అటువైపు చూడాలంటే భయం.. రోత పుట్టించేలా.. అదితిరావు
అద్దంలో ముఖం చూసుకుంటే మనం ఎలా ఉన్నామో తెలుస్తుందనే ఒకప్పుడు... ఇప్పుడు మనం గురించి తెలుసుకోవాలంటే గూగుల్‌లో వెతికి తెలుసుకోవాల్సిందే. ఇంటర్నెట్ ప్రభంజనంతో చిటికెలో అన్ని తెలుసుకొనే వీలు కలిగింది. అయితే అందాల భామ అదితి రావు హైదరీకి గూగుల్‌లో తన గురించి సెర్చ్ చేయాలంటే విపరీతమైన భయమట. ఈ ఇటీవల ఓ షూటింగ్‌లో తన భయానికి కారణం చెప్పింది.
ఓసారి నా పేరుతో గూగుల్‌లో సర్చ్ చేశాను. ఆ తర్వాత చూసుకొంటే చాలా దరిద్రంగా నా ఫోటోలు కనిపించాయి. వాటిని చూడగానే రోత పుట్టించేలా ఉన్నాయి. చాలా దారుణంగా మార్ఫింగ్ చేసిన ఫొటోలు నాకు కనిపించాయి. దాంతో అప్పటి నుంచి గూగుల్ నా గురించి సర్చ్ చేయడం మానేశాను అని అదితి రావు వెల్లడించింది.

2009లో యే సాలి జిందగీ చిత్రంతో బాలీవుడ్‌లోకి ప్రవేశించిన ఈ బ్యూటీ భూమి, రాక్‌స్టార్, మర్డర్ 3, ఢిల్లీ 6, దేస్ దేవ్ అనే చిత్రాల్లో నటించింది. తెలుగులో సమ్మోహనం, అంతరిక్షం సినిమాలో నటించి మెప్పించింది. ఇక మణిరత్నం తీసిన చెలియా, నవాబ్ చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకొన్నది. ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా మారారు.
త్వరలోనే తాను తన సొంత నివాసంలో ఓ విందును ఏర్పాటు చేయాలనుకొంటున్నాను. ఆ పార్టీకి బాలీవుడ్ ప్రముఖులతోపాటు షారుక్ ఖాన్, కరణ్ జోహర్‌ను ఆహ్వానించాలనుకొంటున్నాను అని అదితి చెప్పారు.
ప్రస్తుతం తెలుగులో వీ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నాని, సుధీర్ నటిస్తుండగా, అదితి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే తమిళంలో సైకో అనే చిత్రంలో నటిస్తున్నది.


Click it and Unblock the Notifications











