సీనియర్ హీరోకు ఇల్లు అమ్ముకొన్న త్రిష.. ఎన్ని కోట్లకు అమ్మిందంటే?

రంగుల ప్రపంచం లాంటి చిత్ర పరిశ్రమలో .. చిత్ర పరిశ్రమలో విచిత్రమైన ఘటనలు జరుగుతుంటాయి. ఏది ఎందుకు జరుగుతోందో ఎవ్వరూ చెప్పలేరు. కొన్ని విషయాలు పాఠాలను, గుణపాఠాలను కూడా నేర్పుతాయి. వీటిని అనుక్షణం మైండ్‌లో పెట్టుకున్నవాడు ఎన్ని కష్టాలు ఎదురైనా చెక్కుచెదరక సాగుతూ ఉంటాడు. ఇంకొందరు మాత్రం మధ్యలోనే వచ్చి మధ్యలోనే వెళ్లిపోతారు. గాడ్ ఫాదర్ లేకుండా ఎంట్రీ ఇచ్చి .. దాదాపు పాతికేళ్లుగా హీరోయిన్‌గా కొనసాగుతోంది చెన్నై చిన్నది త్రిష కృష్ణన్. ఆమె జీవితంలోనూ ఎన్నో చేదు జ్ఞాపకాలు .. అవేంటో ఒకసారి చూస్తే :

తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నేటికీ తిరుగులేని నటిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు త్రిష. ఆమె పని అయిపోందిరా అన్న దశ నుంచి ఇంకొన్నాళ్ల వరకు త్రిషకు ఢోకా లేదురా అనిపించుకుంటున్నారు. ఒకానొక దశలో ఆమె చేతిలో సినిమాలు లేక ఖాళీగా ఉన్నారు. వయసు పైబడటం, కొత్త అమ్మాయిలు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ఉండటంతో త్రిష లాంటి సీనియర్ హీరోయిన్స్ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. దీంతో త్రిష వ్యసనాలకు బానిసైందని కోలీవుడ్ టాక్.

Actress trisha krishnan sold her house to veteran actor bhanu chandar here s the details

ఓ రోజున ముంబై నుంచి ఓ నిర్మాత ఫోన్ చేసి మంచి స్క్రిప్ట్ రెడీగా ఉంది, మీరు వస్తే మిగిలిన విషయాలు మాట్లాడుకుందామని త్రిషకు చెప్పారట. దీంతో ఆగమేఘాల మీద ఆమె ముంబైకి అక్కడి నుంచి పాట్నాకు వెళ్లారట. త్రిషపై కన్నేసిన డైరెక్టర్, నిర్మాత ఆమెను బలవంతంగా అనుభవించాలని యత్నించారట. అప్పటికే పీకల్లోతు మద్యం మత్తులో ఉన్న త్రిషకు ఆ దెబ్బకు మత్తు దిగి గట్టిగా కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది వచ్చి కాపాడారట.

ఇక అవకాశాలు తగ్గుతున్న దశలో పెళ్లి చేసుకుని సెటిలైపోవాలని నిర్ణయించుకున్నారు త్రిష. ఈ క్రమంలోనే కొద్దినెలల క్రితం ఓ వ్యాపారవేత్తతో ఆమెకు ఎంగేజ్‌మెంట్ అవ్వగా.. అనూహ్య కారణాలతో నిశ్చితార్ధం రద్దయ్యింది. జీవితంలో ఎదురైన ఇబ్బందుల నుంచి తేరుకుని మళ్లీ సినిమాలపైనే ఫోకస్ పెట్టింది త్రిష. 96 మూవీతో బౌన్స్ బ్యాక్ అయ్యి.. మణిరత్నం పొన్నియన్ సెల్వన్‌తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించారు త్రిష. ప్రస్తుతం విశ్వంభర, థగ్ లైఫ్, విదాముమార్చి వంటి భారీ ప్రాజెక్ట్‌ల్లో ఆమె నటిస్తున్నారు.

Actress trisha krishnan sold her house to veteran actor bhanu chandar here s the details

ఇదిలాఉండగా.. త్రిష ఒకానొక దశలో తన ఇల్లు అమ్ముకోవడంతో ఓ సీనియర్ హీరో కొనుక్కున్నారట. ఆయనెవరో కాదు.. భానుచందర్. ఒకప్పుడు యాక్షన్ సినిమాలతో సౌత్‌ని ఒక ఊపు ఊపిన ఆయన ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నారు. కుమారుడిని హీరోగా ఇంట్రడ్యూస్ చేయగా రెండు సినిమాలు ఫట్ అయ్యాయి. ఇటీవల వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న భానుచందర్ ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ.. తాను ఉంటున్న ఇల్లు హీరోయిన్ త్రిషదని, ఆమె కెరీర్ బిగినింగ్‌లో ఈ ఇల్లు విక్రయించినట్లు భానుచందర్ తెలిపారు. అప్పుడు త్రిష తండ్రి వ్యాపారానికి పెట్టుబడి కోసం ఈ ఇల్లు అమ్మగా.. తన టేస్ట్‌కు తగినట్లుగా కొన్ని మార్పులు చేశానని ఆయన చెప్పారు. తన సతీమణికి మొక్కలంటే ప్రాణమని.. అందుకే ఇల్లంతా ఇలా పచ్చగా ఉందని భానుచందర్ తెలిపారు. ప్రస్తుతం త్రిష ఇంటి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.

More from Filmibeat

Read more about: trisha krishnan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X