తొలిసారి బికినీలో వితిక షేరు: చీర ఉంటే ఆ పని చేయలేం అంటూ ఘాటుగా!
తెలుగు అమ్మాయిలు సినీ రంగంలో అడుగు పెట్టాలంటే చాలా కష్టంగా ఉండేది. అయినప్పటికీ చాలా మంది లోకల్ బ్యూటీలు పరిశ్రమలోకి అడుగు పెట్టి సత్తా చాటుకున్నారు. అందులో ఆంధ్రా అమ్మాయి వితిక షేరు ఒకరు. అప్పుడెప్పుడో సినిమాల్లోకి అడుగు పెట్టిన ఈ భామ.. తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును దక్కించుకుంది. అలాగే, హీరో వరుణ్ సందేశ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత మాత్రం పెద్దగా అవకాశాలను అందుకోలేదు. ఇక, సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే వితిక.. తాజాగా ఓ హాట్ వీడియో వదిలింది. దాన్ని మీరే చూసేయండి మరి!
భీమవరం నుంచి కన్నడంలో:సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే వితిక షేరు మోడల్‌గా ఫుల్ పాపులర్ అయింది. ఇందులో తన అందచందాలతో మైమరపించిన ఈ భామ.. 'అంతు ఇంతు ప్రీతి బంతు' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయింది. దీని తర్వాత కూడా 'ఉల్లాస ఉత్సాహ' అనే చిత్రంలో నటించింది. తద్వారా కన్నడ పరిశ్రమలో ఈ బ్యూటీ ఫుల్ పాపులర్ అయిపోయింది.

తెలుగులో వరుస సినిమాలు:కన్నడ చిత్రాలతో ఎంటరైన వితిక షేరు 'ప్రేమించే రోజుల్లో' అనే చిత్రంతో తెలుగులోకి వచ్చేసింది. ఆ తర్వాత వరుసగా 'సందడి', 'జుమ్మంది నాదం', 'భీమిలి కబడ్డీ జట్టు', 'ప్రేమ ఇష్క్ కాదల్' వంటి చిత్రాలు చేసింది. ఈ క్రమంలోనే 'పడ్డానండీ ప్రేమలో మరి' చిత్రంతో హీరోయిన్‌గా మారింది. అలాగే తమిళంలోనూ కొన్ని సినిమాలు చేసి మెప్పించింది.

నిజంగానే ప్రేమలో పడింది:'పడ్డానండీ ప్రేమలో మరి' సినిమా చేస్తున్నప్పుడే హీరో వరుణ్ సందేశ్‌తో వితిక షేరు ప్రేమలో పడింది. ఆ తర్వాత వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కూడా కెరీర్‌లను కంటిన్యూ చేశారు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ బిగ్ బాస్ షోలోకి జంటగా వెళ్లారు. అందులో తరచూ ముద్దులు, హగ్గులు ఇచ్చుకునేవారు. ఇలా యమ పాపులర్ అయ్యారు. కానీ, ఎవరూ టైటిల్ కొట్టలేదు.

ఇప్పుడు కూడా అవకాశాలు:హీరోయిన్‌గా పరిచయమైన కొత్తలో వరుసగా సినిమాలు చేసిన వితిక షేరు.. వివాహం తర్వాత మాత్రం పెద్దగా రాణించలేదు. కానీ, యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఫ్యాన్స్‌ను మాత్రం అలరిస్తోంది. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితమే విడుదలైన 'పెళ్లిసందD' సినిమాలో వితిక షేరు కీలక పాత్రతో రీఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఆమెకు కాస్త అవకాశాలు వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్:సినిమా నటిగా కెరీర్‌ను మొదలు పెట్టిన తర్వత వరుస సినిమాలతో సందడి చేసినా.. ఈ మధ్య పెద్దగా ప్రభావాన్ని చూపకున్నా.. వితిక షేరు సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే తన అభిమానులను ఓ రేంజ్‌లో అలరిస్తోంది. మరీ ముఖ్యంగా తరచూ తనకు, తన వృత్తికి, తన పర్సనల్ విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూనే ఉంటోంది.

తొలిసారి బికినీలో హల్చల్:సినిమాల్లో నటించినా వితిక షేరు పెద్దగా గ్లామర్ షో మాత్రం చేయలేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ చిన్నది అప్పుడప్పుడూ హాట్ ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు తాజాగా బికినీలో తీసుకున్న ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో ఈ క్లిప్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చి వైరల్ అవుతోంది.
చీరలో చేయలేం అంటూ:బికినీ వీడియో వదిలిన వితిక.. 'బట్టల వల్ల అభిప్రాయం మారిపోయే సొసైటీలో ఉన్నాం. చీర కట్టుకుని స్విమ్మింగ్ చేయలేం కదా. స్విమ్మింగ్‌కు వెళ్తే స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ వేసుకుంటారు. పరిస్థితులకు తగ్గట్లు బట్టలు వేసుకోవడంలో తప్పు లేదు. దీన్ని ఈజీగా తీసుకుని మనుషులను జడ్జ్ చేయడం మానేయండి' అంటూ ఘాటుగానే ట్రోలర్స్‌కు ఇచ్చి పడేసింది.


Click it and Unblock the Notifications











