ఆ పనికి మొగుడు అవసరం లేదు.. పెళ్లి కాకుండానే తల్లిని అవుతా..


సినీ ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిలు, డివోర్స్ కామన్. ఎవరూ ఎప్పుడు కలుస్తారో.. ఎవరూ ఎప్పుడు వీడిపోతారో.. చెప్పడం చాలా క్షష్టం. కొంత మంది సెలబ్రెటీలు తమకు నటించవారిని పెళ్లి చేసుకుని బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేస్తుంటే.. మరికొందరూ తమకు నచ్చని వారితో విడాకులు తీసుకుని లైఫ్ ను ఒంటరిగా లీడ్ చేస్తున్నారు. ఇలా కొంతమంది స్టార్స్ వారి సినిమాల కంటే.. వారి పర్సనల్ లైఫ్ మూమెంట్స్ తో వార్తల్లో నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో తెగ పాపులర్టీ తెచ్చుకుంటారు. కానీ, ఓ హీరోయిన్ మాత్రం చాలా భిన్నంగా ఆలోచించింది. అందరిలా కాకుండా వెరైటీ గా పెళ్లికాకుండానే తల్లి కావాలని భావిస్తోంది. పైగా ఆ పని పెళ్లి, మొగుడు అవసరం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే..?

ఆ బ్యూటీ ఎవరో కాదు.. బాలీవుడ్ హీరోయిన్, బిగ్ బాస్ ఫేమ్ టీనా దత్త. అమ్మడు బాలనటిగానే కెరీర్ ప్రారంభించింది. మెయిన్ గా కలర్స్ టీవీ 'ఉత్తరన్' సీరియల్ ద్వారా చాలా పాపులర్ అయ్యింది టీనా దత్త. ఈ సీరియల్ తో ఎనలేని పాపులర్టీ సొంతం చేసుకుంది. ఆ తరువాత అనేక సీరియల్స్ చేస్తూ తనకంటూ స్టార్ట్ డమ్ సంపాదించుకుంది. ఈ ఫేమ్ తో బిగ్ బాస్ షోలో కూడా పాల్గొంది. ఇక టీనా దత్తా సీరియల్స్, షోలే కాదు..
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలతో ఫ్యాన్స్ కు చెమటలు పట్టిస్తుంది. బుల్లితెరపై ఆమె చాలా ఫేమస్. తాజాగా ప్రేమ, పెళ్లి, పిల్లలపై ఈ అమ్మడు చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి.

Actress Tina Datta Plans Single Motherhood Via Adoption or Surrogacy

నటి టీనా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన ఫ్యూచర్ ప్లానింగ్ బయటపెట్టింది.తాను తల్లిని కావాలని కోరుకుంటున్నానని, కానీ, పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, పెళ్లి చేసుకోకుండానే తల్లి కావాలని కోరుకుంటున్నానని ఆమె చెప్పింది. తాను పెళ్లి చేసుకోవడానికి ఏమాత్రం తొందరపడడం లేదని చెప్పుకొచ్చింది. తాను భవిష్యత్తులో మంచి తల్లిని కాగలనని నమ్ముతున్నానని అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది టీనా దత్తా. ప్రస్తుతం పెళ్లి గురించి ఆలోచించలేదు. దాని గురించి కూడా ఎటువంటి ప్రణాళికలు కూడా లేవని అన్నారు టీనా..

అయితే.. సరైన సమయం వచ్చినప్పుడు తాను మంచి తల్లిని అని నిరూపించుకుంటానని, అయితే.. బిడ్డను దత్తత తీసుకోవడమా లేదా సరోగసీ ద్వారా తల్లి కావడమా అనేది ఇంకా ఆలోచించలేదన్నారు. తాను తన కుటుంబాన్ని ఒంటరిగా చూసుకోగలనని నమ్మకం వ్యక్తం చేసింది. అలాగే.. తన పిల్లలను కూడా ఒంటరిగా చూసుకోగలనని, ఆ విషయానికి భర్త అవసరం లేదని, ఆ బాధ్యతను నిర్వర్తించడానికి తానొక్కడినే చాలని పేర్కొంది.

Actress Tina Datta Plans Single Motherhood Via Adoption or Surrogacy

టీనా దత్తా ఇంకా మాట్లాడుతూ.. తాను సుష్మితా సేన్‌కి పెద్ద అభిమాని అనీ, ఆమె ఇద్దరు కూతుళ్లను దత్తత తీసుకున్న విధానం తనకు స్ఫూర్తినిచ్చిందన్నారు. అలాగే..తన జీవితంలో తాను ఏ నిర్ణయం తీసుకున్నా .. తన తల్లిదండ్రులు మద్దతుగా నిలుస్తారని, భవిష్యత్తులో తాను సరోగసీ ద్వారా తల్లి కావడం లేదా.. బిడ్డను దత్తత తీసుకున్నప్పటికీ తన తల్లిదండ్రులు తన అభిప్రాయాన్ని గౌరవిస్తారని చెప్పుకొచ్చింది. ఇదెలా ఉంటే.. టీనా దత్తా ఇటీవల ముంబై జిమ్ సంస్కృతి ఆధారంగా రూపొందించబడిన క్రైమ్-థ్రిల్లర్ సిరీస్ 'పర్సనల్ ట్రైనర్'లో కనిపించింది. ఈ 'పర్సనల్ ట్రైనర్' జనవరి 23నుండి హంగామాలో స్ట్రీమింగ్ అవుతోంది.

More from Filmibeat

Read more about: tina datta bollywood bigg boss
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X