42 ఏళ్ల వయసులో ప్రియుడితో విమలారామన్ జల్సా.. బీచ్‌లో రొమాంటిక్‌గా గ్లామర్ ట్రీట్

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ ఏజ్‌లో జరిగితేనే జీవితం బాగుంటుందని పెద్దలు అంటూ ఉంటారు. కాల మాన పరిస్ధితుల్లో మార్పులతో , ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మంది పెళ్లి అనే విషయాన్ని పక్కనపెట్టేస్తున్నారు. ముందు లైఫ్‌లో సెటిలవ్వాలి.. పక్కవాడి కంటే నాలుగు రాళ్లు ఎక్కువ సంపాదించాలి, ఆ తర్వాతే ఏమైనా. గతంలో అమ్మాయిలు, అబ్బాయిలకు 20-25 ఏళ్ల లోపే పెళ్లిళ్లు చేసేసేవారు పెద్దలు. నేడు చదువులు పూర్తయి, ఉద్యోగానికి అవసరమైన స్కిల్స్ సంపాదించి, ఆ జాబ్‌లో నిలదొక్కుకునేసరికి పెళ్లి అనే మాటకు చోటివ్వడం లేదు యువతరం. సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా 40 ప్లస్‌‌లోనూ పెళ్లి మాట ఎత్తడం లేదు. టాలీవుడ్ టూ బాలీవుడ్ ఎందరో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ కనిపిస్తారు.

ఇదిలాఉండగా.. చూడగానే పక్కింటి అమ్మాయిలా కనిపించే చెన్నై చిన్నది విమలా రామన్ గుర్తున్నారా. చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, గాయం-2, ఎవరైనా ఎపుడైనా వంటి సినిమాలతో తెలుగువారిని పలకరించింది ఈ బ్యూటీ. హీరోయిన్‌గా అదృష్టం కలిసిరాకపోవడంతో ఛాన్సులు తగ్గిపోయాయి.. దీంతో సైడ్ క్యారెక్టర్స్‌కి సైతం ఓకే చెప్పేసింది. అశ్విన్స్, గాండీవధారి అర్జున, రుద్రంగి వంటి సినిమాలు చేసినా దురదృష్టం ఆమెను వెంటాడింది.

actress Vimala raman posted video in social media confirming her relation with vinay rai

నిజానికి విమలా రామన్ ఆస్ట్రేలియా పౌరురాలు.. ఆమె తల్లిదండ్రులు భారత మూలాలున్న వారు. దీంతో విమల అక్కడే పుట్టి పెరిగింది. 2004లో మిస్ ఇండియా ఆస్ట్రేలియా విన్నర్ కావడంతో విమలా రామన్‌కు సినిమా ఛాన్సులు క్యూకట్టాయి. దీంతో ఇండియాలోనే ఉండిపోయిన ఆమె .. చెన్నై, హైదరాబాద్ మధ్య చక్కర్లు కొడుతూ అదృష్టం పలకరించకపోతుందా అని ఎదురుచూస్తోంది. విమలతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన అమ్మాయిలంతా ఫేడవుట్ అవ్వడమో, పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిలవ్వడమో జరిగింది. కానీ ఆమె మాత్రం అటు సినిమాలు చేయక.. ఇటు పెళ్లి చేసుకోకుండా కంటిన్యూ అవుతోంది.

కానీ ఇక పెళ్లిని వాయిదా వేయడానికి లేదు.. ఎందుకంటే విమలా రామన్ ఆల్రెడీ 40ని క్రాస్ చేసేశారు, ప్రస్తుతం ఆమె వయసు 42 ఏళ్లు. అందుకే ఇక బ్యాచిలర్ లైఫ్‌కి ఫుల్‌స్టాప్ పెట్టాలనుకుందో , ఏమో కానీ కోలీవుడ్ నటుడు వినయ్ రాయ్‌తో విమలా రామన్ ప్రేమాయణం నడుపుతోందని కోలీవుడ్ టాక్. ఈ వినయ్ ఎవరో కాదు.. తెలుగు, తమిళ్ సినిమాల్లో విలన్‌గా నటించిన వ్యక్తి. విశాల్ హీరోగా వచ్చిన డిటెక్టివ్‌లో ఆయనే ప్రతినాయకుడు. రీసెంట్‌గా తెలుగులో గాంఢీవధారి అర్జున, హనుమాన్, ఈగల్ మూవీస్‌లో విలన్‌గా అద్భుతంగా నటించారు.

గాంఢీవధారి అర్జున సమయంలోనే వినయ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని టాక్. అతనితో ప్రేమలో ఉన్న విషయాన్ని విమలా రామన్ ఎప్పుడూ ఓపెన్‌గా చెప్పలేదు. కాకపోతే సోషల్ మీడియాలో వినయ్‌తో ఉన్న ఫోటోలను అప్‌లోడ్ చేస్తుంటుంది. తాజాగా ప్రియుడితో కలిసి బీచ్‌లో ఉన్న వీడియోను ఆమె షేర్ చేయడంతో వీరి మధ్య ఉన్న బంధానికి మరింత బలం చేకూర్చినట్లయ్యింది. ఇంకా లేట్ చేయకుండా వీరిద్దరూ ఆ శుభవార్త చెప్పేస్తే బెటరంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: vimala raman vinay rai movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X