ఆ సమయంలో నన్ను చంపాలనున్నారు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

ప్రముఖ నటి అదా శర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2008లో వచ్చిన హార్రర్ మూవీ '1920'తో హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే నటనకు ప్రశంసలు అందుకున్న అదా శర్మ, తర్వాత టాలీవుడ్‌లో నితిన్‌తో చేసిన పూరి జగన్నాథ్ చిత్రం 'హార్ట్ ఎటాక్' ద్వారా మంచి గుర్తింపు సంపాదించింది. అనంతరం 'సన్నాఫ్ సత్యమూర్తి', 'క్షణం', 'కల్కి' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం దక్కించుకుంది. అయితే.. ఈ అందాల భామను ఓ సినిమా విడుదల అయిన తరువాత చంపాలని భావించారని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటీ? అసలేం జరిగిందంటే?

అందాల భామ అదా శర్మ టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌పై దృష్టి సారించారు.గ్లామర్‌తో పాటు రిస్క్ ఉన్న పాత్రలను కూడా ధైర్యంగా ఎంచుకుంటూ తన కెరీర్ ను ముందుకు సాగుతున్నారు. అదే ధైర్యం ఆమె కెరీర్‌కు భారీ మార్పు తీసుకువచ్చిందట. అలా 2023లో విడుదలైన వివాదాస్పద మూవీ 'ది కేరళ స్టోరీ'. ఈ మూవీ అదా శర్మ కెరీర్‌ను పూర్తిగా మార్చేసిందనే చెప్పాలి. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఈ సినిమా ఏకంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అదాను పాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టింది.

Adah Sharma Reveals Shocking Threats After The Kerala Story Half the Country Wanted to Kill Me

ఇటీవల అదా శర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ది కేరళ స్టోరీ విజయానికి వెనుక ఆదా ఎదుర్కొన్న అనుభవాలు ఆమె తాజాగా వెల్లడించింది. "ఆ సినిమా విడుదల సమయంలో... దేశంలో సగం మంది నన్ను చంపాలనుకున్నారు" అంటూ ఆదా శర్మ షాకింగ్ కామెంట్ చేసింది. ఆదా శర్మ మాట్లాడుతూ తనపై వచ్చిన తీవ్ర బెదిరింపులను గుర్తు చేసుకుంది. 'ది కేరళ స్టోరీ', 'బస్తర్ - ద నక్సల్ స్టోరీ' సినిమాలు విడుదలైనప్పుడు తీవ్రమైన ప్రతికూలతను ఎదుర్కొన్నానని చెప్పింది.

" ది కేరళ స్టోరీ విడుదలైన తరువాత దేశంలో సగం మంది నన్ను చంపాలని అనుకున్నారు... మరికొందరు మాత్రం నా వెంటే నిలబడి నన్ను కాపాడారు. ఇలాంటి పరిస్థితుల్లో నటించడం నిజంగా చాలా కష్టం." అన్నారు. పాత్రల్లో రిస్క్ తీసుకున్నప్పుడే నటుడిగా తన విలువ పెరుగుతుందని నమ్ముతున్నానని, 1920 సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుండి మంచి స్క్రిప్ట్ కోసం ఎదురు చూసిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఛాలెంజ్ గా తీసుకున్న పాత్రలే తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లాయని, అలాంటి పాత్రలను స్వీకరించడం వల్లే తనకు ఇలాంటి గుర్తింపు లభించిందని ఆమె భావిస్తోంది.

ప్రస్తుతం ఆదా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ, అభినందనలు తెలుపుతున్నారు. " అలాంటి ప్రత్యేకమైన కథలను ఎంచుకోవడంలో ఆదా ఎప్పుడూ ముందుంటుంది", 'అలాంటి రిస్క్‌లు తీసుకున్నందుకే ఆమెకు ఈ స్థాయిలో పేరు వచ్చింది" అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అదా శర్మ బాలీవుడ్‌లో వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో దూసుకుపోతున్నారు.

ఇటీవ‌ల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'బస్తర్: ది నక్సల్ స్టోరీ'లో ఆమె ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటించి, మెప్పించారు. దాంతో పాటు మరో ఇన్టెన్స్ యాక్షన్-థ్రిల్లర్ మూవీలో నటిస్తూ, విభిన్నమైన పాత్రలను ఎంచుకోవడంలో ముందంజలో ఉంది అదా. సోషల్ మీడియాలో కూడా అదా శర్మ చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆమె తరుచు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫిట్‌నెస్ వీడియోలు, డాన్స్ క్లిప్స్, వేరే వేరే పాత్రల ప్రిపరేషన్స్, యాక్షన్ ట్రైనింగ్ షాట్స్ లను పోస్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఆమె చేసే గ్లామరస్ ఫోటోషూట్లు తరచూ ట్రెండింగ్‌లో నిలుస్తాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X