అత్యాశ పడ్డ బాలయ్య హీరోయిన్.. చుక్కులు చూస్తోందిగా

బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా దక్షిణాది ప్రేక్షకుల్లోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంది. స్పెషల్ డాన్సులతో అలరిస్తూ వస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఐటెం సాంగ్ ల తో ఈ ముద్దుగుమ్మ దుమ్ము లేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ లో రూపుదిద్దుకున్న క్రేజీ ప్రాజెక్టుల్లో ఐటం నెంబర్స్ లో మెరిసి, అగ్ర హీరోల సరసన మాస్ స్టెప్పులు వేసి యువతను ఉర్రూతలూగించింది. అటు బాలీవుడ్ లోనూ నటిగా అవకాశాలు అనుకుంటూనే ఉంది. ఇటు టాలీవుడ్ లోనూ సర్ప్రైజింగ్ గా మెరుస్తోంది.

అయితే ఇటీవల ఊర్వశీ రౌటేలా ఎక్కువగా తన కామెంట్ల వల్ల వార్తల్లో నిలుస్తుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈ బ్యూటీ పలు కాంట్రవర్సీలకు కారణమవుతోంది. రీసెంట్ గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్, మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా పై షాకింగ్ పోస్ట్ కూడా పెట్టి వార్తలకు ఆస్కారమైంది. హిందీలో వచ్చిన తన స్పెషల్ సాంగ్ సారీ బోల్.. తమన్నా భాటియా నటించిన స్పెషల్ సాంగ్ నషా కంటే అద్భుతంగా ఉందంటూ తానే పోస్ట్ చేయడం కొంత కాంట్రవర్సీకి దారి తీసింది.

Actress Urvashi Rautela Shocking Comments about her recent incident

ఇక తాజాగా ఊర్వశీ రౌటేలా గురించి మరో వార్త వెలుగులోకి వచ్చింది. రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ చేసిన కామెంట్లే అందుకు కారణమని తెలుస్తుంది. అయితే ఊర్వశీ రౌటేలా మాట్లాడుతూ.. నార్త్ లోని ఉత్తరాఖండ్లో గల బద్రీనాథ్ టెంపుల్ కు సమీపంలో తనకు ఒక గుడిని డెడికేట్ చేశారని, అక్కడ ప్రజలు నిత్యం పూజలు చేస్తూ కోరికలు కోరుకుంటారని చెప్పుకోచ్చారు. ఇక అలాంటి గుడినే సౌత్ లోనూ ఒకటి ఉంటే బాగుండు అని మాట్లాడింది. తన అభిమానులు కట్టాలని పరోక్షంగా తెలిపింది. ఇక ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఊర్వశీ రౌటేలాను సౌత్ లో భావించేవారు ఎవరూ లేరు అంటూ నెటిజెన్లు మండిపడ్డారు. ఆమె మాటలకు పలు రకాల కామెంట్లతో చుక్కలు చూపించారు. అయితే ఆ విమర్శలను ఊర్వశీ రౌటేలా తీసుకోలేక పోయిందంట. ఒక దశలో తనకు మెంటల్ ఎక్కిందని చెప్పినట్టు బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇక ఇలా తన మాటలతో ఊర్వశీ రౌటేలా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక అభిమానులు టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు అయిన సమంత రూత్ ప్రభు, లేడీ సూపర్ స్టార్ నయన తారలకు గుడులు కట్టించిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా ఇంటర్నెట్ లో వైరల్ అవుతూనే ఉంటాయి.

ఇక ఊర్వశీ రౌటేలా చివరిగా నందమూరి నట సింహం, టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ సరసన 'డాకూ మహారాజ్' చిత్రంలో నటించింది. మరోవైపు 'దబిడి దిబిడి' అనే ఐటెమ్ సాంగ్ తోనూ అలరించింది. ఆ పాట కూడా ఊర్వశీ రౌటేలాకు నెగెటివ్ రెస్పాన్స్ ను తెచ్చిపెట్టింది. ఇక అంతకు ముందు ఊర్వశీ మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' చిత్రంలో బాస్ పార్టీ అనే పాటలో నటించి ఆకట్టుకుంది. ఏజెంట్, స్కంద వంటి చిత్రాల్లోనూ స్పెషల్ సాంగ్స్ తో దుమ్ములేపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X