ఓ వైపు సందేశాలు.. మరోవైపు అందాల ఆరబోత.. చూడటానికి రెండు కళ్లు చాలవు.. ఆదా శర్మ హల్చల్

పూరీ జగన్నాద్ పరిచయం చేసిన హీరోయిన్లకు మంచి అవకాశాలే లభిస్తుంటాయి. కొత్త హీరోయిన్లను పరిచయం చేయడంలో పూరి జగన్నాథ్ ముందుంటాడన్న సంగతి తెలిసిందే. హార్ట్ ఎటాక్ చిత్రంతో ఆదా శర్మ అనే అందాల గనిని తెలుగు తెరకు పరిచయం చేశాడు. ఈ చిత్రం అనుకున్నంతగా ఆడకపోయినా..ఈ అమ్మడుకు మాత్రం మంచి అవకాశాలే వచ్చాయి. అయితే వచ్చిన అవకాశాలను సరిగ్గా వాడుకోకపోవడంతో తెలుగులో దాదాపు కనుమరుగైపోయింది ఈ భామ.

హిట్ అయినా పేరు రాలేదు..

హిట్ అయినా పేరు రాలేదు..

క్షణం, సన్నాఫ్ సత్యమూర్తి వంటి హిట్ చిత్రాలు ఈమె ఖాతాలో ఉన్నాయి. అయితే అవి రెండూ భారీ విజయాన్ని సాధించినవే అయినా.. ఆ క్రెడిట్ మాత్రం ఈమె ఖాతాలో పడలేదు. ఈమెకు అవకాశాలు కూడా అంతగా రాకపోవడంతో బాలీవుడ్‌కు చెక్కేసింది ఈ బ్యూటీ. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.

ఫ్యాన్స్‌కు ట్రీట్..

ఫ్యాన్స్‌కు ట్రీట్..

వెండితెరపై అంతగా అందాల ప్రదర్శన చేయని ఆదా శర్మ.. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా రెచ్చిపోతూ ఉంటుంది. నిత్యం కొత్త కొత్త స్టైల్‌లో రెడీ అయి ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఈమె ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంటాయి.

వెరైటీ డ్రెస్సింగ్..


అదా శర్మకు సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో బాగా తెలుసు. వెరైటీ క్యాస్టూమ్, స్టైలింగ్‌తో నెటిజన్స్‌ను ఆకట్టుకుంటూ ఉంటుంది. పేపర్ డ్రెస్స్‌లు, జుట్టుకు వెరైటీ రంగులు వేసుకుంటూ, పులి చర్మం లాంటి డ్రెస్సులు, పిల్లిలా తయారవ్వడం ఇలా కొత్తగా ట్రై చేస్తూ ఫ్యాన్స్‌కు కిక్కిస్తుంది.

Recommended Video

Anushka Sharma Serious Recation on Her Pregnancy Rumors
కరోనా సందేశాల పాటు అందాల ప్రదర్శన..

కరోనా సందేశాల పాటు అందాల ప్రదర్శన..

కరోనా వైరస్ విజృంభిస్తుండంటో ఇంట్లోనే ఉండండి, బయటకు వెళ్లొద్దంటూ ప్రభుత్వాలు సూచిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సందేశాన్ని ఆదా శర్మ తన అందాలను ప్రదర్శిస్తూ.. హాట్ పోజులతో చెప్పుకొచ్చింది. పైగా తన పెంపుడు జంతువు పిల్లి డ్రెస్సింగ్ బాగుందా? నేను వేసుకుంది బాగుందా? అని నెటిజన్లను ప్రశ్నించింది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్న ఆదా అందాలను మీరూ ఓ సారి చూడండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X