Adah Sharma: అలాంటి డ్రెస్సులో ఆదాశర్మ.. ఎద అందాల ఆరబోత!

ఈ మధ్యకాలంలో హీరోయిన్ల ఫోటోషూట్లు కాక రేపుతున్నాయి. కొందరు హాట్ ఫోటో షూట్ లు షేర్ చేస్తుంటే కొందరు మాత్రం వింతగా ఉండి కొన్ని రోజులు పాటు మాట్లాడుకునే విధంగా ఫోటోషూట్లకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అదే కోవలో ముంబై భామ ఆదాశర్మ కూడా ఒక వింత ఫోటోషూట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదేమిటంటే ఆమె ఆకులతో డిజైన్ చేసిన ఒక గౌను ధరించి ఆసక్తి రేకెత్తించింది. ఆ వివరాల్లోకి వెళితే

సినిమాల్లోకి

సినిమాల్లోకి


ఆదాశర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముంబైలోని ఒక నేవీ కుటుంబంలో జన్మించిన ఈమె చిన్ననాటి నుంచి సినిమాల మీద ఆసక్తి పెంచుకుంది. పదో తరగతి కూడా పూర్తి చేయకుండా సినిమాల్లోకి వెళతానని మారం చేస్తుంటే తల్లిదండ్రులు భయపెట్టి, బ్రతిమలాడి ఎలాగో పదో తరగతి పూర్తి చేయించారు. ఆ తర్వాత సినీ రంగ ప్రవేశం కోసం ప్రయత్నాలు చేసిన ఆమె 2008లోనే 1920 అనే ఒక హారర్ సినిమాలో నటించింది.

వరుస అవకాశాలు

వరుస అవకాశాలు


ఆ తరువాత మరో రెండు హిందీ సినిమాల్లో నటించాక తెలుగులో హార్ట్ ఎటాక్ అనే సినిమా అవకాశం వచ్చింది. నితిన్ హీరోగా పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఈ సినిమా ద్వారా ఆమె హయతి అనే పాత్రతో మంచి క్రేజ్ దక్కించుకుంది. అయితే ఆ సినిమా సూపర్ హిట్ ఏమి కాకపోవడంతో ఆమెకు వరుస అవకాశాలు అయితే దక్కలేదు. తర్వాత నుంచి ఆమె సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్, గరం, క్షణం ఇలా వరుస సినీ అవకాశాలు దక్కించుకుంది.

వెబ్ సిరీస్ లో

వెబ్ సిరీస్ లో


కానీ అవేవీ ఆమెకు కలిసి రాలేదు. చివరిగా ఆమె రాజశేఖర్ హీరోగా వచ్చిన కల్కి అనే సినిమాలో డాక్టర్ పద్మ అనే పాత్రలో కనిపించింది. ఆ సినిమా కూడా ఆమెకు కలిసి రాలేదు. ఇక హిందీలో మాత్రం మరో రెండు సినిమాల్లో కనిపించింది. అయినా సరే ఆమెకు అవకాశాలు అయితే దక్కడం లేదు. దీంతో ఆమె వెబ్ సిరీస్లు చేయడానికి కూడా వెనకాడడం లేదు. చివరిగా ఆమె ప్రతి ఔర్ పంగా అనే వెబ్ సిరీస్ లో కనిపించింది.

ఫోటోషూట్

ఫోటోషూట్


అందులో శివాని భట్నాగర్ అనే పాత్రలో కనిపించింది. ఇక ఆ తర్వాత హిందీలో చుహాబిల్లి అనే ఒక షార్ట్ ఫిలిం లో కూడా కనిపించిన ఆమె ఈమధ్య పియా రే పియా అనే ఒక మ్యూజిక్ వీడియోలో కూడా కనిపించింది. అసలు విషయం ఏమిటంటే తాజాగా ఆదాశర్మ షేర్ చేసిన ఫోటోషూట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఆకులతో

ఆకులతో


దానికి కారణం ఆమె ఆకులతో కుట్టిన ఒక గౌను ధరించడమే. ఒక్కసారి ఆమె గౌను చూస్తే కనుక నిజంగా ఆకులని అడ్డంగా కుట్టి ఇలా కూడా గౌను కుడతారా అనే అనుమానం కలుగక మానదు. కేవలం ఆకులతో డిజైన్ చేసిన ఆ గౌను ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటో షూట్ మీరు కూడా చూసేయండి మరి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X