twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Tejaswi Madivada: ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ ఎలా అడుగుతారంటే.. ఒకరోజు రాత్రి 30 మంది వచ్చారు..

    |

    సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఏ స్థాయిలో ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో చాలామంది హీరోయిన్స్ క్యాస్టింగ్ కౌచ్ గురించి చాలా ఓపెన్ గానే వివరణ ఇచ్చారు. కొంతమంది సీనియర్ యాక్టర్స్ కూడా ఆ విషయంపై పలు ఉదాహరణలు కూడా చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక రీసెంట్ గా తేజస్వి మదివాడ కూడా తనకు ఎదురైన కొన్ని సంఘటనల గురించి తెలియజేసింది. ముఖ్యంగా కమిట్మెంట్ ఎలా అడుగుతారు అనే విషయంలో కూడా ఆమె వివిధ రకాల ఉదాహరణలను తెలియజేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

    క్యాస్టింగ్ కౌచ్

    క్యాస్టింగ్ కౌచ్

    సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ప్రతి ఒక్క దగ్గర వేధింపులు అనేవి ఉంటాయని కాకపోతే సినిమా పరిశ్రమ ఎప్పుడూ హైలెట్ అయ్యే అంశం కాబట్టి అందరి ఫోకస్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది అని కొంతమంది సినీ ప్రముఖులు చెబుతూ ఉంటారు. క్యాస్టింగ్ కౌచ్ విషయంలో దర్శకులు కూడా చాలాసార్లు తప్పులు చేసినట్లు కొంతమంది హీరోయిన్స్ ఓపెన్ గానే తెలియజేశారు. మరికొందరు వాటిని ఎదిరించి కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నట్లు కూడా తెలియజేస్తున్నారు.

    కమిట్మెంట్ సినిమాతో తేజస్వి

    కమిట్మెంట్ సినిమాతో తేజస్వి

    ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునందుకున్న తేజస్వి కూడా త్వరలోనే క్యాస్టింగ్ కౌచ్ కమిట్మెంట్ బ్యాక్ గ్రౌండ్లో కమిట్మెంట్ అనే సినిమాతో రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లో ఈ బ్యూటీ ఇండస్ట్రీలో కమిట్మెంట్ అనేది ఎలా ఉంటుంది అలాగే దానిని ఎదుర్కోవాలి అంటే ఏ విధంగా ఉండాలి అనే విషయాలపై కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

    ఫైట్ చేయాలి

    ఫైట్ చేయాలి

    ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైనప్పుడు ఇండస్ట్రీ మొత్తం బాగాలేదు అనడం కరెక్ట్ కాదు. మీకు అలాంటి చేదు అనుభవాలు ఎదురైనప్పుడు ఫైట్ చేయాలి. ఆ సమయంలో ఏదో లొంగిపోయి తప్పు చేయకుండా ముందే దాన్ని ఎదుర్కొంటే అక్కడితోనే ఆ మ్యాటర్ క్లోజ్ అవుతుంది కానీ లొంగిపోయిన తర్వాత నన్ను మోసం చేశారు అనేది ఏ మాత్రం కరెక్ట్ కాదు.. అని తేజస్వి కొంతమందిని ఉద్దేశిస్తూ ఈ కామెంట్ చేసినట్లుగా తెలుస్తోంది.

    అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను

    అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను

    కాస్టింగ్ కౌచ్ అనేది మీ అభిప్రాయం పైనే ఆధారపడి ఉంటుంది మీరు అక్కడ ఒప్పుకుంటేనే అవతలి వారు అడ్వాంటేజ్ తీసుకుంటారు. మీకు నచ్చదు అంటే అక్కడితోనే ఆ మ్యాటర్ క్లోజ్ అయిపోతుంది. నేను కూడా అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను. కాబట్టి ఈ విధంగా చెబుతున్నాను. ఏదేమైనా కూడా మనం అక్కడ స్ట్రాంగ్ గా ఉంటేనే వర్క్ అవుట్ అవుతుంది అని తేజస్వి తెలియజేసింది.

    30 మంది తాగి వచ్చారు

    30 మంది తాగి వచ్చారు

    తనను కూడా చాలాసార్లు కమిట్మెంట్ అడిగారు. ముఖ్యంగా కొన్నిసార్లు ఈవెంట్స్ కు వెళ్ళినప్పుడు ఈవెంట్ ముగిసిన తర్వాత చాలామంది వచ్చేవారు. ఒకసారి అయితే 30 మంది తాగి వచ్చేసి తనను చుట్టుముట్టేశారు. అని తేజస్వి తెలియజేసింది. అప్పుడు మనం తెలివిగా తప్పించుకోవాలని నేను అయితే అక్కడ కొంచెం ఏడ్చి వెళ్లిపోయినట్లుగా తెలియజేసింది.

    కమిట్మెంట్ ఎలా అడుగుతారంటే?

    కమిట్మెంట్ ఎలా అడుగుతారంటే?

    ఎవరైనా వ్యక్తి మన నుంచి ఏదో కోరుకుంటున్నట్లు చాలా ఈజీగానే అర్థమయిపోతుంది. మొదట కొంతమంది అయితే డైరెక్ట్ గా అడగేస్తారు. మరి కొంతమంది కొన్ని రోజులు పాటు స్నేహంగా ఉండి ఆ తర్వాత ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. ఈ విధానంలో మనం స్ట్రాంగ్ గా ఉండాలి. ఇది కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు ప్రతి చోట ఉంటుంది. అమ్మాయి అయితే చాలు ఇలాంటి అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయని అలాంటి వారికి కమిట్మెంట్ సినిమా ఒక రూల్ బుక్ తరహాలో ఉంటుంది అని తేజస్వి తనదైన శైలిలో వివరణ ఇచ్చింది.

    English summary
    Actress Tejaswi Madivada about commitment in industry..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X