Tapsee Pannu: మరోసారి లిమిట్స్ లేకుండా తాప్సి అందాల ఆరబోత.. స్టన్నింగ్ స్టిల్స్!

టాలీవుడ్ చిత్రపరిషంలో ఒకప్పుడు సొట్టబుగ్గల సుందరిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న తాప్సీ పన్ను మొదట్లో మంచి అవకాశాలు అయితే అందుకుంది. కానీ బ్యాడ్ లక్ వలన పెద్ద సినిమాల్లో మాత్రం అవకాశాలు అందుకోలేకపోయింది. ఇక ఎప్పుడైతే బాలీవుడ్ లోకి వెళ్లిపోయిందో అప్పటినుంచి తాప్సీ పన్ను రేంజ్ మారిపోయింది అనే చెప్పాలి. ప్రస్తుతం ఆమె అగ్ర హీరోలతో అగ్ర దర్శకులతో అలాగే బయోపిక్ సినిమాల్లో కూడా నటిస్తోంది. ఇక రీసెంట్ గా తాప్సీ పన్ను మరోసారి స్టన్ అయ్యే విధంగా గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఆ ఫోటోల వివరాల్లోకి వెళితే..

Image Courtesy: Tapsee Pannu Instagram

టాలీవుడ్ లో ఇలా..

టాలీవుడ్ లో ఇలా..

కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఝుమ్మంది నాదం అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన తాప్సీ మొదట కొన్ని బాలీవుడ్ ఆఫర్స్ కూడా అందుకుంది. కానీ అక్కడ మొదట్లో ఆమెకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే సెకండ్ హీరోయిన్ అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. ఇక అప్పుడే అలాంటి పాత్రలు చేయకూడదని తెలుగులో రెగ్యులర్ హీరోయిన్గా అవకాశాలు అందుకుంది.

మొదట్లోనే మంచి క్రేజ్

మొదట్లోనే మంచి క్రేజ్

ఒక విధంగా తెలుగులో ఎంట్రీ ఇచ్చినప్పుడు తాప్సీ పన్ను తన అందంతో అందరిని ఒక్కసారిగా ఎట్రాక్ట్ చేసింది. ఈ బ్యూటీని మొదటి సినిమాలోనే కే రాఘవేంద్రరావు చాలా బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేయడంతో ఇండస్ట్రీలో చాలా చాలా బాగా హైలెట్ అయింది. దీంతో తప్పకుండా స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతుంది అని కూడా ఎన్నో ప్రశంసలు అందాయి.

మంచి నటన

మంచి నటన

టాలీవుడ్ ఇండస్ట్రీలో తాప్సి బ్యాడ్ లక్ ఏమిటో గాని పెద్ద హీరోలతో మాత్రం నటించే అవకాశం దక్కించుకోలేకపోయింది. ఒకవేళ పెద్ద సినిమాల్లో నటించినా కూడా కేవలం సెకండ్ హీరోయిన్ గానే కనిపించింది. ప్రభాస్ తో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలలో మంచి నటనను కనబరిచినప్పటికీ కూడా ఈ బ్యూటీ ఆ తర్వాత మాత్రం వరుస అపజయాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

బాలీవుడ్ లో స్టార్ హోదా

బాలీవుడ్ లో స్టార్ హోదా

తాప్సి తన గ్లామర్ డోర్ పెంచి ఎప్పుడైతే బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిందో అప్పటినుంచి ఒక్కసారిగా ఆమె రేంజ్ మారిపోయింది. కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా కంటెంట్ ఉన్న ప్రయోగాత్మకమైన కథల్లో కూడా మెయిన్ పాత్రలో కనిపించింది. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనే ఆమె మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

గ్లామరస్ లుక్ వైరల్

గ్లామరస్ లుక్ వైరల్

అప్పుడప్పుడు తాప్సి సోషల్ మీడియాలో అందరికీ షాక్ ఇచ్చే విధంగా గ్లామరస్ ఫోటోలను కూడా పోస్ట్ చేస్తోంది. రీసెంట్ గా అమ్మడు స్టైలిష్ గా పొట్టి నిక్కరులో అలాగే ఇన్నర్స్ కనిపించే విధంగా ఒక కోట్ వేసుకుని దర్శనమిచ్చింది. గతంలో బికినీలో కూడా కనిపించిన తాప్సీ పన్ను ఈసారి మాత్రం అంతకుమించి అనేలా ఆకట్టుకుంది అని ఆమె ఫాలోవర్స్ కూడా పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

విడుదలకు సిద్దమైన బయోపిక్

విడుదలకు సిద్దమైన బయోపిక్

ఇక తాప్సి పన్ను నుంచి రాబోయే రోజుల్లో చాలా మంచి సినిమాలు రాబోతున్నాయి. ముఖ్యంగా మిథాలీ రాజ్ బయోపిక్ శభాష్ మీతు సినిమా జూలై 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుంది అని తాప్సి ఎంతో నమ్మకంతో ఉంది. అలాగే ఈ సినిమాపై మంచి బజ్ కూడా క్రియేట్ అయ్యింది. అలాగే మరికొన్ని బాలీవుడ్ ప్రముఖ సినిమాల్లో కూడా తాప్సి ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X