twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అదా శర్మ వీడియో విందు.. అందాలే కాదు అన్నీ చూపించింది

    |

    సోషల్ మీడియాకు వేడి పుట్టించడంలో అదా శర్మది అందె వేసిన చేయి. తన వంతుగా నెట్టింట అందాల విందు చేస్తూ ఎప్పుడూ ఏదో ఒక స్పెషల్ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. దుస్తులను ఆదా చేస్తూ పొదుపుగా బట్టలు ధరించడంలో ఈ బ్యూటీకి సాటిరారెవ్వరు. ఏ రోజుకారోజు అన్నట్లుగా రోజుకో హాట్ పిక్ గానీ హాట్ వీడియో గానీ షేర్ చేస్తూ యువ హృదయాలను మత్తెక్కించడంలో అదా శర్మను మించిన హీరోయిన్ లేదనే చెప్పుకోవాలి.

     అశ్రద్ధ లేని అదా

    అశ్రద్ధ లేని అదా

    సినిమాల్లో అవకాశాలు అటూ ఇటూగా ఉన్నా సోషల్ మీడియాను మాత్రం ఏ మాత్రం అశ్రద్ధ చేయదు అదా. అందుకే ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌పై అదాకు అంతులేని ఫాలోయింగ్ ఉంది. ట్విట్టర్, ఇన్స్‌స్టాగ్రామ్ లకు కొత్త అందం తెచ్చే ఈ కుర్ర లేడీ తాజాగా ఓ వీడియో షేర్ చేసి ఆశ్చర్య పర్చింది.

     బీచ్ ఒడ్డున పొట్టి దుస్తులతో హంగామా

    బీచ్ ఒడ్డున పొట్టి దుస్తులతో హంగామా

    మారిషస్ దేశంలోని ఓ బీచ్‌లో చిట్టి నిక్కరు, జబ్బలు కనిపించే జాకెట్ వేసుకొని కుర్రకారుకు స్పెషల్ ట్రీట్ ఇచ్చింది అదా శర్మ. ఫొటో కాదు ఏకంగా వీడియో షేర్ చేసి తన అందం, టాలెంట్ రెండూ ఒకేసారి ధారపోసింది ఈ పొట్టి నిక్కరు సెక్సీ పాప. రెచ్చి పోయి ఫైట్లు చేసే నేటితరం స్టార్ హీరోలకే దిమ్మతిరిగేలా ఈ వీడియో ద్వారా కిక్కిచ్చింది అదా.

    వెనుక నుంచి, ముందు నుంచి అందాలతో స్పెషల్ ట్రీట్

    ఈ వీడియోలో కర్రసాము చేస్తూ ఆశ్చర్యపర్చిన అదా శర్మ.. వెనుక నుంచి, ముందు నుంచి అందాలతో స్పెషల్ ట్రీట్ ఇచ్చింది. 360 డిగ్రీల్లో తన చేతులపై కర్రను తిప్పుతూ తను ఎంజాయ్ చేయడమే గాక చూపరుల దృష్టిని లాగేసింది. పైగా ఈ వీడియోను తన ఇన్స్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ పెద్ద సందేశమే పోస్ట్ చేసింది.

    మరిన్ని వీడియోలు త్వరలో మీ ముందుకు తెస్తా..

    మరిన్ని వీడియోలు త్వరలో మీ ముందుకు తెస్తా..

    సెప్టెంబర్ 6 వ తేదీన 'కమాండో 3' విడుదల కానుంది. ఎవరైతే థియేటర్‌కు పోకుండా ఉంటారో వారికి ఈ కర్రతో చురకలు పెట్టేస్తా. ఈ కర్రసాము నేర్చుకోవడం అంత ఈజీ కాదు. ఇది నేర్చుకునే క్రమంలో నా కాళ్లకు, తలకు ఎన్నో బలమైన గాయాలయ్యాయి. అయినా కూడా కష్టపడి నేర్చుకున్నా. నా కర్రసాముకు సంబంధించి మరిన్ని వీడియోలు త్వరలో మీ ముందుకు తెస్తా.. అని పేర్కొంది అదా శర్మ.

    `కల్కి` సినిమాలో అదా గ్లామర్ మంత్రం

    `కల్కి` సినిమాలో అదా గ్లామర్ మంత్రం

    అదా శర్మ సినిమాల విషయానికొస్తే.. సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత అదా శర్మ సరైన అవకాశాలు అంది పుచ్చుకోలేదు. చాలా కాలం తర్వాత రాజశేఖర్ సరసన `కల్కి` చిత్రంలో నటిస్తోంది ఈ హార్ట్ ఎటాక్ భామ. ఇందులో అదా గ్లామర్ యాంగిల్‌ని బాగా ఎలివేట్ చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం మంచి ఊపు మీదున్న ఈ అమ్మడికి రానున్న రోజుల్లో గిరాకీ బాగానే పెరుగుతుందని అంటున్నారు జనం.

    English summary
    Hot beauty Adah Sharma shared her hot and sensational video in Instagram. Now this video is viral on social media. Present she was acting in Kalki movie with Dr. Rajasekhar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X