పెళ్లికి ముందే అలా ఎంజాయ్ చేసిన వరలక్ష్మి.. బోట్‌లోనే అతడితో కలిసి నాటీగా!
చిత్ర సీమలోకి ఎంతో మంది స్టార్ల వారసులు పరిచయం అవుతున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే వైవిధ్యాన్ని చూపిస్తూ స్టార్లుగా హవాను కనబరుస్తున్నారు. అలాంటి వారిలో ప్రముఖ నటుడు శరత్‌కుమార్ కూతురు వరలక్ష్మి ఒకరు. అందానికి అందం, నటనకు నటనతో మాయ చేస్తోన్న ఈ చిన్నది.. వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటోంది. తద్వారా కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తోంది. అదే సమయంలో వరలక్ష్మి ఇటీవలే ఎంగేజ్‌మెంట్ చేసుకుని పెళ్లికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఓ క్యూట్ పిక్‌ను షేర్ చేసింది. దాన్ని మీరే చూడండి!
సౌతిండియాలో ఫేమస్
సౌత్ ఇండియన్ హీరో శరత్ కుమార్ కూతురుగా వరలక్ష్మీ చిన్న వయసులోనే ప్రపంచానికి పరిచయం అయింది. ఈ క్రమంలోనే 'పోడా పొడి' అనే సినిమాతో ఆమె హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత కన్నడంలో సహా ఎన్నో భాషల్లో నటించి పేరు తెచ్చుకుంది. దీనికితోడు హీరో విశాల్‌తో డేటింగ్ చేసి, బ్రేకప్ చెప్పడంతో దక్షిణాది రాష్ట్రాల్లో యమా ఫేమస్ అయిందని చెప్పొచ్చు.

విలన్‌గానూ సెన్సేషన్
విలక్షణమైన నటనతో వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రేక్షకులను ఫిదా చేసేసింది. అన్ని భాషల్లోనూ అదే తరహా నటనతో ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా 'విక్రమ్ వేదా', 'విష్మయ', 'మానిక్యా', 'కసాబా' వంటి చిత్రాల్లో వైవిధ్యమైన నటనతో ఆశ్చర్యపరిచింది. ఇక, 'పందెం కోడి 2', 'సర్కార్' వంటి చిత్రాల్లో లేడీ విలన్‌గానూ కనిపించి సౌత్‌లో సెన్సేషన్ అయిపోయింది.
తెలుగులో ఫుల్ హిట్స్
'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్' సినిమా ద్వారా వరలక్ష్మీ శరత్ కుమార్ టాలీవుడ్‌లోకి ఎంటరైంది. దీని తర్వాత 'క్రాక్'లో ఆమె పోషించిన జయమ్మ అనే పాత్రతో భయపెట్టింది. అనంతరం ఈ అమ్మడు తెలుగులో 'నాంది', 'యశోద' వంటి చిత్రాల్లో నటించి సక్సెస్‌లు అందుకుంది. ఈ క్రమంలోనే 'వీర సింహా రెడ్డి', 'హనుమాన్'తో భారీ హిట్లను ఖాతాలో వేసుకుంది.

బిజీగా ఉన్నా.. జంటగా
వరుస చిత్రాలతో సందడి చేస్తోన్న వరలక్ష్మి ఇప్పుడు తెలుగులో 'శబరి' అనే సినిమాను చేస్తోంది. అలాగే, మలయాళంలో 'కలర్స్', తమిళంలో 'రాయన్' వంటి చిత్రాలతో బిజీగా గడుపుతోంది. ఇలా కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న సమయంలోనే వరలక్ష్మి కొద్ది రోజుల క్రితమే నికోలయ్ సచ్‌దేవ్ అనే ఆర్ట్ గ్యాలరీ ఓనర్‌తో నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి రెడీ అయిపోయింది.
అందులో ఫుల్ యాక్టివ్
దక్షిణాదిలోని దాదాపు అన్ని భాషల్లో వరుస సినిమాలతో సత్తా చాటుతోన్న వరలక్ష్మి శరత్ కుమార్.. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగా తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటూనే ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ అలరిస్తోంది. తద్వారా ఫాలోవర్లను ఆకట్టుకుంటోంది.

కాబోయే వాడితో టూర్
చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న వరలక్ష్మి శరత్‌కుమార్.. ఇప్పుడు పర్సనల్ లైఫ్‌ను కూడా విపరీతంగా ఎంజాయ్ చేస్తోంది. ముఖ్యంగా నిశ్చితార్థం అయిన తర్వాత నికోలయ్ సచ్‌దేవ్ కలిసి రచ్చ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలే వరలక్ష్మి తనకు కాబోయే వాడితో కలిసి ఓ టూర్‌కు వెళ్లింది. అక్కడ తీసుకున్న ఫొటోలు, వీడియోలను షేర్ చేసేసింది.
వరలక్ష్మి పిక్ వైరల్‌గా
తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో వరలక్ష్మి శరత్‌కుమార్ ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు బోట్‌లో తనకు కాబోయే భర్త నికోలయ్ సచ్‌దేవ్‌తో కలిసి ఎంజాయ్ చేస్తూ కనిపించింది. అంతేకాదు, ఇందులో ఇద్దరూ ఎంతో క్లోజ్ పెనవేసుకుని ఉన్నారు. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఇది వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











