అదితిరావు, సిద్దార్థ్ సహజీవనం అదుర్స్.. ఇన్స్‌టాగ్రామ్ రీల్స్‌తో రచ్చ చేసిన సెలబ్రిటీలు
దక్షిణాది సినీ పరిశ్రమలో సినీ తారలు అదితిరావు, సిద్దార్థ్ సహజీవనం వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సముద్రం సినిమా షూటింగులో ప్రేమలో పడ్డ ఈ ఇద్దరు సెలబ్రిటీలు గత కొద్దికాలంగా రిలేషన్‌షిప్‌ను కొనసాగిస్తున్నారు. అదితిరావుతోపాటు ముంబైకి మకాం మార్చిన సిద్దార్థ్.. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలతో రచ్చ చేస్తున్నారు. తాజాగా వీరిద్దరూ డ్యాన్స్ చేసిన వైరల్ వీడియో? వారి వ్యక్తిగత జీవితాల గురించిన వివరాల్లోకి వెళితే..

అదితిరావు, సిద్దార్థ్ మ్యారేజ్ బ్రేకప్
హీరో సిద్దార్థ్, అదితిరావు ఇద్దరికి మ్యారేజ్ బ్రేకప్ జరిగింది. చాలా కాలంగా వీరిద్దరూ ఒంటరిగానే లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. వారి మ్యారేజ్ బ్రేకప్ తర్వాత సిద్దార్థ్ రిలేషన్ షిప్, అదితిరావు రిలేషన్‌షిప్ గురించి వార్తలు బాగానే వచ్చాయి. కానీ అవి ఎక్కువ కాలం మీడియాలో నిలబడలేదనే విషయం తెలిసిందే.

మహసముద్రం షూటింగులో
RX 100 దర్శకత్వం వహించిన మహాసముద్రం సినిమా షూటింగు సమయంలో అదితిరావు, సిద్దార్థ్‌లు దగ్గరయ్యారు. అప్పటి నుంచి వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. అయితే కొంతకాలం చాటుమాటుగా తమ అఫైర్ వ్యవహారాన్ని కొనసాగించినా.. ఆ తర్వాత ఓపెన్‌గా మీడియాకు కనిపించడం మొదలుపెట్టారు.

ముంబైలో సిద్దూ, అదితి రొమాన్స్
చెన్నైలో జరిగిన పొన్నియన్ సెల్వన్ ఈవెంట్‌లో కూడా సిద్దార్థ్, అదితిరావు ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఆ తర్వాత ముంబైలో పలుమార్లు మీడియాకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు. ఓ సందర్భంలో ఫోటోగ్రాఫర్లపై సిద్దూ చిర్రుబుర్రులాడారు. అయితే ఇప్పుడు తమ అఫైర్ గురించి చెప్పుకోవడానికి వెనుకాడటం లేదు. తాజాగా వదిలిన రీల్ వీడియోను అందుకు సాక్ష్యంగా నిలిచింది.

సిద్దూ, అదితి ఇన్స్‌టాగ్రామ్ రీల్
సహజీవనం చేస్తున్న అదితిరావు, సిద్దార్థ్ ఇద్దరు కలిసి ఇన్స్‌టాగ్రామ్ కోసం రీల్ చేశారు. విశాల్ నటించిన ఎనిమి సినిమాలోని తుమ్ తుమ్ పాటకు స్టెప్పులేస్తూ అదరగొట్టారు. లయబద్దంగా, రొమాంటిక్‌గా డ్యాన్స్ చేస్తూ అద్బుతమైన కెమిస్ట్రీని పండించారు. వీరిద్దరి వీడియోపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు.
అదితి, సిద్దార్థ్ కెమిస్ట్రీపై నెటిజన్లు
అదితిరావు, సిద్దార్థ్ రీల్ వీడియోపై నెటిజన్లు భారీగా కామెంట్లు వదిలారు. మీ ఇద్దరి జంట బాగుంది. ఏంటీ మీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారా? మరి పెళ్లి ఫోటో ఎప్పుడు పెడుతున్నారు? మాకు ఇలాంటి మంకీ డ్యాన్సుల చాలా కావాలి? మీరిద్దరూ క్యూట్‌గా ఉన్నారు అంటూ ఇన్స్‌టాగ్రామ్ రీల్‌పై కామెంట్లు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











