For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకింగ్ లుక్: గుర్తు పట్టని విధంగా తయారైన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?

    |

    హీరోయిన్ అదాశర్మ తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసిన ఓ పిక్ వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కనిపెట్టండి అంటూ ఆమె తన అభిమానులకు చిన్న క్విజ్ పెట్టారు. వంకర తిరిగిన ముఖం, ఎత్తు పళ్లతో చూడటానికి కాస్త అసహ్యం వేసేలా ఉన్న ఈ ఫోటోపై రకరకాల కామెంట్లు వస్తున్నాయి.

    ఈ ఫోటోలో ఉన్నది మరెవరో కాదు... అదా శర్మ. అయితే ఎవరూ గుర్తు పట్టని విధంగా ఈ వేషం వేశారు. ఈ విషయం కనిపెట్టిన కొందరు ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో కనిపించేది నువ్వే, నీ ఫ్యూచర్ లుక్ ఇలానే ఉండబోతోంది, ఇలా పిజ్జా ముఖం నీకు తప్ప ఎవరికీ లేదు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

    Adah Sharma Ugly look goes viral

    తరచూ తన అందాలు ఆరబోస్తూ సెక్సీ పిక్స్ పోస్ట్ చేసే అదా వర్మ... ఇలాంటి అగ్లీ పిక్ పెట్టడం అందరినీ ఆశ్చర్య పరిచింది. అభిమానులను మెప్పించడం కోసం అందంగా కనిపించడం మాత్రమే కాదు, అప్పుడప్పుడు ఇలాంటి షాకులు కూడా ఇవ్వగలను అని చెప్పకనే చెప్పింది.

    అదా శర్మ ప్రస్తుతం 'మ్యాన్ టు మ్యాన్' అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి అబిర్ సేన్‌గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అదా శర్మ ట్రాన్స్ జెండర్‌గా నటిస్తోంది. మగాడిగా పుట్టిన ఒక వ్యక్తి లింగమార్పిడి చికిత్స ద్వారా స్త్రీగా మారి, మరొక మగాడికి ప్రేమించి, పెళ్లి చేసుకున్న తర్వాత ఏం జరిగింది? తనను పెళ్లాడిన వ్యక్తి అసలు విషయం తెలిసిన తర్వాత ఎలా రియాక్ట్ అయ్యాడు? ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి? అనేది రొమాంటిక్ కామెడీ స్క్రీన్ ప్లేతో చూపించబోతున్నారు.

    English summary
    Adah Sharma Ugly look goes viral. Adah Sharma is an Indian film actress who mainly appears in Hindi and Telugu language films. Sharma, after finishing her schooling, made her acting debut with a leading role in the 2008 Hindi language horror film 1920, a box office success.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X