ముద్దుగా ఉన్నారు, ఆయన వల్లే నా జీవితంలోకి హ్యాపీ డేస్: తమన్నా
విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్స్‌గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం 'ఎఫ్ 2'. 'ఫన్ అండ్ ఫ్రస్టేషన్' ట్యాగ్ లైన్. అనిల్ రావిపూడి దర్శకుడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న సినిమా విడుదలవుతుంది.
ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం మొత్తం పాల్గొంది. ఈ సందర్భంగా తమన్నా తన ప్రసంగంతో ఆకట్టుకుంది. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి, కోస్టార్స్ మీద ప్రశంసలు గుప్పించింది.

ఆయన వల్లే నా జీవితంలోకి హ్యాపీడేస్
కొన్ని సంవత్సరాల క్రితం నేను నటించిన ఒక సినిమా చూసిన దిల్ రాజుగారు ఇంప్రెస్ అయి నన్ను తీసుకున్నారు. ఆ రోజు నుంచి నా లైఫ్‌లో ‘హ్యాపీ డేస్' వచ్చేశాయి. అప్పటి నుంచి ఆయనతో మళ్లీ సినిమా చేయాలనుకుంటున్నాను. మధ్యలో కొన్ని కారణాల వల్ల వీలు కాలేదు. ఈ సినిమాలో ఆయన మళ్లీ నన్ను తీసుకున్నందుకు థాంక్స్... అని తమన్నా చెప్పుకొచ్చారు.

రియల్ లైఫ్ కామెడీ ఉంటుంది
రియల్ లైఫ్ సిచ్యువేషన్లతో కామెడీ సినిమాలు కొన్ని మాత్రమే ఉంటాయి. అలాంటి సినిమా ‘ఎఫ్ 2- ఫన్ అండ్ ఫ్రస్టేషన్'. అనిల్ రావిపూడి చాలా మంచి కథ రాశారు. సాధారణంగా నేను సినిమా షూటింగ్ అయిపోగానే సెట్‌లోని ఇతర నటీనటులతో గడపకుండా వెళ్లిపోతాను. కానీ ఈ సినిమాలో వెంకీగారు, వరుణ్, మెహ్రీన్ అందరితో షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా టైమ్ స్పెండ్ చేశాను. ఇదంతా అనిల్ రావిపూడి వల్లే సాధ్యమైందని తమన్నా చెప్పుకొచ్చారు.

వెంకీగారు ఇంకా అంత ముద్దుగా ఎలా ఉన్నారో...
వెంకీగారు చాలా సీనియర్. ఎన్నో సినిమాలు చేశారు... అయినా ఇంత ముద్దుగా, ఎంతో ప్రెష్‌గా ఎలా స్క్రీన్ మీద కనపడుతున్నారో తెలియడం లేదు. ఆయన ఇప్పటికీ ఉత్సాహంతో అందరితో సరదాగా ఉంటారు. మాకు ఆ కంఫర్ట్ క్రియేట్ చేసినందుకు ఆయనకు థాంక్స్.

వరుణ్ అభిమానిని, మ్యాజిక్ చేస్తాడు
వరుణ్ తేజ్‌కు నేను పెద్ద అభిమానిని. ఆయన స్క్రీన్ మీద మ్యాజిక్ చేసినట్లు ఉంటుంది. మెహ్రీన్ చాలా బాగా చేసింది. ఈ సినిమాలో ఆ పాత్రలో మెహ్రీన్ తప్ప ఎవరూ అంత బాగా చేయలేరు అనిపిస్తుందంటూ తమన్నా ప్రశంసలు గుప్పించారు.


Click it and Unblock the Notifications











