For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    సినిమాలు లేకున్నా ఆదాయం పెరిగింది: ఆర్జీవీ హీరోయిన్‌కు కోట్లలో ఆస్తులు, వివరాలు ఇవే!

    |

    రామ్ గోపాల్ వర్మ సినిమాల ద్వారా బాగా పాపులర్ అయిన వారిలో హీరోయిన్ ఊర్మిలా మండోద్కర్ ఒకరు. వర్మ దర్శకత్వంలో వచ్చిన 'రంగీలా' ఆమె కెరీర్‌ దశ తిరిగేలా చేసింది. కేవలం వర్మ దర్శకత్వంలోనే ఆమె 13 సినిమాలు చేయడంతో... ఆర్జీవీ హీరోయిన్‌గా ఆమెపై ముద్ర పడింది.

    వయసు పైబడటంతో అందరి హీరోయిన్ల మాదిరిగానే ఊర్మిళా కూడా సినిమాలకు దూరమైంది. అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో అతిథి పాత్రలో మెరవడమే తప్ప ఈ మధ్య బొత్తిగా కనిపించడమే మానేసింది. సినిమా కెరీర్ ముసిగిన తర్వాత యాక్టర్లు రాజకీయాల బాట పట్టడం పరిపాటి. ఊర్మిళా కూడా అదే పని చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ముంబై నార్త్ నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్నారు.

    ఆస్తుల వివరాలు ప్రకటించిన ఊర్మిళా

    ఆస్తుల వివరాలు ప్రకటించిన ఊర్మిళా

    ఎన్నికల సమయంలో పోటీ చేసే అభ్యర్థులు ఆస్తుల వివరాలు వెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఊర్మిళా మండోద్కర్ తన ఆస్తుల వివరాలు వెల్లడించింది. తనకు రూ. 68.2 కోట్ల విలువగల ఆస్తులు ఉన్నాయని, ఎలాంటి కేసులు లేకుండా క్లీన్ ఇమేజ్ ఉందని తెలిపింది.

    అప్పటితో పోలిస్తే ఇపుడు ఆదాయం పెరిగింది

    అప్పటితో పోలిస్తే ఇపుడు ఆదాయం పెరిగింది

    ఆమె ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నా వివరాలు ప్రకారం... ఆమె ఆదాయం 2013-14లో రూ. 1.27 కోట్లు ఉంటే... 2017-18లో ఆదాయం రూ. 2.85 కోట్లకు చేరి రెట్టింపు అయింది. 2014 తర్వాత సినిమాలకు దూరమైన ఆమె 2018లో ‘బ్లాక్ మెయిల్' అనే చిత్రంలో స్పెషల్ సాంగ్ మాత్రమే చేయడం గమనార్హం.

    ఊర్మిళా ఆస్తులు, అప్పులు ఇవే..

    ఊర్మిళా ఆస్తులు, అప్పులు ఇవే..

    తనకు మొత్తం చరాస్తులు రూ. 40.93 కోట్లు, స్థిరాస్తులు రూ. 27.34 కోట్లు కలిగిన ఉన్నట్లు వెల్లడించారు. దీంతో పాటు రూ. రూ. 32 లక్షల అప్పు కూడా ఉన్నట్లు ఊర్మిళా మండోద్కర్ తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. బ్యాంక్ డిపాజిట్స్, నగదు, వాహనాలు, పెట్టుబడులు, ప్రాపర్టీలు అన్నీ కలిపి ఇంత మొత్తం ఉన్నట్లు తెలిపారు.

    భర్త ఆస్తుల వివరాలు

    భర్త ఆస్తుల వివరాలు

    తన భర్త ఎం.ఎ మీర్ మొత్తం రూ. 62.35 లక్షల ఆస్తులు కలిగి ఉన్నాడని... అందులో చరాస్థులు రూ. 32,35,752.53, స్థిరాస్తులు రూ. 30,00,000 ఉ న్నట్లు పేర్కొన్నారు. ముంబై నార్త్ నియోజకవర్గానికి 4వ దశలో ఏప్రిల్ 29న పోలింగ్ జరుగనుంది.

    English summary
    Bollywood actress and Congress candidate from Mumbai North Urmila Matondkar has declared assets worth around Rs 68.28 crore and a clean legal record.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more