బీచ్‌లో రెచ్చిపోయిన వరలక్ష్మి: తొలిసారి ఓవర్‌గా అందాల ఆరబోస్తూ వీడియో
సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి ఎంతో మంది నటీనటులు యాక్టింగ్ కెరీర్‌ను మొదలుపెట్టారు. కానీ, అందులో అతి తక్కువ మంది మాత్రమే ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. అందులో కోలీవుడ్ బ్యూటీ వరలక్ష్మి శరత్‌కుమార్ ఒకరు.
అదిరిపోయే అందంతో పాటు విలక్షణమైన నటనతో సౌతిండియాలోనే ప్రత్యేకమైన ఇమేజ్‌ను దక్కించుకున్న ఆమె.. వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక, తాజాగా సోషల్ మీడియాలో వరలక్ష్మి శరత్‌కుమార్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. దానిపై మీరు కూడా లుక్కేయండి!

అలా ఎంట్రీ.. సౌత్‌లో స్టార్: సీనియర్ స్టార్ హీరో శరత్ కుమార్ కూతురుగా వరలక్ష్మీ ప్రపంచానికి సుపరిచితురాలు అయింది. అలాగే, 'పోడా పొడి' అనే సినిమాతో ఆమె హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత కన్నడంలో సహా ఎన్నో భాషల్లో నటించి ఫేమస్ అయిపోయింది. దీనికితోడు హీరో విశాల్‌తో ప్రేమాయణం సాగించడం.. తర్వాత బ్రేకప్ చెప్పడంతో సౌతిండియా మొత్తం ఆమె పేరు హైలైట్ అయింది.

ఆ రోల్స్ హైలైట్.. విలన్‌గా: వరలక్ష్మీ శరత్ కుమార్ విలక్షణ నటనతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుంది. అన్ని భాషల్లోనూ అదే తరహా నటనతో ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా 'విక్రమ్ వేదా', 'విష్మయ', 'మానిక్యా', 'కసాబా' వంటి చిత్రాల్లో రెచ్చిపోయి నటించింది. ఇక, 'పందెం కోడి 2', 'సర్కార్' వంటి చిత్రాల్లో లేడీ విలన్‌గానూ కనిపించి తనలోని మరో యాంగిల్‌తో మెప్పించింది.

తెలుగులోనూ.. హిట్లతోనే: వరలక్ష్మీ శరత్ కుమార్.. సందీప్ కిషన్ 'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్' సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ఎంటరైంది. దీని తర్వాత రవితేజ చిత్రం 'క్రాక్'లో ఆమె పోషించిన జయమ్మ అనే పాత్రతో రచ్చ చేసింది. ఈ రోల్‌లో భయపెట్టిన ఆమె.. ప్రశంసలు దక్కించుకుంది. ఆ తర్వాత ఈ అమ్మడు తెలుగులో 'నాంది', 'యశోద' వంటి చిత్రాల్లో నటించి హిట్లను సాధించింది.

ఇప్పుడీ సినిమాలతో బిజీ: గత సంక్రాంతికి వరలక్ష్మీ శరత్ కుమార్ 'వీర సింహా రెడ్డి' అనే సినిమాతో వచ్చింది. ఇందులో బాలయ్య చెల్లిగా నటించిన ఈమె తనదైన నటనతో మరోసారి ఆకట్టుకుంది. ఇక, ఇప్పుడు ఆమె తెలుగులో 'హను మాన్', 'శబరి' వంటి చిత్రాలు చేస్తోంది. అలాగే, 'పంబన్', 'కలర్స్', 'లగామ్', 'పిరంతల్ పరాశక్తి' వంటి సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది.

అందులో యమా యాక్టివ్: సౌత్ ఇండియాలోని భాషల్లో వరుస సినిమాలతో సత్తా చాటుతోన్న వరలక్ష్మి శరత్ కుమార్.. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగా తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటూనే ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ అలరిస్తోంది. తద్వారా ఫాలోవర్లకు ఖుషీని పంచుతూ ముందుకు సాగుతోంది.
గ్లామర్ షో కూడా చేస్తోంది: సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తోన్న వరలక్ష్మి శరత్‌కుమార్.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను కూడా బాగానే షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా తన అందాలన్నీ చూపిస్తూ తీసుకున్న ఘాటు ఫొటోలను ఎక్కువగా వదులుతోంది. దీంతో ఈమె క్రేజ్ అంతకంతకూ పెరిగిపోతోంది. తద్వారా తరచూ వార్తల్లోనే నిలుస్తూ ట్రెండ్ అవుతోంది.
వరలక్ష్మి వీడియో వైరల్: వరలక్ష్మి శరత్‌కుమార్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు ఉల్లిపొరలాంటి డ్రెస్ వేసుకుని విపరీతంగా హాట్ షో చేస్తూ కనిపించింది. ఫలితంగా ఆమె అందాలు కుర్రకారును రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా వరలక్ష్మి వదిలిన వీడియో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











