పెళ్లిపై త్రిష తుది నిర్ణయం.. ఆ ఒక్క కారణంతోనే సింగిల్ గా.. రీజన్ ఏంటంటే?
స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ దక్షిణాదిలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఒక దశలో టాలీవుడ్, కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఊపూపింది. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. చిత్ర పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. 2002 నుంచి ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటోంది. ఇప్పటికీ 23 ఏళ్ల కెరీయర్ ను పూర్తి చేసుకుంది. తమిళం, తెలుగు, మలయాళం చిత్రాల్లో వరుసగా నటిస్తూ వచ్చింది. అగ్ర హీరోలకు జోడీగా నటించి తను కూడా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది.
టాలీవుడ్ లోకి మాత్రం ఈ బ్యూటీ, 'వర్షం' చిత్రంతో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. అంతకంటే ముందే 'నీ మనస్సు నాకు తెలుసు' అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చినా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ప్రభాస్ కు జోడీగా నటించిన వర్షం భారీ హిట్ ను దక్కించి పెట్టింది. త్రిష పేరు టాలీవుడ్ లో మారిపోయింది. ఆ తర్వాత 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'అతడు', 'పౌర్ణమి', 'స్టాలిన్', 'బుజ్జిగాడు', 'కింగ్', 'నమో వెంకటేశా', 'తీన్ మార్', 'బాడీ గార్డ్', 'లయన్'.. వంటి గుర్తుండిపోయే సినిమాల్లో నటించి మెప్పింది.

టాలీవుడ్ అగ్ర హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ల సరసన నటించి మెప్పించింది. దక్షిణాది ఫిల్మ్ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకుంది. కోట్లల్లో అభిమానులను సంపాదించుకుంది. అయితే కొన్నాళ్లుగా అభిమానుల నుంచి త్రిష కృష్ణన్ కు ఎదురవుతున్న ఒకే ఒక్క ప్రశ్న పెళ్లి ఎప్పుడు? అయితే దీనిపై పలు రకాలుగా రూమర్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. తమిళ స్టార్ హీరో పెళ్లి అని, ఇతర బిజినెస్ మెన్ లతో పెళ్లి జరగబోతుందంటూ పుకార్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయితే వాటన్నింటినీ త్రిష, వాళ్ల అమ్మ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వచ్చారు.
పెళ్లిపై ఇప్పట్లో పెద్దగా ఆసక్తి లేదని, కేవలం కెరీయర్ పైనే ఆసక్తి చూపిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం త్రిష వయస్సు నాలుగు పదుల వయస్సు దాటినా పెళ్లికి మాత్రం ఇంకా ఆలస్యం చేస్తోంది. త్వరలో ఈ బ్యూటీ పుట్టిన రోజు వేడుకలు కూడా జరగబోతున్నారు. వచ్చే నెల మే 4తో త్రిష కృష్ణన్ 42వ ఏట అడుగుపెడుతుంది. దీంతో ఇంకెప్పుడు తమ అభిమాన హీరోయిన్ పెళ్లి చేసుకుంటుందని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా త్రిష కృష్ణన్ పెళ్లిపై తన తుది నిర్ణయాన్ని చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నటి డిసీషన్ నెట్టింట వైరల్ గా మారింది.
త్రిష పెళ్లిపై రీసెంట్ గా స్పందిస్తూ.. పెళ్లిపై తనకు పెద్దగా నమ్మకం లేదని చెప్పినట్టు తెలుస్తోంది. అందుకే పెళ్లి చేసుకోవాలనే ఆలోచనకే దూరంగా ఉందని చెప్పిందంట. ఇప్పటి వరకు తనకు నమ్మకమైన వ్యక్తి దొరకలేదని, అందుకే పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉన్నట్టు చెప్పింది. తన పూర్తి జీవితాన్ని ఒకరిని నమ్మి ఇవ్వడం చాలా కష్టమని, మళ్లీ విడాకులతో ఆ బంధాన్ని ముంగించడం ఇష్టం లేదని చెప్పినట్టు తెలుస్తోంది. అందుకే సింగిల్ గా ఉంటూ కెరీర్ పై ఫోకస్ పెట్టిందంట. ఇక త్రిష తెలుగులో 'విశ్వంభర', తమిళంలో 'థగ్ లైఫ్', 'సూర్య45', మలయాళంలో 'రామ్' అనే చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











