Kriti Sanon మీరెప్పుడూ చూడనంత హాట్‌గా కృతి సనన్.. అలాంటి ఫొటోతో షాకిచ్చిన ఆదిపురుష్ హీరోయిన్!
సినిమా పరిశ్రమలో ఇటీవల కాలంలో బాగా వినిపిస్తోన్న హీరోయిన్స్ పేర్లలో కృతి సనన్ కూడా ఒకరు. హిట్స్ లేకపోయినప్పటికి వరుస సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఇండస్ట్రీకి వచ్చి పుష్కరకాలం దాటినప్పటికి చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా ఆమె ఖాతాలో లేకపోవడం విశేషం. వరుస ఫ్లాపులు ఆమెను వెంటాడుతున్నాయి.
ప్రస్తుతం ప్రభాస్‌తో నటిస్తున్న ఆదిపురుష్ సినిమాపై కృతి సనన్ గంపెడు ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా ఫలితం మీదనే ఆమె కెరీర్ ఆధారపడి ఉంది. తాజాగా ఓ మ్యాగ్‌జైన్ కవర్ పేజ్‌పై కృతి సనన్ ఫోటోను ప్రచురించింది. ఈ కవర్ పేజ్‌పై కృతి సనన్ ఎప్పుడూ లేనంత అందంగా కనిపించింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

మహేష్ బాబుతో తొలి సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు - సుకుమార్ దర్శకత్వంలో 2014లో వచ్చిన '1 నేనొక్కడినే' సినిమాతో కృతి సనన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మ్యాథ్స్‌లో 90 మార్కులు వచ్చాయని చెప్పడంతోనే కృతి సనన్‌ను హీరోయిన్‌గా తీసుకున్నానని దర్శకుడు సుకుమార్ అప్పట్లో చెప్పుకొచ్చారు.
భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. కాని కృతి సనన్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తరువాత నాగచైతన్యతో కృతి సనన్ జోడి కట్టింది. వీరిద్దరు కలిసి నటించిన 'దోచేయ్' సినిమా కూడా ఫ్లాప్‌గా నిలవడంతో.. తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో కృతి సనన్ బాలీవుడ్ బాట పట్టింది.

బాలీవుడ్‌లో వరుస అవకాశాలు.. కాని: బాలీవుడ్‌లో మాత్రం కృతి సనన్‌కు వరుస ఆఫర్లు వచ్చాయి. అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ వంటి సీనియర్ హీరోల సినిమాలతో పాటు, కార్తీక్ అర్యన్, టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్ వంటి యంగ్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్‌లో తనకున్న పరిచియాలతో డజన్‌కు పైగానే సినిమాల్లో నటించింది.
అయినప్పటికీ ఒక్క హిట్ కూడా ఆమెకు దక్కలేదు. దీంతో ఆమెపై ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. ప్రస్తుతం కృతి సనన్ ఆశలన్నీ కూడా ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఆదిపురుష్ సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ రాముడుగా నటిస్తుండగా, కృతి సనన్ సీత పాత్ర పోషిస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పన్స్ వచ్చింది.

ప్రభాస్‌తో రుమార్స్: ఇక ఆదిపురుష్ షూటింగ్ సమయంలోనే కృతి సనన్, ప్రభాస్‌ల గురించి రకరకాల రూమార్స్ తెర మీదకు వచ్చాయి. కృతి సనన్, ప్రభాస్‌ల మధ్య ఎఫైర్ ఉందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారని కొన్ని కథనాలు కూడా వెలువడ్దాయి. ఓ టెలివిజన్ ప్రొగ్రామ్‌లో హీరో వరుణ్ ధావన్ సైతం కృతి సనన్, ప్రభాస్‌ల ప్రేమయాణం గురించి బహిరంగంగానే చెప్పడం జరిగింది.
కృతి సనన్ హార్ట్‌లో ఒకరున్నారని.. అయితే ఆయన ముంబైకి చెందిన వ్యక్తి కాదని హింట్ ఇచ్చారు. దీంతో అందరు కూడా కృతి సనన్ హార్ట్‌లో ఉంది ప్రభాసేనని ఫిక్స్ అయిపోయారు. ఇక ప్రభాస్‌ను సైతం కృతి సనన్ గురించి నేరుగానే అడిగారు హీరో బాలకృష్ణ. ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాప్‌బుల్ షోకు గెస్ట్‌గా వచ్చిన ప్రభాస్‌ను.. కృతి సనన్ గురించి బాలకృష్ణ అడగడం జరిగింది. అలాంటిది ఏమీ లేదని..కృతి సనన్ జస్ట్ తన కో స్టార్ అని చెప్పి ప్రభాస్ తప్పించుకునే ప్రయత్నం చేశారు.

కవర్ పేజ్‌పై హాట్ ఫొజులు: కృతి సనన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటారామె. తాజాగా కృతి సనన్ మ్యాగ్‌జైన్ కోసం హాట్ హాట్ ఫోజులిచ్చింది.
బజార్ అనే మ్యాగ్‌జైన్ కవర్ పేజ్‌పై కృతి సనన్ ఫొటోను ప్రచురించారు. ఈ కవర్ పేజ్‌పై కృతి గతంలో ఎన్నడూ లేనంత గ్లామరస్‌గా కనిపించింది. ఈ ఫొటోలను తన సోషల్ మీడియా అకౌంట్స్ పోస్ట్ చేశారామె. క్షణాల్లోనే ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఆశలన్నీ ఆదిపురుష్‌పైనే: కృతి సనన్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రభాస్‌తో ఆదిపురుష్ సినిమాలో నటిస్తోంది. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. టి. సిరీస్ బ్యానర్‌పై భూషణ్‌కుమార్, క్రిషన్‌కుమార్, ఓంరౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించారు.
ప్యాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడదులైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. సీత లుక్‌లో కృతి సనన్ ఆకట్టుకున్నారనే చెప్పాలి. ఈ సినిమా ఫలితంపైనే కృతి సనన్ ఆధారపడి ఉంది. జున్ 16న విడుదల కానున్న ఆదిపురుష్ సినిమా కృతి సనన్‌కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











