కెమెరామెన్‌తో పీకల్లోతు ప్రేమలో స్టార్ హీరోయిన్.. లిప్‌లాక్‌తో కన్ఫమ్ చేసిన బ్యూటీ!

టాలీవుడ్ టూ బాలీవుడ్ సెలబ్రెటీలు తమ డేటింగ్, ప్రేమ వ్యవహారాలతో వార్తల్లో నిలుస్తున్నారు. పబ్లిక్‌గా కొందరు తమ ప్రేమను వ్యక్తపరుస్తుండగా.. మరికొందరు మాత్రం సీక్రెట్‌గా తమ బంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇంకొందరైతే తమ ప్రేమ విషయాలను బయటపెట్టి బాంబు పేలుస్తున్నారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్.. కెమెరామెన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు. తాజాగా లిప్‌లాక్‌తో తమ ప్రేమను కన్ఫర్మ్ చేసి సినీజనాలకు షాకిచ్చింది. ఈ వివరాల్లోకి వెళితే..

బలమైన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్
ఆ హీరోయిన్ ఎవరో కాదు.. కోలీవుడ్ యంగ్ బ్యూటీ తాన్య రవిచంద్రన్‌. ఈమెకు బలమైన సినీ నేపథ్యం ఉంది. తాన్య తల్లి తరపు తాతగారు రవిచంద్రన్ సినీయర్ నటుడు. 1964-1979 మధ్యకాలంలో హీరోగా అలరించిన రవిచంద్రన్ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టర్న్ తీసుకుని బిజీ అయ్యారు. నాటి అందాల తార షీలాను పెళ్లాడారు రవిచంద్రన్. ఈ దంపతులకు జార్జ్ విష్ణు సంతానం. అయితే షీలాతో పెళ్లికి ముందే రవిచంద్రన్‌కు విమలతో వివాహం జరిగింది. వారికి కూతురు లావణ్య, కుమారులు బాలాజీ, హంసవర్ధన్ సంతానం. లావణ్య కుమార్తె తాన్య రవిచంద్రన్.

Actress Tanya Ravichandran Her Relationship with cameraman Goutham George

రాజా విక్రమార్కతో తెలుగులోకి
తాన్య అసలు పేరు అభిరామి శ్రీరామ్. భరతనాట్యం నేర్చుకున్న ఈ చిన్నది పలు ప్రదర్శనలు ఇచ్చింది. 2016లో బల్లే వెల్లాయతీవా సినిమాతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఆమె.. తర్వాత బృందావనం, కరుప్పన్, నేంజుకు నీదీ, మాయన్, ట్రిగ్గర్, అగిలన్, రసవతి సినిమాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2021లో కార్తీకేయ హీరోగా నటించిన రాజా విక్రమార్క సినిమాతో తెలుగువారిని పలకరించారు తాన్య రవిచంద్రన్. తర్వాత ఏకంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌‌ఫాదర్‌లో కీలకపాత్ర పోషించింది. ప్రస్తుతం రెట్ట థలా సినిమాలో తాన్య నటిస్తున్నారు.

సోషల్ మీడియాలో యాక్టీవ్
తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసినప్పటికీ స్టార్ హీరోయిన్లను మించి క్రేజ్ సొంతం చేసుకుంది తాన్య. అందం, అభినయం దండిగా ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో ఈమెకు అవకాశాలు రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే తాన్య రవిచంద్రన్ ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలతో పాటు ఇతర వ్యక్తిగత వివరాలను పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటోషూట్‌లతో తాన్య గత్తర లేపుతారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తాజా పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

ప్రియుడికి లిప్‌లాక్
కెరీర్ ప్రారంభం నుంచి పలువురితో తాన్య రవిచంద్రన్ డేటింగ్ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే వాటిని ఆమె పలుమార్లు ఖండించారు. తాను ఎవ్వరితోనూ రిలేషన్‌లోనూ లేరని తేల్చిచెప్పారు. అలాంటిది తన ప్రేమ విషయాని సంబంధించి సంచలన ప్రకటన చేశారు తాన్య రవిచంద్రన్. ఏకంగా బాయ్‌ఫ్రెండ్‌కు ఘాటుగా లిప్‌లాక్ పెట్టి అన్ని పుకార్లకు చెక్ పెట్టారు. అయితే తన ప్రియుడి వివరాలను మాత్రం ఆమె వెల్లడించలేదు. కానీ అదే సమయంలో తమిళ చిత్ర పరిశ్రమలో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న గౌతమ్ జార్జ్ కూడా షేర్ చేయడంతో తాన్య రవిచంద్రన్ ప్రియుడు అతనేనని క్లారిటీ వచ్చింది. వీరిద్దరికి ఎప్పుడు? ఎక్కడ పరిచయం ఏర్పడింది? ఎలా వీరిద్దరూ కలిశారంటూ కోలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X