For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Trisha: మరోసారి ప్రేమలో మోసపోయిన త్రిష.. విషపూరితమైన వ్యక్తిత్వం అంటూ షాకింగ్ కామెంట్

  |

  సినిమా ప్రపంచంలో స్టార్స్ కొన్నిసార్లు ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా బ్రేకప్ బ్రేకప్ చెప్పేస్తూ సోలో లైఫ్ సో బెటర్ అంటూ నీతి వాక్యాలు కూడా చెబుతూ ఉంటారు. మరి కొందరు అయితే ఒకసారి మోసపోయిన తర్వాత కూడా మరోసారి ప్రేమలో పడుతూ ఉండడం సర్వసాధారణం. ఇక సీనియర్ నటి త్రిష మరోసారి ప్రేమలో మోసపోయినట్లుగా సోషల్ మీడియాలో అనేక రకాలు కథనాలు వెలువడుతున్నాయి. అలా వార్తలు రావడానికి కారణం లేకపోలేదు. ఇటీవల ఆమె పోస్ట్ చేసిన విధానాన్ని బట్టి చూస్తే త్రిష ఏదో ఒక విషయంలో దారుణంగా మోసపోయినట్లుగా అనిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

  స్టార్స్ కు పోటీగా

  స్టార్స్ కు పోటీగా


  సౌత్ సినిమా ఇండస్ట్రీలో మంచి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న త్రిష ఎలాంటి పాత్ర చేసిన కూడా సినిమాలో చాలా హైలెట్ గా నిలిచేది. ఒకప్పుడు ఆమె కోసం కూడా అభిమానులు సినిమాకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. దాదాపు అగ్ర హీరోలు అందరితోనూ ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంది. పోటీగా ఎంతమంది వచ్చినా కూడా తనకంటూ ఒక స్టార్ హోదా ఉంది అని నిరూపించుకున్న అతి కొద్ది మంది హీరోయిన్స్ లో త్రిష ఒకరు.

  కంటెంట్ నచ్చితేనే

  కంటెంట్ నచ్చితేనే

  ప్రస్తుతం నాలుగు పదుల వయసులోకి వెళుతున్న కూడా త్రిష ఏ మాత్రం స్లో కావడం లేదు. తనకు నచ్చిన క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్తోంది. అలాగే కొన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తోంది. వీలైనంతవరకు పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే ఆమె సినిమా చేసేందుకు ఒప్పుకుంటుంది. దాదాపు కమర్షియల్ క్యారెక్టర్స్ కు ఆమె దూరమయ్యింది. కంటెంట్ చాలా కొత్తగా ఉంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లుగా అనిపిస్తోంది.

  రాజకీయాల్లో..

  రాజకీయాల్లో..

  ఇక ఇటీవల కాలంలో త్రిష కు సంబంధించిన అనేక రకాల వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆమె త్వరలోనే రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నట్లు కూడా చెన్నై మీడియాలో జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. అయితే త్రిష ఇప్పటివరకు ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో దాదాపు అది నిజమే అని కూడా అనుకుంటున్నారు. ఒక ప్రముఖ కాంగ్రెస్ నేత ఆమెను ప్రత్యేకంగా కలిసి పార్టీలో చేరేందుకు చర్చలు కూడా జరిగినట్లుగా తెలుస్తోంది.

   మరోసారి ప్రేమలో ఫెయిల్

  మరోసారి ప్రేమలో ఫెయిల్

  ఇక రాజకీయాలకు సంబంధించిన వార్తలు వినిపిస్తున్న సమయంలో త్రిష ఊహించిన విధంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారిపోయింది. చాలా రోజుల తర్వాత ఆమె చాలా కోపంగా స్పందించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే త్రిష మరోసారి ప్రేమలో ఫెయిల్ అయ్యిందా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి గతంలో ఒక నిర్మాతతో నిశ్చితార్థం చేసున్నాక పెళ్లి.. క్యాన్సిల్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. అలాగే టాలీవుడ్ యువ హీరోతో కూడా ఆమె ప్రేమలో ఉన్నట్లు అప్పట్లో టాక్ వచ్చింది.

  షాకింగ్ పోస్ట్

  షాకింగ్ పోస్ట్


  ఇక ఇప్పుడు మరోసారి త్రిష పోస్ట్ చేయడంతో మళ్ళీ ప్రేమలో ఫెయిల్ అయ్యిందానే కామెంట్స్ వస్తున్నాయి. ఇంతకి త్రిష ఏమని పోస్ట్ చేసింది అంటే.. విషపూరితమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు వాళ్ళంతట వాళ్లే మనతో మాట్లాడడం మానేస్తే దానికంటే మరొక మంచి విషయం ఉండదు అని.. అది చాలా సంతోషకరమైన విషయం అంటూ.. వీటిని గమనిస్తే ఒక చెత్త దానంతట అదే శుభ్రమైనట్లుగా ఉంది అని ఆమె తెలియజేసింది. దీంతో ఆమె ప్రేమలో మళ్లీ ఫెయిల్ అయ్యిందా అనే విధంగా నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

  English summary
  actress trisha shocking post viral and breakup news viral
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X