ఆస్కార్ వేడుకలో హాలీవుడ్ భామ అదుర్స్.. 45 కోట్ల నెక్లెస్‌తో హంగామా చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?

అందాల భామలు, తారల తళుకుల మధ్య ఆస్కార్ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది. కోవిడ్19 నిబంధనలకు అనుగుణంగా అతికొద్ది మంది ప్రముఖులను మాత్రమే ఈ వేడుకకు అనుమతించారు. ఈ కార్యక్రమంలో హాలీవుడ్ భామలు జెండయా, అమండా సీ ఫ్రైడ్, వెన్నీసా కిర్బీ, ఎరికా రివినోజా, గిగి విలియమ్స్, హాలే బెర్రీ తదితరులు రెడ్ కార్పెట్‌పై హంగామా చేశారు. తమ అందాల ఆరబోతతో వేడుకలకు వన్నె తెచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

ఆస్కార్ రెడ్ కార్పెట్‌పై అదుర్స్

ఆస్కార్ రెడ్ కార్పెట్‌పై అదుర్స్

హాలీవుడ్ భామ జెండయా ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా మారింది. పసుపు పచ్చ డ్రస్‌లో రెడ్ కార్పెట్‌పై నడిచిన బ్యూటీ.. అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకొన్నారు. ఆమె మెడలో వేసుకొన్న అత్యంత ఖరీదైన డైమండ్ నెక్లెస్ ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది.

వరల్డ్ క్లాస్ టచ్‌ డైమండ్ నెక్లెస్‌తో

వరల్డ్ క్లాస్ టచ్‌ డైమండ్ నెక్లెస్‌తో

అంతర్జాతీయంగా పేరొందిన బల్గరీ అనే జ్యువెలరీ సంస్థ డిజైన్ చేసిన మ్యాగ్నిఫికా అనే తాజా సమ్మర్ కలెక్షన్‌కు సంబంధించిన ఆభరణాలను జెండయా ధరింంచింది. ఆరు క్యారెట్ల కుషన్ కట్ స్టైల్‌లో రెండు వరుసల డైమండ్ నెక్లెస్‌ను ధరించి అందంగా ముస్తాబయ్యారు.

6 మిలియన్ డాలర్ల విలువైన

6 మిలియన్ డాలర్ల విలువైన

జెండయా ధరించిన డైమండ్ నెక్లెస్‌లు ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె ధరించిన ఆభరణాల విలువ 6 మిలియన్ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీలో సుమారు 45 కోట్ల విలువ కలిగినవి అని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఓ రేంజ్‌లో ఆకట్టుకోవడం జెండయాకు ఇది మొదటిసారి కాదు. పలు ఆస్కార్ వేడుకల్లో ఆమె ప్రత్యేక ఆకర్షణగా మారడం తెలిసిందే.

డ్రస్ డిజైన్ తలదన్నేలా ఆభరణాలతో

డ్రస్ డిజైన్ తలదన్నేలా ఆభరణాలతో

జెండయా స్టైలిష్ట్, ఇమేజ్ ఆర్కిటెక్ట్ లా రోచ్ స్పందిస్తూ.. అప్పటికే ఆమె డ్రస్ డిజైన్ ఖరారు కావడంతో దానిపైకి ఎలాంటి ఆభరణాలు ఉంటే బాగుంటుందని ఆలోచించాం. ఆభరణాలు ధరించడంలో అందరికి స్పూర్తిగా నిలువాలనే దృష్టితోనే బల్గరీ ఆభరణాలను కొనుగోలు చేశాం. మేము ఊహించినట్టే జెండయాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది అని అన్నారు.

Recommended Video

ఇందుకే కదా Akkineni Samantha లేడీ సూపర్ స్టార్ అయింది !
జెండయా హాలీవుడ్ కెరీర్

జెండయా హాలీవుడ్ కెరీర్

హాలీవుడ్‌లో జెండయా కెరీర్ విషయానికి వస్తే సూపర్ బడ్డీస్ అనే చిత్రంతో 2013లో హాలీవుడ్‌లో ప్రవేశించారు. స్పైడర్ మ్యాన్ హోం కమింగ్, ది గ్రేటెస్ట్ షోమ్యాన్, డక్ డక్ గూస్, స్మాల్‌ఫుట్, స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోమ్, మాల్కమ్ అండ్ మారీ, స్పేస్ జామ్: ఈ న్యూ లెగసీ, డూన్, స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ అనే చిత్రాల్లో నటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X