'అల్లు అర్జున్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. కానీ, ఆ కోరిక తీరిపోయింది'
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు వినగానే అభిమానుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తుంది. ఆయనకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ చెప్పలేనంతది. పాన్ ఇండియా స్టార్‌గా నిలిచిన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. 'పుష్ప రాజ్'గా ఆయన నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆ సినిమాతో నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూలు చేసిన పుష్ప సినిమా, ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఇంతటి స్టార్ హీరోకు అభిమానులు లక్షల్లో ఉండగా, మహిళా అభిమానులు అయితే కోట్లలో ఉన్నారని చెప్పొచ్చు. అల్లు అర్జున్‌పై ఎంతోమంది హీరోయిన్‌లు కూడా అభిమానాన్ని వ్యక్తం చేశారు. తాజాగా ఓ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె తన తండ్రితో మాట్లాడుతూ "నాకు పెళ్లి అంటే అల్లు అర్జున్‌లాంటి వారినే చేసుకుంటా, లేకపోతే పెళ్లి చేసుకోను" అని చెప్పిందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు?
మెగా కాంపౌండ్ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్.. 'గంగోత్రి' సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలోని 'ఆర్య' సినిమాతో బన్నీకి భారీ బ్రేక్ వచ్చింది. ఆ చిత్రం ఆయన కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచి, "స్టైలిష్ స్టార్"గా ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. 22 ఏళ్ల సినీ ప్రయాణంలో అల్లు అర్జున్ ఎన్నో రకాల పాత్రలు పోషించి తన నటనతో మంత్రముగ్ధులను చేశాడు. 'ఆర్య-2', 'పరుగు', 'వేదం', 'దేశముదురు', 'రేసు గుర్రం', 'సరైనోడు', 'జులాయి', 'అల వైకుంఠపురములో' వంటి హిట్ సినిమాలతో వరుస విజయాలు సాధించాడు. నటనలో వైవిధ్యం చూపిస్తూ.. చరిత్రాత్మక పాత్రలు, యాక్షన్ రోల్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లలోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

అయితే ఆయన కెరీర్‌లో గేమ్ ఛేంజర్‌గా నిలిచింది 'పుష్ప' సినిమా. పుష్ప రాజ్ పాత్రతో దేశవ్యాప్తంగా ఆయన ఫ్యాన్‌బేస్ విస్తరించింది. ఆ సినిమా కోసం అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకుని తెలుగు సినీ చరిత్రలో అరుదైన గౌరవం సాధించాడు. ప్రస్తుతం 'పుష్ప 2'తో మరోసారి పాన్ ఇండియా స్థాయిలో సంచలనాన్ని సృష్టించారు. తన 22 ఏళ్ల కెరీర్ ఎన్నో విజయాలు అందుకున్నారు. ప్రధానంగా అల్లు అర్జున్ స్టైల్, డాన్స్, డైలాగ్ డెలివరీ, హ్యూమర్ ఇవన్నీ కలిపి ఆయనను అభిమానుల హృదయాల్లో ఒక ఐకాన్ స్టార్ గా నిలిచారు. అలాంటి హీరో ను పెళ్లి చేసుకోవాలని భావించింది ఎవరో కాదు. తెలుగు నటి తేజస్వీ మదిడాల.
తేజస్వీ మదిడాల.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసుల్లో చోటు దక్కించుకుంది. ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాల మల్టీస్టారర్ *'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'*లో సమంతకు కజిన్‌గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. తదుపరి 'మనం', 'హార్ట్ అటాక్' వంటి హిట్ చిత్రాల్లో కనిపించి, తేజస్వి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అచ్చమైన తెలుగు అమ్మాయి అయిన ఆమె నటనలో సహజత్వం, స్క్రీన్‌పై ఉత్సాహం ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయ్యేలా చేశాయి. అలాగే రామ్ గోపాల్ వర్మ దృష్టిలో పడిన తేజస్వి, ఆయన దర్శకత్వంలో వచ్చిన 'ఐస్‌క్రీమ్' సినిమా ద్వారా తొలిసారి హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుంది. ఈ చిత్రం ఆమెకు గ్లామర్ ఇమేజ్‌తో పాటు కొత్త దారిని కూడా చూపించింది. అప్పటి నుంచి సినిమాలు, వెబ్ సిరీస్‌లు, షోలు అంటూ తేజస్వి బిజీగా కొనసాగుతోంది.
హీరోయిన్ తేజస్వీ మదిడాల తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ ఆమెను "మీకు ఏ హీరోతో నటించాలని ఉంది?" అని అడగగా, తేజస్వి క్షణం కూడా ఆలోచించకుండా "అల్లు అర్జున్‌తో" అని సమాధానమిచ్చింది. ఆమె మాట్లాడుతూ "చిన్నప్పుడే నా నాన్నకి 'నేను అల్లు అర్జున్ ని పెళ్లి చేసుకుంటా' అని చెప్పేసా. నాన్న నవ్వుతూ 'ఎందుకు అమ్మ?' అని అడిగితే, 'అల్లు అర్జున్ లా డాన్స్ చేసే వాళ్లు లేరు, నేను కూడా డాన్సర్ ని, డాన్సర్స్ కి తమకంటే బాగా డాన్స్ చేసే వాళ్లు చాలా ఇష్టముంటారు' అని చెప్పా," అని నవ్వుతూ చెప్పింది.
తేజస్వి ఇంకా చెప్పింది "నిజంగా ఆయనతో ఒకసారి అయినా డాన్స్ చేయాలని నా కోరిక. ఆన్‌స్క్రీన్‌లో ఆయనతో ఒక సీన్ వచ్చినా చాలు అనిపిస్తుంది. ఐ యామ్ డ్రీమింగ్ అబౌట్ ఇట్!"అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అదే సమయంలో తన కెరీర్‌కి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం కూడా వెల్లడించింది.
"నా కెరీర్ స్టార్ట్ అయినది కూడా అల్లు అర్జున్‌తోనే. 7Up యాడ్‌లో ఆయనతో బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్‌గా పని చేశా. ఆ యాడ్‌లో బన్నీతో నాకు చిన్న రోల్ కూడా ఉంది. అప్పుడే నా డ్రీమ్ ఫుల్ అయిపోయినట్టే అనిపించింది" అని తేజస్వి చెప్పింది. ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











