన్నా.. దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించే విధంగా దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ యమా సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా తమన్నా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరూ లుక్కేయండి!

  అలా పరిచయం... ఫుల్ ఫేమస్

  అలా పరిచయం... ఫుల్ ఫేమస్

  టీనేజ్‌లో తమన్నా భాటియా 'చాంద్ సా రోషన్ చహ్రా' అనే హిందీ చిత్రంతో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత 'శ్రీ' అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే తమిళంలో 'కేడీ' అనే సినిమా చేసింది. ఈ క్రమంలోనే 'హ్యాపీ డేస్' అనే సినిమాతో ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయింది. దీంతో తమన్నాకు తెలుగులో ఆఫర్లు భారీ స్థాయిలో సొంతం అయ్యాయి.

  బాత్‌టబ్‌లో నగ్నంగా హీరోయిన్: స్నానం చేస్తోన్న ఫొటోలతో సంచలనం

  అందరితో చేసి స్టార్ హీరోయిన్

  అందరితో చేసి స్టార్ హీరోయిన్

  సుదీర్ఘమైన కెరీర్‌లో తమన్నా భాటియా అన్ని భాషల్లో కలిపి వందకు పైగా సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే దక్షిణాది భాషల్లోని దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. అలాగే, బాలీవుడ్‌లోనూ తనదైన మార్కును చూపిస్తోంది. ఇలా ఇప్పటికీ ఈ మిల్కీ బ్యూటీ వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్‌గా హవాను చూపిస్తూనే ఉంది.

  తెలుగులో రెండు.. హిందీతోనూ

  తెలుగులో రెండు.. హిందీతోనూ

  తమన్నా ఈ ఏడాది F3 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఇది ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేదు. ఇక, ఇప్పుడామె సత్యదేవ్‌తో 'గుర్తుందా సీతాకాలం' మూవీని పూర్తి చేసుకుంది. అలాగే, చిరంజీవితో 'భోళా శంకర్'లో నటిస్తోంది. వీటితో పాటు ఆమె హిందీలో 'బబ్లీ బౌన్సర్', 'భోలే చుడియాన్', 'ప్లాన్ ఏ ప్లాన్ బీ' వంటి సినిమాల్లో నటిస్తోంది.

  ఉల్లిపొర లాంటి చీరలో రమ్యకృష్ణ: అందాలన్నీ కనిపించడంతో ఇబ్బంది

  సిరీస్‌లు, స్పెషల్ సాంగులతో

  సిరీస్‌లు, స్పెషల్ సాంగులతో


  హీరోయిన్‌గా ప్రయాణం మొదలైనప్పటి నుంచి ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన తమన్నా భాటియా.. పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. అవన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అలాగే, తమన్నా కొన్ని వెబ్ సిరీస్‌లలోనూ నటించింది. అందులో 'లెవెంట్ అవర్', 'నవంబర్ స్టోరీస్' వంటివి హిట్ అయ్యాయి. దీంతో ఆమె మరిన్నింటిలో భాగం అవుతోంది.

  సోషల్ మీడియాలో సందడిగా

  సోషల్ మీడియాలో సందడిగా

  ఇండస్ట్రీలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న తమన్నా భాటియా.. సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది అదే సమయంలో సినిమా అప్‌డేట్లను కూడా ఇస్తూ తన ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

  ఫ్లైట్‌లోనే నయనతార - విఘ్నేష్ రచ్చ: భర్త మీద కూర్చుని.. ఏకంగా అక్కడ ముద్దు పెట్టేసి!

  మిల్కీ బ్యూటీ అందాల విందు

  మిల్కీ బ్యూటీ అందాల విందు

  తమన్నా భాటియా సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో ఎక్కువగా తన ఫొటోలు, వీడియోలు వదులుతోంది. వీటిలో అప్పుడప్పుడూ అందాలు ఆరబోస్తూ తీసుకున్నవి కూడా ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన పిక్‌లను కూడా తమన్నా ఎక్కువగా షేర్ చేస్తోంది. దీంతో ఈ బ్యూటీ తరచూ వార్తల్లో నిలుస్తోంది.

  తమన్నా హాట్ ఫొటోలు వైరల్

  తమన్నా హాట్ ఫొటోలు వైరల్

  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను వదిలింది. ఇందులో ఈ అమ్మడు విచిత్రమైన డ్రెస్‌ను ధరించి విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా మిల్కీ బ్యూటీ ఎద అందాలు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి.. ఇవన్నీ బాగా వైరల్‌ అయిపోతోన్నాయి.

  Read more about: tamannaah తమన్నా
  English summary
  Tollywood actress Tamannaah Shared a Hot Photos in her Instagram Recently. These Photos Gone Viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X