కుక్క పిల్లతో త్రిష అలాంటి పని.. వర్కవుట్ వీడియో ట్రెండింగ్

ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి దాదాపు పాతికేళ్లుగా హీరోయిన్‌గా కొనసాగుతోంది త్రిష కృష్ణన్. ఎందరో హీరోయిన్లు వచ్చారు, వెళ్లారు, ఇంకా కొత్తగా వస్తూనే ఉన్నారు. కానీ త్రిష మాత్రం నేటికీ తిరుగులేని స్టార్‌గా వెలుగొందుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు త్రిష. ఆమె పని అయిపోందిరా అన్నప్పుడల్లా గట్టిగా బౌన్స్ బ్యాక్ ఇస్తున్నారు. 40 ప్లస్‌ ఏజ్‌లోనూ చెక్కు చెదరని గ్లామర్‌తో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్నారు.

ప్రశాంత్ సరసన జోడీ (తమిళ్)తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన త్రిషకు మంచి గుర్తింపు రావడంతో అవకాశాలు క్యూ కట్టాయి. నీ మనసు నాకు తెలుసు సినిమా ద్వారా తెలుగు వారిని పలకరించిన త్రిషకు వర్షం చిత్రం బ్రేక్ ఇచ్చింది. తన అందం, నటనతో కాసుల వర్షం కురిపించిన త్రిషకు తెలుగు కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, కృష్ణ, బుజ్జిగాడు వంటి వరుస బ్లాక్ బస్టర్స్‌తో సౌత్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఎదిగారు త్రిష.

actress trisha krishnan work outs with her pet dog video goes viral

హీరోయిన్‌గా కెరీర్ పీక్స్‌లో ఉన్న దశలోనే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అభిమానులకు షాకిచ్చారు త్రిష. ఓ బిజినెస్‌మెన్‌తో ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. కానీ అనూహ్య పరిణామాల మధ్య వీరి పెళ్లి ఆగిపోయింది. ఈ సమయంలో త్రిషపై భారీగా ట్రోలింగ్ జరిగింది. అయినప్పటికీ చెక్కుచెదరని ఆత్మ విశ్వాసంతో తట్టుకుని నిలబడ్డ త్రిష.. సెకండ్ ఇన్నింగ్స్‌లో స్టార్స్‌కే పోటీ ఇచ్చారు. 96, పొన్నియన్ సెల్వన్ చిత్రాలతో ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు త్రిష. దాదాపు 16 ఏళ్ల క్రితం స్టాలిన్ చిత్రంలో చిరుతో స్టెప్పులు వేసిన ఈ ముద్దుగుమ్మ తిరిగి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

కోలీవుడ్ సూపర్‌స్టార్, ఇళయ దళపతి విజయ్‌తో ఆమె ప్రేమాయణం నడుపుతున్నట్లుగా ఫిలింనగర్‌లో చర్చ జరుగుతోంది. పలుమార్లు వీరు జంటగా కనిపించడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లయ్యింది. ఇక రాజకీయాలపైనా త్రిష ఆసక్తి కనబరుస్తున్నారు. ఎప్పటికైనా సీఎం కావాలన్నది తన కల అని బాంబు పేల్చారు. విజయ్ పార్టీలో ఆమె చేరుతారంటూ కోలీవుడ్‌లో కథనాలు వస్తున్నాయి. తమిళనాడు ఎన్నికల నాటికి ఏదో ఒక నిర్ణయం వెలువడుతుందని పుకార్లు వస్తున్నాయి.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే త్రిష తన సినిమాలు, ఇతర వ్యక్తిగత వివరాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన కుక్కపిల్లతో కలిసి మార్నింగ్ వర్కవుట్ చేస్తున్న వీడియోను త్రిష షేర్ చేశారు. దీనికి మార్నింగ్ షైనింగ్స్ అనే క్యాప్షన్ కూడా పెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: trisha krishnan vishwambhara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X