చీర పైకి కట్టి అదా శర్మ విన్యాసాలు..అది కర్రసామా లేక అన్ని అందాలు చూపించే సాధనమా?
కొంతమంది హీరోయిన్లకు చాలా సినిమాల తర్వాత పాపులారిటీ వస్తుంది. మరికొంతమంది ముద్దుగుమ్మలకు చేసిన ఒక్క సినిమాతోనే యమ క్రేజ్ సంపాదించుకుంటారు. ఇక డ్యాషింగ్ అండ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినీ ఇండస్ట్రీకి ఎంతోమంది బ్యూటిఫుల్ అమ్మాయిలను హీరోయిన్లుగా పరిచయం చేశాడు. అలా పూరీ సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. కేవలం ఒకే ఒక్క సినిమాతో యువతకు హార్ట్ ఎటాక్ తెప్పించిన గ్లామరస్ బ్యూటి అదా శర్మ. తెలుగులో నితిన్ సరసన ఆమె చేసిన హార్ట్ ఎటాక్ సినిమాకు ఎంత క్రేజ్ తెచ్చుకుందో తెలిసిందే. ఆ సినిమా తర్వాత అదా శర్మకు పెద్దగా కలిసి రాకపోయిన సోషల్ మీడియా ద్వారా మాత్రం అట్రాక్ట్ చేస్తోంది.

అద్భుతమైన నటనకు..
గ్లామరస్ బ్యూటి అదా శర్మ యంగ్ ఏజ్ లోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. పాఠశాల చదువు పూర్తయిన వెంటనే అంటే కేవలం 16 ఏళ్లకే బాలీవుడ్ లో హీరోయిన్ గా రంగ ప్రవేశం చేసింది ముద్దుగుమ్మ అదా శర్మ. అయితే '1920' అనే హిందీ హరర్ సినిమాతో తెరంగేట్రం చేసింది అదా. చేసింది మొదటి సినిమా అయిన అందులో అద్భుతమైన ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. దీంతో ఈ భామ ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ డెబ్యూ హీరోయిన్‌గా నామినేటైంది.

హిందీ చిత్రాల్లోనే..
హరర్ చిత్రం 1920తో ఒక్కసారిగా పాపులర్ అయిన బ్యూటిఫుల్ అదా శర్మ ఆ తర్వాత సినిమాలకు సుమారు మూడేళ్లు విరామం ఇచ్చేసింది. అనంతరం మళ్లీ హిందీ పరిశ్రమలోనే అడుగు పెట్టి అక్కడ పలు చిత్రాల్లో నటించి అలరించింది. 2011 సంవత్సరంలో ఫిర్ అనే సినిమా చేసిన అదా శర్మ 2013లో హమ్ హై రాహి కార్ కి చిత్రంలో నటించింది. ఆ తర్వాత 2014లో వచ్చిన హసే తో పసే సినిమాలో హీరోయిన్ గా ఆకట్టుకుంది అదా శర్మ.

అలా తెలుగులోకి..
హిందీలో అదా శర్మ చేసిన అన్ని సినిమాలు హిట్ కావడంతోపాటు ఆమె నటనకు మంచి మార్కులు పడటంతో వరసు ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. ఈ క్రమంలోనే తెలుగులోనూ అవకాశాలు వరించాయి. అందులో భాగంగానే 2014వ సంవత్సరంలో హాట్ ఎటాక్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో కాలు మోపింది ఈ ముద్దుగుమ్మ అదా శర్మ. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నితిన్ హీరోగా చేసిన విషయం తెలిసిందే.

ఒకేసారి 6 సినిమాలతో..
ఇక 'హార్ట్ ఎటాక్' సినిమాలో ఆదా శర్మ అందం, గ్లామర్, హాట్ నెస్ తోపాటు యాక్టింగ్‌తో కూడా ఎంతగానో ఆకట్టుకుని యువతకి ఫేవరెట్ క్రష్‌గా మారిపోయింది. దీంతో అదా శర్మ వల్ల కుర్రాళ్లకు 'హార్ట్ ఎటాక్' వచ్చినంత పని అయింది. ఈ సినిమా తర్వాత ఆదా శర్మకు తెలుగులో అవకాశాలు భారీగానే వచ్చాయి. దీంతో ఈ చిన్నది తెలుగులో మొత్తంగా ఆరు సినిమాల వరకు చేసింది. అయితే అదా శర్మ తన పాత్రకు ప్రాధాన్యం ఉందా లేదా అన్నది చూడకుండా వరుసగా 'సన్నాఫ్ సత్యమూర్తి', 'సుబ్రమణ్యం ఫర్ సేల్', 'గరం' వంటి సినిమాల్లో నటించింది.

చివరిగా ఆ సినిమాలో..
అదా శర్మ నటించిన 'సన్నాఫ్ సత్యమూర్తి', 'సుబ్రమణ్యం ఫర్ సేల్', చిత్రాలు హిట్ కొట్టిన కూడా ఆమెకు అంతగా ఒరిగింది ఏం లేదనే చెప్పాలి. ఇక ఆ తర్వాత అడవి శేష్ హీరోగా నటించిన 'క్షణం' సినిమా భారీ హిట్ కొట్టింది. ఈ సినిమాతో అదా శర్మ ఆకట్టుకోగా.. కొంతవరకు ఆమె పేరు పాపులర్ అయింది. ఈ సినిమా తర్వాత మాత్రం అదా శర్మకు తెలుగులో పూర్తిగా అవకాశాలు తగ్గాయి. కానీ చివరిగా 2022లో క్యూట్ మీట్ అనే చిత్రంలో నటించింది.

నిత్యం టచ్ లో ఉంటూ..
తెలుగులో అవకాశాలు రాని సమయంలో హిందీ చిత్రాలతో బిజీగా మారిపోయింది స్టన్నింగ్ బ్యూటి అదా శర్మ. 2017లో కమాండో 2 మూవీలో అదా శర్మ నటనతోనే కాకుండా యాక్షన్ సీక్వెన్స్ లో కూడా అట్రాక్ట్ చేసింది. గ్లామరస్ బ్యూటి అదా శర్మ ప్రస్తుతం వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌లలో నటిస్తోంది. తద్వారా కెరీర్‌ను బిజీగానే నడుపుతోంది. ఇక, ఈ మధ్య కాలంలో ఆమె కొన్ని మ్యూజిక్ వీడియోలు కూడా చేసింది. అలాగే సోషల్ మీడియాలో కూడా నిత్యం హాట్ ఫొటోలు, వీడియోలు, వ్యక్తగత విషయాలు షేర్ చేస్తూ అభిమానులకు రెగ్యూలర్ గా టచ్ లో ఉంటోంది.
చీరను పైకి కట్టి మరి అందంతో విన్యాసాలు..
బ్యూటిఫుల్ అదా శర్మ సోషల్ మీడియాలో తాజాగా ఒక హాట్ వీడియో వదిలింది. ఇందులో చీరను పైకి కట్టుకుని స్లీవ్ లెస్ బ్లౌజ్ లో కర్రసాము ప్రాక్టీస్ చేస్తూ దర్శనం ఇచ్చింది అదా. సముద్రం మధ్యలో కొండలపై రెండు కర్రలతో అదా శర్మ విన్యాసాలు అబ్బురపరిచాయి. ఇక అంతకుమించి అనేలా అదా నాభి, థైస్, షోల్డర్ అందాలు కనువిందు చేశాయి. అది కర్రసామా లేక అందాలు ఆరబోసేందుకు సాధానమా అన్నట్లుగా నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ వీడియో మహా శివరాత్రి సందర్భంగా షేర్ చేసి గతంలో జరిగిన షూట్ గురించి పలు వివరాలు తెలిపింది అదా శర్మ.


Click it and Unblock the Notifications











