‘ నా జీవితాన్ని నాశనం చేసింది ఆ బాస్'
బిగ్‌బాస్‌లో అడుగుపెట్టి ఆ షోలో ఇరగదీసిన వారు తర్వాత అడ్రస్ లేకుండా పోవడం చూస్తూనే ఉన్నాం. కంటెస్టెంట్సే కాదు టైటిల్ విన్నర్స్‌గా గెలిచిన వారు కూడా తర్వాత లైమ్ లైట్‌లో కనిపించలేదు. ఇదే కోవలోకి వస్తారు తేజస్వి మదివాడ. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2లో తన గ్లామర్‌తో హౌస్‌కి అందాలు తీసుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఎవ్వరికీ కనిపించడం లేదు. హఠాత్తుగా ఇండస్ట్రీకి ఆమె ఎందుకు దూరమయ్యారు. ఈ వివరాలు తేజస్వి మాటల్లోనే తెలుసుకుందాం.
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన తేజస్వి మదివాడ .. 2012లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో చిన్న పాత్రలో కనిపించారు. ఆ వెంటనే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేశ్ బాబు - వెంకటేష్‌లు కలిసి నటించిన మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో సమంతకు కజిన్‌గా అలరించారు. తర్వాత మనం, హార్ట్ అటాక్ వంటి సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలలో కనిపించింది తేజస్వి. ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మ కళ్లలో పడిన ఆమె.. ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన ఐస్‌క్రీమ్ మూవీ ద్వారా తొలిసారిగా హీరోయిన్‌గా ఛాన్స్ పట్టేసింది. ఈ సినిమాలో అందాల ఆరబోత చేసినా ఆమెకు పెద్దగా కలిసి రాలేదు.

తర్వాత లవర్స్, అనుక్షణం, మళ్లీమళ్లీ ఇది రాని రోజు, పండగ చేస్కో, కేరింత, సుబ్రమణ్యం ఫర్ సేల్, శ్రీమంతుడు, జత కలిసే, కృష్ణాష్టమి, మిస్టర్, బాబు బాగా బిజీ, బాలకృష్ణుడు, జాంబీ రెడ్డి, కమిట్‌మెంట్ వంటి సినిమాల్లో నటించింది. బిగ్‌బాస్ తెలుగు 2లో ఆరు వారాల పాటు హౌస్‌లో ఉండి బుల్లితెర ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. బిగ్‌బాస్‌తో బాగా పాపులర్ అయినా అవకాశాలు మాత్రం ఈ స్థాయిలో అందుకోలేదు తేజస్వి మదివాడ.
లాంగ్ గ్యాప్ తర్వాత కమిట్‌మెంట్ మూవీలో కనిపించింది తేజస్వి మదివాడ. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. అమ్మాయిలకు అవకాశాలు రావాలంటే కమిట్‌మెంట్‌కు ఒప్పుకోవాలని , వాటిని తాను ఫేస్ చేశానని తేజస్వి ఓపెన్‌గా చెప్పింది. తాజాగా ఆమె నటించిన వెబ్ సిరీస్ అర్ధమైందా అరుణ్ కుమార్ వెబ్ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
రీసెంట్‌గా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తేజస్వి మదివాడ మాట్లాడుతూ తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కెరీర్‌లో గ్యాప్ రావడానికి కారణంగా బిగ్‌బాస్ నుంచి వచ్చిన ప్రెజర్ అని చెప్పింది. తానే ఇక సినిమాలు చేయనని, నాకు యాక్టింగ్ రాదని అందరికీ ఫోన్ చేసి చెప్పానని తేజస్వి సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్‌బాస్ నుంచి వచ్చిన రెండేళ్ల వరకు తాను ఖాళీగా ఉన్నానని.. అక్కడ సంపాదించిన డబ్బుతోనే కాలం గడిపేశానని ఆమె తెలిపారు. ప్రేమించిన అబ్బాయితోనూ బ్రేకప్ జరిగిందని, చివరికి పెళ్లి క్యాన్సిల్ చేశానని తేజస్వి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ మెంటల్ టార్చర్ తట్టుకోలేక పిచ్చి పీక్స్ అనబోయి.. పొరపాటున బూతు పదం వచ్చేసిందని తేజస్వి తెలిపారు. అయినా నేనేంటో నాకు, నా ఫ్రెండ్స్‌కి తెలుసునని చెప్పారు. నన్ను పర్సనల్‌గా కలిసి, నాతో టైమ్ స్పెండ్ చేసి నేనంటే ఏంటీ అనే జడ్జిమెంట్ ఇస్తే నేను వింటానని.. టీవీలోనో, ఏదో థంబ్‌నైల్ చూసి నా క్యారెక్టర్ చెబుతానంటే ఎలా ఊరుకుంటానని తేజస్వి పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











