For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇన్నాళ్లు గ్లామర్ ట్రీట్.. ఇప్పుడు అబ్బాయి కావాలంటూ ట్వీట్.. ఓపెన్ స్టేట్‌మెంట్‌తో హీరోయిన్‌ సంచలనం

  |

  సోషల్ మీడియాకు వేడి పుట్టించడంలో అదా శర్మది అందె వేసిన చేయి. తన వంతుగా నెట్టింట అందాల విందు చేస్తూ ఎప్పుడూ ఏదో ఒక స్పెషల్ ట్రీట్ ఇచ్చే ఈ భామ ఈ సారి సడెన్ షాకిచ్చింది. సోషల్ మీడియా వేదికగా తనకు వరుడు కావాలంటూ బహిరంగ ప్రకటన ఇచ్చి సంచలనం సృష్టించింది. పైగా కండీషన్స్ అప్లై అని కూడా అంటోంది. ఆ వివరాలేంటో చూద్దామా..

  అశ్రద్ధ లేని అదా

  అశ్రద్ధ లేని అదా

  సినిమాల్లో అవకాశాలు అటూ ఇటూగా ఉన్నా సోషల్ మీడియాను మాత్రం ఏ మాత్రం అశ్రద్ధ చేయదు అదా. అందుకే ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌పై అదాకు అంతులేని ఫాలోయింగ్ ఉంది. ట్విట్టర్, ఇన్స్‌స్టాగ్రామ్ లకు కొత్త అందం తెచ్చే ఈ కుర్ర లేడీ తాజాగా చేసిన ఈ బహిరంగ ప్రకటన అందరినీ ఆశ్చర్య పర్చింది.

  అదా శర్మ సంచలన నిర్ణయం

  అదా శర్మ సంచలన నిర్ణయం

  వరుడు కావాలంటూ అదా శర్మ తీసుకున్న నిర్ణయం, దాన్ని ఆమె వ్యక్తపరిచిన విధానం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 'వరుడి కావలెను' అని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. పెళ్లి కుమార్తె గెటప్‌లో ఉన్న ఓ ఫోటోను షేర్ చేసింది అదా. అంతేకాదు తనకు కావాల్సిన వరుడికి ఉండాల్సిన లక్షణాలేంటో కూడా చెప్పేసింది.

  భలేగా ఉన్నాయ్ కండీషన్స్

  ''ఉల్లిపాయలు తినని వ్యక్తి అయి ఉండాలి. కులం, మతం, రంగు, షూ సైజ్, వీసా, స్విమ్మింగ్, కండలు ఇలాంటివి పట్టించుకోను. కానీ ప్రతీ రోజు 3 పూటలా నవ్వుతూ వండి పెట్టాలి. రోజూ షేవింగ్ ఖచ్చితంగా చేసుకోవాలి. సాంప్రదాయ దుస్తులనే దరించాలి. మద్యం,మాంసాహారం ఇంటా బయటా ఎక్కడా తీసుకోకూడదు. అతనికి రోజుకు 5 లీటర్ల స్వచ్ఛమైన నీరు అందిస్తా. అలాగే అన్ని భాషల భారతీయ చిత్రాలపై గౌరవం కలిగి ఉండాలి. అవి చూసి ఎంజాయ్ చేయాలి'' అంటూ తన కండీషన్స్ తెలిపింది అదా.

  పెళ్లి చేసుకోవాలనే ఆలోచన పడిందా?

  అదా శర్మ చేసిన ఈ ట్వీట్ చూసి.. ఆమె పెళ్లిపై మనసు మల్లిందా? అని ఆలోచనలో పడ్డారు ఆమె ఫ్యాన్స్. అప్పుడే పెళ్లి చేసుకుంటే మా అందాల విందు సంగతేంటి? అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. దీంతో అదా ఒక్కసారిగా జనం నోళ్ళలో నానిపోయింది.

  అదా గ్లామర్ మంత్రం

  అదా గ్లామర్ మంత్రం

  ఇక అదా శర్మ సినిమాల విషయానికొస్తే.. తెలుగులో సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత అదా శర్మ సరైన అవకాశాలు అంది పుచ్చుకోలేదు. చాలా కాలం తర్వాత రాజశేఖర్ సరసన `కల్కి` చిత్రంలో నటించింది. ఇందులో అదా గ్లామర్ యాంగిల్‌ని బాగా ఎలివేట్ చేసినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది.

  English summary
  Adah Sharma is a known face not just in South film industries but also in Bollywood. She tweeted as WANTED : Groom who does'nt eat onions. Caste, colour, religion, shoe size, visa, swimming abilities, bicep size, instagram followers, horoscope no bar He should be willing to cook 3 times a day with a smiling face and shave regularly.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X