పొట్టి నిక్కరుతో త్రిష ఇరుగదీసిందిగా.. కరోనాకే పిచ్చెక్కించేలా..
ప్రపంచవ్యాప్తంగా అందరి జీవితాలను కరోనావైరస్ స్తంభింపజేసింది. ఇక సినీ సెలబ్రిటీల గురించి చెప్పనక్కర్లేదు. ఈ లాక్‌డౌన్ పిరియడ్‌లో ఏం చేయాలో తోచని పరిస్థితి. ఈ క్రమంలో త్రిషా సోషల్ అకౌంట్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. గృహ నిర్బంధాన్ని మరిచిపోయేందుకు ఆమె ఏం చేసిందంటే..
Recommended Video

ఇప్పటికే సోషల్ మీడియాలో హల్‌చల్
దక్షిణాది హీరోయిన్లలో ఎక్కువగా సోషల్ మీడియాలో సందడి చేస్తుంటుంది. ట్విట్టర్, ఇన్స్‌టాగ్రామ్, ఫేస్‌బుక్ లాంటి వాటిని విరివిగా ఉపయోగిస్తుంటుంది. తన గురించి గానీ, తన సహచరులు గురించి గానీ వివరాలను అభిమానులతో పంచుకొంటారు. తాజాగా లాక్‌డౌన్ కొనసాగుతుండగా.. రానా, అల్లు అర్జున్‌తో కలిసి ఇన్స్‌టా వీడియో చాటింగ్ ఎంత వైరల్‌గా మారిందో తెలిసిందే.

టిక్ టాక్‌లోకి ఎంట్రీ
తాజాగా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో మరో ముందడుగు వేసింది త్రిషా. ఇప్పటికే అత్యంత ప్రజాదరణను పొందిన టిక్ టాక్ యాప్‌లోకి ప్రవేశించింది. పొట్టి నిక్కరు ధరించిన త్రిష వయ్యారంగా డ్యాన్స్ చేస్తూ తొలి ప్రవేశంతోనే ఇరుగదీసింది. ఆ తతర్వాత తన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హాలీవుడ్ పాటకు స్టెప్పులేసి..
టిక్‌టాక్‌లోకి ప్రవేశించిన త్రిషా అత్యంత ప్రేక్షకదారణ పొందిన సింగర్ మేగన్ థీ స్టాలియన్ పాడిన సావేజ్‌పై స్టెప్పులు వేసింది. పొట్టి నిక్కరుతో చేసిన డ్యాన్స్ హాట్ హాట్‌గా మారింది. ఇక టిక్‌టాక్‌లో త్రిషను ఆపేది ఎవరు అనే విధంగా ఫోజులిచ్చింది. ఇక కరోనావైరస్ బాధను పరుగులు పెట్టించేలా ఇలా కనిపించింది.

ఆచార్యకు త్రిష షాక్
తమిళంలో విజయం సాధించిన 96 మూవీ తర్వాత వరుస సినిమాలతో త్రిష దూసుకెళ్తున్నది. మణిరత్నం రూపొందించే పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటిస్తున్నది. అలాగే ఆమె నటించిన పారపాధమ్ విలయట్టు, గర్జనాని,రాంగీ, షుగర్, రామ్ లాంటి చిత్రాలు రిలీజ్‌కు సిద్దంగా ఉన్నాయి. కాగా, ఇటీవల చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











