సిద్దార్థతో అలా ప్రేమలో పడ్డా.. హైదరాబాదీ బ్యూటీ పెళ్లి ముచ్చట్లు..
Aditi Rao Hydari - Siddharth:గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో పెళ్లి భజాలు మోగుతున్నాయి. ఇండస్ట్రీ లవ్ బర్డ్స్ తమ బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పుతూ మ్యారేజ్ లైఫ్ లోకి ఏంట్రీ ఇస్తున్నారు. తాజాగా మరో జంట తమ లవ్ స్టోరీకి శుభం కార్డు వేసి.. పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఇంతకీ ఆ ప్రేమ జంట ఎవరో? మీరు కూడా లూక్కేయండి. ఈ లవ్ బర్డ్ ఎవరని ఆలోచిస్తున్నారు. వారు ఎవరో కాదండీ.. మన బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్ - హీరోయిన్ అదితి రావ్.
గత కొద్ది రోజులుగా బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో సిద్దార్ధ్, హైదరాబాదీ హీరోయిన్ అదితీరావుతో ప్రేమలో ఉన్నారు. మహాసముద్రం సినిమాలో కలిసి నటించిన వీరికి స్నేహం కుదిరింది. ఆ స్నేహం కాస్తా ముదిరి ప్రేమగా మారింది. గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో హీరో సిద్ధార్థ్ - హీరోయిన్ అదితి రావ్ లు డేటింగ్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీంతో గత వారం రోజుల క్రితం వీళ్ళ పెళ్లి గురించి భారీ ఎత్తున చర్చ జరిగిందట. వారి పెళ్లి తెలంగాణలోని వనపర్తి ఆలయంలో జరుగుతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా వీటిపై స్పందించిన హీరోయిన్ అదితిరావ్ స్పందించారు. నిశ్చితార్థం, పెళ్లి ఎక్కడ జరగబోతుందనే విషయాలపై అందరికీ ఓ క్లారిటీ ఇచ్చారు. అలాగే.. హీరో సిద్ధార్థ్ తో తన ప్రేమ విషయాలను షేర్ చేసుకున్నారు. మహాసముద్రం షూటింగ్ సమయంలో సిద్ధార్థ్ తనకు పరిచయం అయ్యాడని చెప్పారు. కొంతకాలానికే తాము బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యామని అన్నారు. అలాగే..తనకు తన నాన్నమ్మ అంటే నాకెంతో ఇష్టమనీ, అన్ని విషయాలు ఆమెతో షేర్ చేసుకునేదాన్ని అని పేర్కొన్నారు. అయితే.. కొన్నేళ్ల క్రితం ఆమె కన్నుమూశారనీ, ఈ విషయం సిద్ధార్థ్‌కు తెలుసు అని అదితి అన్నారు. సిద్దార్థ తన ప్రేమను వ్యక్తపరిచిన తీరు తనకెంతో నచ్చిందన్నారు. ఇక పెళ్లి వేడుక గురించి మాట్లాడుతూ.. తమకు నిశ్చితార్థం జరిగిన వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలోనే తమ పెళ్లి కూడా ఉంటుందని చెప్పారు. ఆ ఆలయం మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైందనీ, పెళ్లి కూడా అక్కడే ఉంటుంది. పెళ్లి తేదీ ఫిక్స్ అయ్యాక తామిద్దరం అనౌన్స్ చేస్తామని అన్నారు.
ఇటీవల ఈ వార్తలపై హీరో సిద్దార్థ కూడా స్పందించారు. తాము రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నామని చాలామంది మాట్లాడుకుంటున్నారనీ, సీక్రెట్, ప్రైవేట్ అనే పదాలకు ఎంతో వ్యత్యాసం ఉందని అన్నారు. తమ ఎంగేజ్‌మెంట్‌కు ఎవరినైతే పిలవలేదో వాళ్లు మాత్రమే పిలిచామనీ, కానీ, దీనిని సీక్రెట్ ఫంక్షన్‌గా భావిస్తున్నారని కాస్త ఫైర్ అయ్యారు. నిజం చెప్పాలంటే.. కుటుంబసభ్యుల సమక్షంలో ఎంగేజ్ మెంట్ ప్రోగ్రామ్ జరిగిందనీ, వెడ్డింగ్ డేట్‌ను ఉద్దేశించి.. ఇదేమీ షూటింగ్ డేట్ కాదనీ, అది లైఫ్‌టైమ్ డేట్ అని, పెద్దల నిర్ణయం ప్రకారం జరుగుతుందనీ, వాళ్లు ఎప్పుడు ఏం జరగాలనుకుంటే ఆ సమయంలో జరుగుతుందని ఓ క్లారిటీ ఇచ్చారు.

ఇక వీళ్ల కెరీర్ విషయానికి వస్తే... మల్టి టాలెంటెడ్ హీరో సిద్దార్థ.. 2003లో బాయ్స్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తొలి సినిమాతోనే యూత్ లో క్రేజీ పాపులరిటీ తెచ్చుకున్నారు. దీంతో బ్యాక్ టు బ్యాక్ హిట్ మూవీస్ తో భారీ విజయాలు అందుకున్నారు. తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలోనే కాదు.. హిందీ ఇండస్ట్రీలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో సిద్దార్థ. తెలుగులో నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు వంటి భారీ హిట్స్ అందుకున్నారు. టాలీవుడ్ లోనూ హై ఫ్యాన్ ఫాలోయింగ్ కైవసం చేసుకున్నారు.
అదితి రావ్ హైదరీ వనపర్తి రాజవంశస్తురాలు. ప్రజాపతి అనే మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే క్రేజీ పాపులరిటీ.. ఆనతి కాలంలోనే బాలీవుడ్ పై కన్నేసింది. తొలుత 'ఢిల్లీ 6'మూవీతో బీ టౌన్ లోకి అడుగుపెట్టి అభిషేక్ బచ్చన్ తో స్టెప్పులేసింది. ఆ తరువాత రాక్ స్టార్, వాజిర్, పద్మావత్ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. మరోవైపు.. కోలీవుడ్ లోను ఈ అమ్మడు అడుగుపెట్టి.. కాట్రు వెలియాడై, చెక్క చివంత వానం, సైకో మూవీతో ప్రేక్షకులను మెప్పించింది. ఇక తెలుగులో సమ్మోహనం, వీ, మహాసముద్రం వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. వెండి తెరపై గ్లామర్ ఇచ్చిన ఈ బ్యూటీ ఇటీవల వెబ్ సిరీస్ లవైపు ఫోకస్ పెట్టింది. హీరామండి అనే వెబ్ సిరీస్ తో నెటిజన్లు ఫిదా చేసింది. ఇలా స్టార్ లవర్ త్వరలో ఒక్కటి కాబోతున్నారు. ఈ విషయం వైరల్ కావడంతో అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా వీళ్ళకి విషెస్ తెలియజేస్తున్నారు.


Click it and Unblock the Notifications











