విడాకులకు కారణమిదే.. యంగ్ హీరోయిన్ షాకింగ్ పోస్ట్.. నెటిజన్ల మైండ్ బ్లాక్!
ప్రజెంట్ ఏ నలుగురు కలిసినా సెలబ్రెటీల విడాకుల మ్యాటర్ గురించే చర్చించుకుంటున్నారు. నటాషా - హార్డిక్ పాండ్యాలు విడాకులు తీసుకోవడం క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశమైతే.. ఐశ్వర్యరాయ్ - అభిషేక్ బచ్చన్ అయితే ఇప్పటికే విడాకులు తీసుకున్నారని, సెపరేట్ అయిపోయారంటూ వార్తలు వస్తున్నాయి. కానీ వాటిని ధ్రువీకరించేలా ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడం లేదు. కానీ చిన్న బచ్చన్ - ఐష్‌ల వైవాహిక బంధం, వారు దూరంగా ఉండటంపై రకరకాల గాసిప్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
స్టార్ సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు ఇప్పుడు చిన్న చిన్న కారణాలకే విడిపోవడం కామన్ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా ఖాతాలో భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం.. లేదంటే ఒకరి ఫోటోలను మరొకరు డిలీట్ చేయడం వంటి చర్యలతో విడాకులపై హింట్ ఇస్తున్నారు. అక్కినేని నాగచైతన్య - సమంత, నిహారిక - చైతన్యల విషయంలో ఇలాగే జరిగింది. ఈ క్రమంలోనే స్టార్ కపుల్స్ సోషల్ మీడియాలో ఎలాంటి షాకింగ్ న్యూస్ చెబుతారోనని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వైవాహిక బంధానికి వీడ్కోలు పలకడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. మానసికంగా సంఘర్షణ, ఎంతో ఆలోచించిన తర్వాతే ఆడదైనా, మగాడైనా విడాకులకు సిద్ధపడతాడు. ఎవరి వ్యక్తిగత కారణాలు వారివైనా .. పిల్లలు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గితే బాగుండు కదా అని కొందరు అంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో విడాకులు , సమాజంపై దాని పరిణామాలపై యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
కన్నడ కస్తూరి అయిన వర్ష బొల్లమ్మ.. చూసీ చూడంగానే సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చింది. జాను, మిడిల్ క్లాస్ మెలోడీస్, పుష్పక విమానం, స్టాండప్ రాహుల్, స్వాతిముత్యం, ఊరు పేరు భైరవ కోన తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న సైకో పాత్రలో నటించడం తన డ్రీమ్ అని.. నెంబర్ గేమ్‌ను తాను పెద్దగా పట్టించుకోనని వర్ష బొల్లమ్మ తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ తన ఫేవరేట్ హీరో అని ఆర్ఆర్ఆర్‌లోని కొమురం భీముడో పాటలో ఆయన నటన ఎంతో నచ్చిందని ఆమె పలుమార్లు చెప్పారు. వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న వర్ష బొల్లమ్మ.. దక్షిణాదిలో మోస్ట్ వాంటెడ్‌గా మారారు. ప్రస్తుతం ఆమె సినిమాకు రూ. కోటి వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా ఫిలింనగర్ టాక్.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే వర్ష బొల్లమ్మ.. తన వ్యక్తిగత వివరాలు, సినిమా సంగతులను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే యాక్టివిస్ట్ దీపిక నారాయణ్ భరద్వాజ్ ప్రజంట్ విడాకులకు కారణం ఏంటీ అంటూ ప్రశ్నించగా.. నెటిజన్లు రకరకాలుగా ఆన్సర్స్ ఇచ్చారు. అయితే వర్ష మాత్రం పెళ్లే దీనంతటికి కారణమని షాకింగ్ రిప్లయ్ ఇచ్చింది. దీంతో ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన వారు పెళ్లిపై వర్ష బొల్లమ్మకు అలాంటి ఒపీనియన్ ఉందా , ఈ అమ్మడి వరస చూస్తే పెళ్లి చేసుకునేలా కనిపించడం లేదంటూ కామెంట్లు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











