ప్రాణాపాయ స్థితిలో సీనియర్ నటి.. సాయం చేయాలంటూ బిగ్‌బాస్ ఫైర్ బ్రాండ్ పోస్టు..
టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సహాయ నటి వాహిని (Vahini) అలియాస్ పద్మక్క. టెలివిజన్ ప్రేక్షకులకు 'జయ వాహిని' అనే పేరుతో బాగా పరిచయం. చిన్న పాత్రలతో ప్రారంభమైన ఆమె ప్రయాణం, కాలక్రమేణా అనేక తెలుగు,తమిళ సినిమాలు, జెమినీ, ఈటీవీ వంటి ప్రముఖ ఛానెల్స్‌లో ప్రసారమైన సీరియల్స్ ద్వారా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. సౌందర్య నటించిన 'శ్వేత నాగు' చిత్రంలోని వాసుకి పాత్రతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది వాహిని. ఇటీవల 'బహిర్భూమి' సినిమాలో కూడా నటించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్ కరాటే కల్యాణి ఓ పోస్ట్ పెట్టారు.
నటి వాహిని కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. వాస్తవానికి ఈ నటి ప్రస్తుతం రొమ్ము క్యాన్సర్‌తో పోరాటం చేస్తుంది. గత కొన్ని నెలలుగా చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం ఇటీవల అకస్మాత్తుగా క్షీణించింది. డాక్టర్ల ప్రకారం.. క్యాన్సర్ తీవ్ర స్థాయికి చేరడంతో మల్టీ-ఆర్గాన్ ఫెయిల్యూర్లక్షణాలు కనిపించాయి. దీంతో వాహినిని అత్యవసరంగా హైదరాబాదులోని ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యవసరంగా వైద్య అందిస్తున్నారు. దీంతో వాహిని కుటుంబంపై తీవ్ర ఆర్థిక భారం పెరిగిపోయింది.

కీమోథెరపీ, శస్త్రచికిత్సలు,ల్యాబ్ పరీక్షలు, ఐసీయూ కేర్ కోసం రూ. 25 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నటి కరాటే కల్యాణి సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. కల్యాణి తెలిపిన వివరాల ప్రకారం.. నటి వాహిని ఒకప్పుడు వారి ఇంటి పక్కనే ఉండేవారని, చిన్ననాటి నుంచి పరిచయం ఉన్న వ్యక్తి. ఆమెనుఈ పరిస్థితిలో చూడటం తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. 'తెరపై మనల్ని నవ్వించిన, కన్నీళ్లు పెట్టించిన మా వాహిని అక్క ఇప్పుడు జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. ఒక ప్రాణాన్ని కాపాడేందుకు మనందరం కలిసిరావాలి'అంటూ ఆమె సహాయం కోరింది.
అంతేకాకుండా.. కరాటే కల్యాణి వాహినికి సంబంధించిన UPI నంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు షేర్ చేస్తూ.. మీ చిన్న సహాయం అయినా .. ఈ సమయంలో ప్రాణదానం లాంటిదేనని పేర్కొన్నారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలో పలువురు ఆర్థిక సహాయం చేస్తూ.. స్కీన్ షాట్స్ షేర్ చేస్తున్నారు. సినీ పరిశ్రమ ప్రముఖులు, అభిమానులు కూడా స్పందిస్తూ వాహిని త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
ఒకప్పుడు బుల్లితెరపై తన నటనతో అందరినీ అలరించిన ఈ నటి, ఇప్పుడు మళ్లీ ఆరోగ్యంగా తిరిగి రావాలని వేలాది మంది కోరుకుంటున్నారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతుండగా, ఆశించిన సహాయం అందితే వాహిని చికిత్స మరింత వేగవంతం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఒక కళాకారిణి ప్రాణం కాపాడానికి పెద్ద ఎత్తున్న సినీ అభిమానులు ముందుకు వస్తున్నారు.
https://www.facebook.com/share/p/1AMjnUGJwZ/


Click it and Unblock the Notifications











