మొత్తానికి హీరోయిన్ అలా సెటిలైంది.. యూట్యూబ్‌లో ఆ వీడియోలతో రచ్చ
హార్ట్ ఎటాక్ సినిమాతో ఆదాశర్మ పరిచయమై తెలుగు కుర్రాళ్లకు నిజంగానే హార్ట్ ఎటాక్ తెప్పించింది. పూరీ జగన్నాద్ పరిచయం చేసిన హీరోయిన్ అంటే తెలుగు ప్రేక్షకుల్లో ఓ క్రేజ్ ఉంటుంది. అనుష్క, అసిన్, రక్షిత ఇలా ఎంతో మంది మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఆదా శర్మ కూడా నటిగా మంచిపేరే తెచ్చుకుంది. గ్లామర్ పరంగానూ యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. కానీ అదా శర్మకు అవకాశాలు అంతంతమాత్రంగానే వస్తున్నాయి.
క్షణం, సన్నాఫ్ సత్యమూర్తి, కల్కి వంటి చిత్రాలు హిట్ అయినా అదా శర్మకు అవకాశాలు మాత్రం రావడం లేదు. లాక్ డౌన్‌లో ఈ భామ చేసిన రచ్చ గురించి అందరికీ తెలిసిందే. మామూలుగా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో, యోగా భంగిమలతో, జిమ్నాస్టిక్స్‌తో నానా రచ్చ చేస్తుంటుంది. అయితే తాజాగా అదా శర్మ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది. యూట్యూబ్‌లో దూరిపోయి తన పేరు మీదుగా ఓ ఛానెల్ పెట్టుకుంది.

ఈ మధ్య యూట్యూబ్‌లో సెలెబ్రిటీలందరూ తమకంటూ ఓ ఛానెల్‌ను క్రియేట్ చేసుకుంటున్నారు. వీటిలో హీరోయిన్లు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఈ క్రమంలో ఆదా శర్మ తన వంటల ప్రతిభను నెటిజన్లకు చూపింస్తోంది. వెరైటీ వంటకాల తయారీని అందరికీ నేర్పిస్తోంది. తాజాగా నోరూరించే దోశలను వేసి అందర్నీ ఆకట్టుకుంది. ప్రస్తుతం అదా శర్మ ఇలాంటి వీడియోలు చేసుకుంటూ బిజీగా ఉంటోంది.


Click it and Unblock the Notifications











