నన్ను అలా చంపాలని కుట్ర... అల్లు అర్జున్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
అందం, అభినయం ఉన్నప్పటికీ కొంతమంది హీరోయిన్లకు కాలం కలిసిరాలేదు. ఎన్ని సినిమాలు చేసినా, తమలో టాలెంట్‌కు తగ్గ పాత్ర దొరకలేదని బాధపడుతుంటారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇలాంటి వారెందరో. అయితే ఒకే ఒక్క సినిమా వారి సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెబుతుంది. ఈ కోవలోకే వస్తారు యంగ్ హీరోయిన్ అదా శర్మ. గ్లామరస్ పాత్రలతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మలో ఎంత విషయం ఉందో ది కేరళ స్టోరీస్ చిత్రం ద్వారా అర్ధమైంది. ఈ సినిమా తర్వాత ఆమె నటిగా గుర్తింపు తెచ్చుకోగా.. ఆమె కెరీర్ దూసుకెళ్తుందని అంతా భావించారు. కానీ పరిస్ధితుల్లో ఎలాంటి మార్పు రాలేదు..
మల్టీ టాలెంటెడ్ అదా శర్మ
ముంబైలో పుట్టి పెరిగారు అదా శర్మ. తండ్రి తమిళనాడులోని మధురైకి చెందినవారు కాగా.. తల్లి మలయాళీ. క్లాసికల్ డ్యాన్సర్‌గా, యోగా ట్రైనర్ కావడంతో ఆమె అదా శర్మకు డ్యాన్స్, యోగాలో పట్టు చిక్కింది. కథక్, సల్సా, జాజ్, బల్లెట్, బెల్లీ డ్యాన్స్‌లో ఆమె నిష్ణుతురాలు. అంతేకాదు.. భారతీయ మార్షల్ ఆర్ట్స్ కళ అయిన సిలాంబమ్‌లోనూ పట్టుంది. తమిళం, మలయాళం, ఇంగ్లీష్, హిందీ, మరాఠీలలో అదా శర్మ అనర్గళంగా మాట్లాడుతుంది. సినీ పరిశ్రమలో అడుగుపెట్టడానికి ఆమె ఎంతో కష్టపడ్డారు. ఎన్నో ఆడిషన్స్‌కి హాజరైనప్పటికీ బాగా చిన్నపిల్లలా ఉండటంతో ఆఫర్లు దక్కలేదు.

కేరళ స్టోరీతో బ్రేక్
2008లో 1920 అనే హార్రర్ మూవీలో నటించిన అదా శర్మ.. ఆ తర్వాత ఫిర్, హమ్ హై రాహి కర్ కే తదితర చిత్రాల్లో మెరిశారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన హార్ట్ అటాక్ సినిమాల ద్వారా తెలుగువారిని పలకరించారు అదా శర్మ. ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గరం, క్షణం, కల్కి, క్వశ్చన్ మార్క్, క్రిమినల్ ఆర్ డెవిల్ తదితర చిత్రాలలో నటించారు. కానీ వీటిలో ఆమెకు అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. ఈ దశలో సుదీప్తో సేన్ దర్శకత్వంలో 2023లో వచ్చిన ది కేరళ స్టోరీస్ సినిమాతో అదా శర్మలోని కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. లవ్ జిహాద్, ఉగ్రవాదం ఇతివృత్తం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో శాలిని ఉన్నికృష్ణన్, ఫాతిమగా అదా శర్మ నటన ఆకట్టుకుంది.
సుశాంత్ ఫ్లాట్‌లో మకాం
ఆ తర్వాత మావోయిస్టులు, విప్లవ ఉద్యమం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన బస్తర్: ది నక్సల్ స్టోరీ సినిమాలో అదా శర్మ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం హాఠక్ అనే సినిమాలో ఆమె నటిస్తున్నారు. ఏ విషయంపై అయినా ముక్కుసూటిగా మాట్లాడటం అదా స్టైల్. ఇక ముంబైలోని దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న ఫ్లాట్‌ని అదా శర్మ కొనుగోలు చేయడం సంచలనం సృష్టించింది. ఆ ఇంటిని రీమోడలింగ్ చేసి.. కుటుంబ సభ్యులతో కలిసి ఆ ఇంటిలో దిగారు. సుశాంత్ ఇంట్లో ఏదో తెలియని శక్తి ఉందని అందుకే దానిని కొనుగోలు చేసినట్లు అదా తెలిపారు.
సగం మంది చంపాలనుకున్నారు
కాగా.. వివాదాస్పద వ్యాఖ్యలతోనూ వార్తల్లో ఉండే అదా శర్మ తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జీవితంలో రిస్క్ ఉంటేనే కెరీర్ బాగుంటుంది.. ది కేరళ స్టోరీస్ విడుదలయ్యే వరకు నాకు మంచి పాత్ర, స్క్రిప్ట్ ఎప్పుడు దొరుకుతుందా అని నిరీక్షించా. ఈ సినిమా చేసిన తర్వాత నా జీవితమే మారిపోయింది.. ఈ సినిమాతో వచ్చిన పాపులారిటీతోనే బస్తర్: ది నక్సల్ స్టోరీ చేశాను. ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యే సమయంలో బెదిరింపు కాల్స్ వచ్చాయి. మనదేశంలోని సగం మంది నన్ను అంతం చేయాలని కోరుకున్నారు. అయితే మిగిలిన సగం మంది అండగా నిలిచారు అని అదా శర్మ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా.. నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











