For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇలాంటి ఛాన్స్ అరుదుగా వస్తుంది: ‘రాజుగారి గది 3’పై తమన్నా

    |

    ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన రాజుగారి గది, రాజుగారి గది 2 చిత్రాలు మంచి విజయం సాధించడంతో ఈ ఫ్రాంచైజీలో మరో సినిమా తెరకెక్కించేందుకు రంగం సిద్ధమైంది. ఈ సారి రాజుగారి గదిలోకి స్టార్ హీరోయిన్ తమన్నా ఎంటరయ్యారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది.

    ఈ మూవీలో తనకు అవకాశం దక్కడంపై తమన్నా స్పందించారు. దర్శకుడు ఓంకార్‌కు థాంక్స్ చెప్పారు. 'రాజుగారి గది 3'లో మెయిన్ లీడ్ కోసం నన్ను తీసుకోవడం ఆనందంగా ఉంది, ఒక హీరోయిన్‌కు ఇలాంటి పాత్రలు చాలారుదుగా లభిస్తాయి, ఈ మూవీ చేయడంపై చాలా ఎగ్జైట్మెంటుతో ఉన్నట్లు వెల్లడించారు.

    Actress Tamannah Bhatia about Raju Gari Gadhi 3

    హారర్, కామెడీ కాన్సెప్టుతో సాగే 'రాజుగారి గది' ఫ్రాంచైజీకి మంచి ఆదరణ లభిస్తోంది. 2015లో వచ్చిన మొదటి చిత్రంలో అశ్విన్ బాబు, పూర్ణ, ధన్యబాలకృష్ణన్, చేతన్ ముఖ్య పాత్రలు పోషించారు. 2017లో వచ్చిన 'రాజుగారి గది 2' మూవీలో నాగార్జున, సమంత నటించిన సంగతి తెలిసిందే. త్వరలో రాబోయే రాజుగారి గది 3లో తమన్నా, అశ్విన్ బాబు నటించబోతున్నారు.

    రాజుగారి గది 3 రెగ్యుల‌ర్ షూటింగ్ శుక్రవారం నుంచి మొదలు పెట్టనున్నారు. తొలి షెడ్యూల్ హైద‌రాబాద్‌ లోనే ప్రారంభం కానుంది. ఇందుకోసం కొన్ని అందమైన, థ్రిల్లింగ్ లొకేషన్స్ ఎంచుకున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు.

    ఓంకార్ దర్శకత్వంలో ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై 'రాజుగారి గది 3' తెరకెక్కుతోంది. ఈ ఈ చిత్రంలో ఇంకా ఊర్వ‌శి, అలీ, బ్ర‌హ్మాజీ, ప్ర‌భాస్ శ్రీను, హ‌రితేజ‌, అజ‌య్‌ఘోష్ తదితరులు నటించనున్నారు. చిత్రానికి ఛోటా కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్‌, గౌతంరాజు ఎడిటింగ్‌, సాహి సురేశ్ ప్రొడ‌క్ష‌న్ డిజైనర్‌గా, వెంక‌ట్ ఫైట్ మాస్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

    English summary
    Director Ohmkar’s ‘Raaju Gari Gadhi’ is a successful franchise. Taking it forward, Ohmkar is now coming up with the third part and the film is formally launched on Thursday.Actress Tamannah Bhatia thanked director Ohmkar for bringing the role to her in the first place in Raju Gari Gadhi 3.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X