Don't Miss!
- News
Bengaluru: ఇది బెంగళూరులో పరిస్థితి, జంటను కారులో వెంబడించి. కారు కెమెరాలో చిక్కిపోయారు!
- Sports
IND vs NZ: స్టన్నింగ్ డెలివరీతో షేన్ వార్న్‌ను గుర్తు చేసిన కుల్దీప్ యాదవ్వీడియో
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Trisha Krishnan: పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన త్రిష.. ఫోకస్ మొత్తం అటువైపే అంటూ..
టాలెంటెడ్ సీనియర్ హీరోయిన్ త్రిష కృష్ణన్ సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టి 23 ఏళ్ళు దాటింది. నాలుగు పదుల వయసులోకి వెళుతున్నా ఇంకా అమ్మడు తన గ్లామర్ తో హీరోయిన్ గా మంచి అవకాశాలు అందుకుంటోంది. త్రిష కంటే తరువాత వచ్చిన వారు ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ తో వెళుతుంటే ఇంకా త్రిష మాత్రం తన అందంతో కథానాయికగా అవకాశాలు అందుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక ప్రస్తుతం కూడా ఈ బ్యూటీకి చాలమంచి అవకాశాలు వస్తున్నాయి.
ఇటీవల తమిళ పాన్ ఇండియా మూవీ పొన్నియిన్ సెల్వన్ 1లో కూడా ముఖ్యమైన పాత్రలో నటించి మంచి గుర్తింపును అందుకుంది. అయితే త్రిష పాలిటిక్స్ లోకి రాబోతున్నట్లు గత కొంతకాలంగా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. తమిళనాడులోనే ఆమె కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేయనుందని ఇప్పటికే అధిష్టానంతో కూడా చర్చలు జరిపినట్లు కూడా కథనాలు వచ్చాయి. అయితే ఆ వార్తలు వైరల్ అయినప్పుడు త్రిష వాటిపై పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు. దీంతో దాదాపు అందరు నిజమని అనుకున్నారు.

ఇక మొత్తానికి త్రిష ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం వస్తున్న రాజకీయ కథనాల్లో ఎలాంటి నిజం లేదని అంటూ.. తాను ఏ రాజకీయ పార్టీలతో కలవలేదని మాట్లాడలేదని కామెంట్ చేసింది. అంతే కాకుండా ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం కూడా సినిమా కెరీర్ పైనే ఉందని ఇంకా చాలా పాత్రలు చేయాల్సి ఉందని అమ్మడు తన వివరణ ఇచ్చింది. అయితే త్రిష రాజకీయాల్లోకి పూర్తిగా రాను అని అయితే చెప్పలేదు.
ఇక అంతకుముందు త్రిష తన పెళ్లిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. ఒక ప్రముఖ బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్ రావడంతో అందులో కూడా నిజం లేదని తేల్చి చెప్పింది. అదే విధంగా పెళ్లి అనేది నూరేళ్ళ బంధం అని అది మధ్యలో విడిపోయేలా ఉండకూడదు అంటూ పెళ్లి చేసుకుంటే కలకాలం ఇష్టమైన వ్యక్తితోనే ఉండాలని అనుకుంటున్నట్లు త్రిష తన వివరణ ఇచ్చింది.