Vimala Raman: 40 ఏళ్ళ వయసులో ఆ నటుడితో పెళ్లికి సిద్దమైన ఉదయ్ కిరణ్ హీరోయిన్?
ఇటీవల కాలంలో కొంతమంది హీరోయిన్స్ మ్యారేజ్ లైఫ్ ని అలాగే సినిమా కెరీర్ ను చాలా భిన్నంగా బ్యాలెన్స్ చేస్తున్నారు. సినిమా కెరీర్ ను పర్సనల్ లైఫ్ పై ప్రభావం చూపించకుండా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చెక్క పెట్టుకున్న వారిలో విమలారామన్ ఒకరు. ఈ బ్యూటీ తెలుగు తమిళ్ మలయాళం ఇలా భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. ఇక అనుకున్నంతగా సక్సెస్ లు లేకపోయినా కూడా మంచి ఆదాయాన్ని సొంతం చేసుకున్న విమలా రామన్ ఫైనల్ గా 40 ఏళ్ల వయసులో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక ఆమె పెళ్లి చేసుకోబోయేది కూడా సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన వ్యక్తి కావడం విశేషం. ఇదివరకే ఈ జంట ప్రేమ విహార యాత్రలతో చాలా ప్రదేశాలు చుట్టేశారు.. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే..

మోడల్ గా క్రేజ్
మోడల్ గా 20 ఏళ్ల వయసులోనే మంచి గుర్తింపును అందుకున్న విమలా రామన్ ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ కనిపించనుంది. ఎక్కువగా ఆమెకు మలయాళం నుంచి వరుసగా అవకాశాలు వచ్చాయి. ఆస్ట్రేలియా లో పుట్టి పెరిగిన ఈ భారతీయ హీరోయిన్ మొదట 2006 లో ఒక తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

ఉదయ్ కిరణ్ సినిమాతో..
విమలా రామన్ సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీ లో బిజీ హీరోయిన్ గా కనిపించింది. అప్పట్లో ఒక సినిమా డిజాస్టర్ అయితే ఆ తర్వాత అవకాశాలు రావడం కష్టంగా ఉండేది. కానీ అమ్మడు మాత్రం తన టాలెంట్ తోనే అలాగే గ్లామర్ తోనే సినిమా అవకాశాలు ఎక్కువగా రాబట్టింది. ఈ బ్యూటీ మొదట ఉదయ్ కిరణ్ అబద్ధం అనే బైలాంగ్యువల్ సినిమా ద్వారా తెలుగు తమిళ్ లో ఒకేసారి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత వరుణ్ సందేశ్ తో ఎవరైనా ఎప్పుడైనా అనే సినిమా చేసింది.

తెలుగులో..
తెలుగులో విమలా రామన్.. గాయం 2, రంగా ది దొంగ, చట్టం, నువ్వా నేనా, రాజ్, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి.. అనే సినిమాలు చేసింది. చివరగా విమలా రామన్ తెలుగులో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నాగార్జున కలయికలో వచ్చిన ఓం నమో వెంకటేశాయ సినిమా లో శ్రీదేవి పద్మావతి పాత్రలో కనిపించింది.

నటుడితో ప్రేమలో..
ఇక విమలారామన్ గత కొంత కాలంగా ఒక తమిళ నటుడు వినయ్ రాయ్ తో ప్రేమలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అతను తెలుగులో వాన అనే సినిమాలో హీరోగా నటించాడు. ఇక గత ఐదేళ్ల నుంచి వీళ్ళు ఇద్దరు కూడా డేటింగ్ లో కొనసాగుతున్నారు. విమలా రామన్ మొదటి అతనితో స్నేహం చేసిన తర్వాత ప్రేమలో పడిందట. ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు మొదటిసారి సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.

40లో పెళ్లి?
తమిళ నటుడు వినయ్ రాయ్ ఇటీవల సూర్య 'ఈటి' సినిమాలో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించాడు. అలాగే శివ కార్తికేయన్ డాక్టర్ సినిమాలో కూడా కనిపించాడు. తమిళ ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు అందుకున్న వినయ్ రాయ్, విమలా రామన్ ను పెళ్లి చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగు పదుల వయసులో ఉన్న ఈ ఇద్దరు కూడా సరికొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. మరి వీరి పెళ్లి వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ గా క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











