10000 కోట్ల ఆస్తులున్న హీరోయిన్.. ఒక్కసారిగా దివాళా తీసిన పరిస్థితి.. ఆ అందాలభామ ఎవరంటే?
సినీ తారలు వెండి తెర మీద అద్బుతంగా రాణిస్తూనే కోట్లు సంపాదిస్తుంటారు. స్టార్ హీరోయిన్‌గా అభిమానుల నుంచి అద్బుతమైన స్పందన అందుకొంటూనే పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమవుతుంటారు. గతంలో తమ స్టార్ డమ్‌ను వదులుకొని దాంపత్య జీవితంతో సరిపెట్టుకొన్న తారలు చాలా మందే ఉన్నారు. అందులో టీనా మునిమ్ ఒకరు.. టీనా మునిమ్ ఎవరు? టీనామా మునిమ్ .. టీనా అంబానీగా ఎలా మారిందనే విషయంలోకి వెళితే..
ప్రముఖ నటుడు, బాలీవుడ్ లెజెండ్ దేవ్ ఆనంద్ దృష్టిలో పడిన టీనా మునిమ్ బాలీవుడ్‌లో అడుగపెట్టింది. 20 ఏళ్ల వయసులో దేవ్ ఆనంద్ నటించి నిర్మించిన దేశ్ పరదేశ్ సినిమాతో యువతను విశేషంగా ఆకట్టుకొన్నది. అతి కొద్ది సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అమోల్ పాలేకర్, రాజేశ్ ఖన్నా, రిషీ కపూర్ లాంటి అగ్రహీరోలతో నటించింది.

బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా టీనా మునిమ్ రాణిస్తున్న సమయంలోనే చాలా మంది హీరోలతో డేటింగ్, అఫైర్ వార్తలు గుప్పుమన్నాయి. అయితే అలాంటి వార్తలకు అంత ప్రాధాన్యం లభించలేదు. అయితే అంబానీ వారసుడు అనిల్ అంబానీతో ప్రేమ పెడ్డారనే వార్త అప్పట్లో మీడియాలో హైలెట్ అయింది.
అనిల్ అంబానీ, టీనా మునిమ్ ప్రేమ వ్యవహారం బాలీవుడ్ మీడియా పతాక శీర్షికలను ఆకర్షించింది. వారిద్దరూ కలిసి మెలిసి తిరగడం.. విహార యాత్రలు చేయడం హాట్ టాపిక్‌గా మారాయి. ఆ తర్వాత మీడియా వార్తలకు చెక్ చెబుతూ టీనా మునిమ్, అనిల్ అంబానీ వివాహం చేసుకొన్నారు. దాంతో టీనా మునిమ్ కాస్త టీనా అంబానీగా మారింది.

అయితే లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకొనే టీనా మునీమ్ ఒక్కసారిగా కోటీశ్వరురాలైంది. అంతేకాకుండా అంబానీ వ్యాపార సామ్రాజ్యంలో రాణిలా మారిపోయింది. ఒక దశలో టీనా మునిమ్ నికర ఆస్తుల విలువ 10000 కోట్లు. అయితే సంపన్న వ్యాపారవేత్తగా ఉన్న టీనా మునిమ్ ఫ్యామిలీ ఆస్తులు ఒక్కసారిగా తలకిందులయ్యాయి.
అనిల్ అంబానీ వ్యాపారాలు సవ్యంగా సాగుతున్నాయని అనుకొన్నారు. కానీ కొద్ది రోజుల క్రితం ఆయన దివాళా పిటిషన్ దాఖలు చేయడంతో ఒక్కసారిగా అందరు షాక్ తిన్నారు. దివాళా పిటిషన్ తర్వాత టీనా అంబానీ ఆస్తుల విలువ 2300 కోట్లకు పడిపోయింది. అయినా వారు విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదించడం గమనార్హం.


Click it and Unblock the Notifications











