Baby హీరోయిన్ వైష్ణవీ చైతన్య ఎమోషనల్ స్పీచ్.. ప్రపంచాన్ని జయించినంత ఆనందం అంటూ
యువ హీరోలు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం బేబీ. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ ఈ సినిమాను నిర్మించారు. ప్రేమ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. విజయ్ బుల్గానిన్ అందించిన పాటలుపాటలు సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి.జూలై 14న రిలీజ్ అయిన ఈ సినిమా సంచలన విజయం వైపు దూసుకెళ్తున్నది. ఈ సినిమా కల్ట్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో హీరోయిన్ వైష్ణవీ చైతన్య మాట్లాడుతూ...


సినిమా రంగంలో రాణించాలంటే ప్రతీ ఒక్కరు ట్రై చెయాలి. సాయి రాజేష్, ఎస్కేఎన్ మాదిరిగా నాకు దొరికినట్టు ఎవరైతే ట్రై చేస్తారో వారికి ఇలాంటి వాళ్లు దొరుకుతారు. మా లాంటి కొత్త ముఖాలపై ఇన్ని పైసలు ఖర్చు పెట్టి సినిమా తీసినందుకు ధ్యనవాదాలు. ఈ సినిమాకు రియల్ హీరోలు అంటే విజయ్ బుల్గానియన్, బాల్ రెడ్డి, సురేష్, కల్యాణ్ చక్రవర్తి, అనంత్ శ్రీరామ్. ఇంత పెద్ద హిట్టు వెనుక మీరున్నారు. మీకు నేను థ్యాంక్స్ చెబుతున్నాను అని వైష్ణవీ చైతన్య తెలిపింది.

బేబీ సినిమా చూసి వచ్చి బాగుందని మారుతి గారు, బన్నీ వాసు గారు చెబుతుంటే నమ్మలేకపోయాం. ఫస్ట్ డేన థియేటర్‌లో సినిమా చూస్తుంటే.. డైలాగ్స్‌కు ప్రేక్షకుల అరుస్తూ, చప్పట్లు కొడుతుంటే.. ప్రపంచాన్ని చూసినట్టు అనిపించింది. అంత పెద్ద స్క్రీన్ పై నన్ను చూసుకొన్న తర్వాత.. ఇన్ని రోజుల నుంచి ఎదురు చూసింది.. ఈ రోజు కోసం కదా అనిపించింది.

జూలై 14 అంటే నా జీవితంలో ఎప్పుడూ గుర్తుండిపోయే రోజు. ఈ ఫంక్షన్‌కు మమ్మీ, డాడీ వచ్చారు. చిన్నప్పటి నుంచి నేను ఏది చేసినా వారు సపోర్టు చేశారు. వారు సపోర్ట్ చేసినందుకే నేను ఇక్కడ ఉన్నాను. మీరంత సపోర్ట్ చేసినందుకే నేను ఇక్కడ ఉన్నాను. అందరికీ థ్యాంక్స్. ఈ రోజు గుర్తు పెట్టుకోండి. మీరు ఫ్యూచర్‌లో ఇంకా ఆనందంగా ఉండే రోజులు వస్తున్నాయి. మిమ్మల్ని ఇంకా సంతోషంలో ఉంచేందుకు ప్రయత్నిస్తా అని వైష్ణవీ చైతన్య చెప్పింి.


Click it and Unblock the Notifications











