రమ్యకృష్ణతో గొడవకు కారణం అదే.. అలా అవమానిస్తే ఊరుకోవాలా? వనితా విజయ్ కుమార్

కోలీవుడ్ దిగ్గజ నటుడు విజయ్ కుమార్ , దివంగత మంజుల కుమార్తె వనితా విజయ్ కుమార్ ఎప్పుడూ వివాదాల్లో వార్తల్లో ఉంటారు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఆమె.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఏ విషయాన్నైనా సరే ఎలాంటి డొంక తిరుగుడు లేకుండా చెప్పడం ఆమెకు అలవాటు. ఇది అందరికీ ఇష్టం ఉండదు కదా.. అందుకే వనితపై వారు విరుచుకుపడుతూ ఉంటారు. తండ్రి విజయ్ కుమార్‌తో తగాదాల కారణంగా.. ఆమెను కుటుంబ సభ్యులు ఇంటి నుంచి గెంటేశారు. ఇటీవల ఇంట్లో జరిగిన శుభకార్యానికి సైతం వనితను పిలవలేదంటే ఆమెపై వారికి ఏ స్థాయిలో కోపంగా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు.

తల్లిదండ్రులిద్దరూ అగ్ర నటులు కావడంతో వనితా విజయ్ కుమార్‌ చాలా సులభంగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. చంద్రలేఖ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె .. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవి సినిమాతో తెలుగువారిని పలకరించారు. ఈ చిత్రం ఘన విజయం కావడంతో ఆమెకు అవకాశాలు పోటెత్తాయి. కానీ అనూహ్యంగా పెళ్లి చేసుకుని సినిమాలకు గ్యాప్ ఇచ్చారు వనితా విజయ్ కుమార్. 2013లో తిరిగి రీ ఇంట్రీ ఇచ్చిన ఆమెకు తర్వాత అంతగా అవకాశాలు రాలేదు. మళ్లీ పదేళ్లకు గాని అదృష్టం ఆమె ఇంటి తలుపు తట్టలేదు. గతేడాది నుంచి వనితా విజయ్ కుమార్ తిరిగి బిజీ అయ్యారు. అయితే సినిమాల్లో ఛాన్సులు లేకపోయినా బుల్లితెరపై మాత్రం సందడి చేసేవారు.

actress Vanitha Vijay kumar About Dispute With Ramya Krishnan here s the details

వనితా విజయ్ కుమార్ వైవాహిక జీవితం నుంచి తొలి నుంచి ఒడిదొడుకులు ఎదుర్కొంటూ వివాదాస్పదంగా మారింది. తొలుత నటుడు ఆకాష్‌ను ఆమె వివాహం చేసుకోగా.. వీరికి విజయ్ శ్రీ హరి, జోవిక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆకాష్‌తో విడిపోయాక వ్యాపారవేత్త ఆనంద్ జే రాజన్‌ను పెళ్లాడారు వనిత. వీరికి జయనిత అనే పాప జన్మించింది. కానీ ఈ పెళ్లి కూడా ఎక్కువ రోజులు సాగలేదు. రాజన్‌తో విడాకులు తీసుకున్నాక చాలా ఏళ్లు ఒంటరిగానే బతికింది వనిత. ఈ క్రమంలో 2020లో కోవిడ్ సమయంలో పీటర్ అనే వ్యక్తిని పెళ్లాడింది. అయితే ఇద్దరి మధ్యా మనస్పర్ధలు, పీటర్ మొదటి భార్యకు విడాకులు ఇవ్వకపోవడంతో అతని నుంచి కూడా వనితా విజయ్ కుమార్ విడిపోయారు. మద్యానికి బానిస అయిన పీటర్.. గతేడాది గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.

ఇటీవలి కాలంలో వరుసగా ఇంటర్వ్యూలూ ఇస్తున్న వనితా విజయ్ కుమార్ ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ.. తన వైవాహిక జీవితం, కుటుంబ సమస్యలు, కెరీర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. బిగ్‌బాస్ జోడిగల్ అనే రియాలిటీ షో నుంచి ఆమె అర్ధాంతరంగా తప్పుకోవడం అప్పట్లో దుమారం రేపింది. దీనిపై వనితా విజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నటి రమ్యకృష్ణ వల్లే తాను షోకు దూరమయ్యానని చెప్పింది. ఓ రోజున అమ్మవారి వేషంలో వనిత డ్యాన్స్ చేశారు. దీనికి జడ్జిగా వ్యవహరించిన రమ్యకృష్ణ మాట్లాడుతూ.. మేకప్ బాగుంది కానీ , డ్యాన్స్‌ సరిగా కంపోజ్ చేయలేదన్నట్లుగా కామెంట్ చేసింది.

actress Vanitha Vijay kumar About Dispute With Ramya Krishnan here s the details

దీంతో వనిత స్టేజ్‌పైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్జ్‌మెంట్ ఇవ్వకుండా మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని చెబుతున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇతర కంటెస్టెంట్స్‌తో తన డ్యాన్స్‌ను పోల్చడం ఏంటంటూ ఫైర్ అయ్యింది. ఇదే సమయంలో పక్కనే ఉన్న మరో జడ్జి కూడా రమ్యకృష్ణకు మద్ధతుగా నిలవడంతో వనిత కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ వనిత తిరిగి ఆ షోలో పాల్గొన్నారు. తనకు రమ్య చిన్నప్పటి నుంచి తెలుసునని, ఆమె అద్భుతమైన నటి అని వనితా విజయ్ కుమార్ ప్రశంసించారు. రమ్యకృష్ణతో ఎలాంటి గొడవ పడలేదని.. కేవలం ఆమె జడ్జిమెంట్ చెప్పిన విధానాన్ని తాను తప్పుబట్టినట్లు ఆమె వెల్లడించారు. ప్రస్తుతం వనిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X