‘అలాంటి వ్యక్తితో రొమాన్స్ చేయలేను.. అందుకే ఆవిషయాలకు దూరం’
హిందీ, తెలుగు, తమిళం అలా ఏ భాషలోనైనా, ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే నటి ఎవరైనా ఉన్నారా అంటే చటుక్కున గుర్తొచ్చేది అదితిరావు హైదరీ. భాష, ప్రాంతమనే సంబంధం లేకుండా విభిన్నమైన పాత్రలతో అలరిస్తున్నారు. తాజాగా ఆంగ్లమీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితానికి సంబంధించిన పలు విషయాలను పంచుకొన్నారు. తన వైవాహిక, రొమాంటిక్ జీవితంపై ఏం చెప్పారంటే..

నాకు వారే మానసిక బలం
నటిగా నాకు మానసికంగా బలాన్ని ఇచ్చేది ఫ్యాన్స్. నాతో ఫ్యాన్స్ చాలా బాగా ఉంటారు. వారితో ఎలాంటి ఇబ్బంది ఉండదు. నాతో ఫొటో దిగితే చాలు వారికి చెప్పలేనంత సంతోషం. నాకు కూడా అలాంటివి మానసికంగా చాలా ధైర్యాన్ని ఇస్తాయి. ట్రోల్స్ విషయం నాకు కొన్నిసార్లు బాధిస్తాయి. కానీ నా ఫ్యాన్స్ ఎప్పుడూ ట్రోల్స్ చేయరు అని అదితిరావు అన్నారు.

రూమర్లు బాధిస్తాయి.. కానీ
నాపై వచ్చే రూమర్లను రూమర్లుగానే పరిగణిస్తాను. రోజు ఏదో ఒక రూమర్ నా వద్దకు వస్తూనే ఉంటుంది. నా ఇమేజ్‌కు భంగం కలిగించే ఏ రూమరైనా నాకు ఇబ్బందిగా ఉంటుంది. నెగిటివిటి అంటే నాకు నచ్చదు. నాపై వచ్చే రూమర్లు నాకే పరిమితం కావు.. వేరే వ్యక్తుల జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తాయి అని అదితిరావు పేర్కొన్నారు. మణిరత్నం సినిమాలో అదితిరావు అనే రూమర్ నాకు బాగా నచ్చుతుందన్నారు.

నా దృష్టిలో ప్రేమ అనేది
లవ్ అనేది ఇద్దరి మధ్య అవగాహనతో కూడిన మానసిక సంబంధం. మాటలు లేకపోయినా వారి మధ్య ఉండే కెమిస్ట్రీ ప్రేమను వ్యక్తం చేస్తుంది. ఆ ప్రేమ రొమాంటిక్‌గా ఉండవచ్చు. లేదా స్నేహంతో కూడినదైనా ఉండవచ్చు. నాపై స్వచ్ఛమైన ప్రేమను వ్యక్తం చేసే వారిపైనే నాకు అభిమానం, ప్రేమ కలుగుతుంది అని అదితి రావు పేర్కొన్నారు.

చెడుగా బిహేవ్ చేస్తే సహించను
జీవితంలో ఎదురుపడే వ్యక్తులు చాలా ఇబ్బందికరంగా ఉంటారు. తమ అధికారం, లేదా హోదాను చూపించి మనతో చెడుగా బిహేవ్ చేయడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వారికి రొమాంటిక్ పరంగా, లేదా ఫ్రెండ్‌ఫిప్ పరంగా నేను చాలా దూరంగా ఉంటాను. నాకు అంటూ ఓ మనసు ఉంటుంది. దానికి తగినట్టుగా ఉండే వ్యక్తులతోనే రొమాంటిక్ ఉండాలని, లేదా ఫ్రెండ్‌షిప్ చేయాలని అనుకొంటాను అని అదితిరావు అన్నారు.

నీ మనసు చెప్పింది వినాలి
ఎవరితోనైనా.. ఎలాంటి రిలేషన్ పెట్టుకోనే ముందు నీ మనసు చెప్పే విషయాన్ని వినాలి. నీ హృదయం చెప్పే విషయాలు విన్నప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా దానిని తట్టుకొనే శక్తి నీకు కలుగుతుంది. నీవు ఏ ప్లేస్‌లో ఉన్నా నీతో ఉండే మనిషి స్వభావాన్ని బట్టి రొమాంటిక్ మూడ్ ఫ్రెష్‌గా ఉంటుంది. అప్పుడే బాహ్య ప్రపంచానికి దూరమైన మానసికంగా సంతోషంగా ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది అని అదితిరావు అన్నారు.


Click it and Unblock the Notifications











